ఉక్రెయిన్ లోని భారతీయులకు కేంద్రం హెచ్చరిక...!!

రష్యా, ఉక్రెయిన్ ల మధ్య వార్ రోజు రోజుకు ముదురుతోంది.ఇరు దేశాల మధ్య గొడవలు మెల్ల మెల్లగా తగ్గుతున్నాయని భావిస్తున్న తరుణంలో ఒక్కసారిగా రష్యా కు ఊహించని ఎదురు దెబ్బ తగిలింది.

రష్యా, క్రిమియా ను కలిపే సముద్రం పై నిర్మించిన అతి పెద్ద రోడ్డు వంతెన పై భారీ పేలుడు జరగడంతో వంతెన కుప్ప కూలిన విషయం విధితమే.

రష్యా ఉక్రెయిన్ కు యుద్ద సైన్యాన్ని పంపేందుకు ఈ వంతెనే ప్రధాన రహదారి.

అంతేకాదు రష్యా అధ్యక్షుడు పుతిన్ కళల ప్రాజెక్ట్ లలో ఇది ప్రధానమైనది అలాంటిది పూర్తిగా ఈ వంతెనే దాడిలో ద్వంసం అవడంతో పుతిన్ ఆగ్రహం వ్యక్తం చేశారు.

తన ఉన్నత అధికారులతో సమావేశం అనంతరం ఉక్రెయిన్ కి తగిన బుద్ది చెప్పాలని అనుకున్నారు.

దాంతో ఊహించని విధంగా ఒక్కసారిగా ఉక్రెయిన్ పై క్షిపణుల దాడులతో విరుచుకు పడింది.

ఈ దాడులతో మళ్ళీ ఉక్రెయిన్ లో అలజడి మొదలయ్యింది.ఈ నేపద్యంలో ఉక్రెయిన్ లో ఉంటున్న భారతీయుల భద్రత విషయంలో ఆందోళన వ్యక్తం చేసింది భారత ప్రభుత్వం.

భారతీయులకు కొన్ని కీలక సూచనలు చేస్తూ హెచ్చరికలు జారీ చేసింది. """/"/ రష్యా దాడులు మరింత పెరిగే అవకాసం ఉన్న నేపధ్యంలో ఉక్రెయిన్ లో భారతీయులు ఎవరూ అనవసరంగా బయటకు రావద్దని సూచించింది.

ప్రయాణాలకు ప్లాన్ చేసుకున్న వారు, ఉక్రెయిన్ కు వెళ్లాలని భావిస్తున్న వారు వారి నిర్ణయాలని విరమించుకోవాలని హెచ్చరించింది.

అంతేకాదు ఉక్రెయిన్ లో ఉండే భారతీయులు వారి వారి వివరాలు భారత ఎంబసీ తో పంచుకోవాలని సూచించింది.

మీ వివరాలు ఇవ్వడం వలన అత్యవసర పరిస్థితులలో మీకు సహాయ సహకారాలు అందించే వీలు ఉంటుందని తెలిపింది.

అలాగే ఉక్రెయిన్ ప్రభుత్వం జారీ చేసే సూచనలు, మార్గదర్సకాలని పాటించాలని మీరు సురక్షితంగా ఉండాలంటే వీటిని పాటించడం తప్పనిసరని వీలైనంత మేరకు బయటకు రాకపోవడం ఎంతో మంచిదని భారత ప్రభుత్వం ఉక్రెయిన్ లోని భారతీయులకు సూచించింది.

అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో నందమూరి బాలకృష్ణ పోటీ చేశారా.. ఎన్ని ఓట్లు పడ్డాయంటే?