యూకేకి పాకిన కెనడా గొడవ : గురుద్వారాలో భారత హైకమీషనర్‌ను అడ్డుకున్న ఖలిస్తాన్ మద్ధతుదారులు
TeluguStop.com
ఖలిస్తాన్ వేర్పాటువాది, ఖలిస్తాన్ టైగర్ ఫోర్స్ అధినేత హర్దీప్ సింగ్ నిజ్జర్( Hardeep Singh Nijjar ) హత్య వెనుక భారత ప్రభుత్వ ఏజెంట్ల హస్తం వుందంటూ కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్న సంగతి తెలిసిందే.
ఈ వ్యాఖ్యలతో కెనడాతో పాటు ప్రపంచవ్యాప్తంగా వున్న ఖలిస్తాన్( Khalistan ) మద్ధతుదారులు, సిక్కులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
పలు చోట్ల భారత ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళనలు సైతం జరుగుతున్నాయి.తాజాగా కెనడా గొడవ యూకేకి పాకింది.
బ్రిటన్‌లో భారత రాయబారిని ఓ గురుద్వారాలోకి ప్రవేశించకుండా ఖలిస్తాన్ మద్ధతుదారులు అడ్డుకోవడం చర్చనీయాంశమైంది.
వివరాల్లోకి వెళితే.శుక్రవారం స్కాట్లాండ్‌లోని( Scotland ) అల్బర్ట్ డ్రైవ్‌లోని గ్లాస్గో గురుద్వారా కమిటీ సభ్యులతో భేటీ అయ్యేందుకు యూకేలోని భారత హైకమీషనర్ విక్రమ్ దొరైస్వామి(
Vikram Doraiswami ) వచ్చారు.
ఈ విషయం తెలుసుకున్న ఖలిస్తాన్ సానుభూతిపరులు ఆయనను గురుద్వారాలోనికి వెళ్లకుండా అడ్డుకున్నారు. """/" /
లోపలికి వెళ్లనిచ్చేది లేదని.
చివరికి గురుద్వారా( Gurudwara ) సిబ్బందిని కూడా బెదిరించారు.ఈ క్రమంలో అక్కడ స్వల్ప ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయి.
అయితే ఖలిస్తాన్ సానుభూతిపరులు వెనక్కి తగ్గకపోవడంతో చేసేదేం లేక దొరైస్వామి చివరికి అక్కడి నుంచి వెనుదిరిగారు.
ఈ ఘటనను భారత ప్రభుత్వం సీరియస్‌గా తీసుకుంది.తమ రాయబారిని అడ్డుకున్న విషయాన్ని యూకే ప్రభుత్వం( UK Govt ) దృష్టికి తీసుకెళ్లింది.
దీనిపై స్థానికంగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.అయితే గురుద్వారా కమిటీ ఆహ్వానం మేరకే దొరైస్వామి అక్కడికి వచ్చినట్లుగా తెలుస్తోంది.
"""/" /
ప్రస్తుతం భారత్, కెనడా మధ్య ఉద్రిక్త పరిస్ధితుల నేపథ్యంలో బ్రిటన్‌లోనూ ఖలిస్తాన్ గ్రూపులు యాక్టీవ్ అవుతున్నట్లుగా నిఘా వర్గాలు భావిస్తున్నాయి.
ఈ ఏడాది మార్చిలో ఖలిస్తాన్ వేర్పాటువాద నేత, వారిస్ పంజాబ్ దే చీఫ్ అమృత్‌పాల్ సింగ్( Amritpal Singh ) వ్యవహారం భారత్‌తో పాటు చాలా దేశాల్లో అలజడి రేపిన సంగతి తెలిసిందే.
లండన్‌లోని భారత హైకమీషన్ కార్యాలయం వద్ద ఖలిస్తాన్ వేర్పాటువాదులు నిరసన తెలపడంతో పాటు త్రివర్ణ పతాకానికి అవమానం కలిగేలా ప్రవర్తించారు.
బ్రిటీష్ ఇండియన్ గూఢచారి నూర్ ఇనాయత్ ఖాన్‌కు అరుదైన ఘనత .. ప్రదర్శనకు జార్జ్ క్రాస్ మెడల్