ఆఫ్ఘనిస్తాన్: కాబూల్‌లో సురక్షితంగానే ఇండియన్ ఎంబసీ.. ఉద్యోగుల ఖాతాల్లో ఆగస్టు వేతనాలు

తాలిబన్ల ఆక్రమణతో ఆఫ్ఘనిస్తాన్‌లో కల్లోల పరిస్ధితులు నెలకొన్న సంగతి తెలిసిందే.ఈ నేపథ్యంలో అన్ని దేశాల రాయబార కార్యాలయాలను మూసివేయడంతో పాటు రాయబారులు, దౌత్య సిబ్బందిని స్వదేశానికి తరలించారు.

ఆఫ్ఘ‌నిస్తాన్‌లో భార‌త్‌కు చెందిన నాలుగు దౌత్య కార్యాల‌యాలు ఉన్నాయి.కాబూల్‌లో అద‌నంగా మ‌రో ఎంబ‌సీ ఉన్న‌ది.

కాంద‌హార్‌, హీర‌త్‌తో పాటు మ‌జార్ యే ష‌రీఫ్ ప‌ట్ట‌ణంలోనూ భార‌తీయ కాన్సులేట్ ఉంది.

అయితే తాలిబ‌న్ ఫైటర్లు ఆ దేశాన్ని స్వాధీనం చేసుకోవ‌డానికి కొన్ని రోజుల ముందే మ‌జార్ యే ష‌రీఫ్ కాన్సులేట్‌ను భారత్ మూసివేసింది.

అనంతరం దౌత్య సిబ్బందిని పలు దఫాలుగా కేంద్ర ప్రభుత్వం స్వదేశానికి తరలించింది.మరోవైపు కాంద‌హార్‌, హీర‌త్ న‌గ‌రాల్లో ఉన్న భార‌తీయ దౌత్య కార్యాల‌యాలను తాలిబ‌న్లు ముట్ట‌డించిన సంగతి తెలిసిందే.

ఆ కార్యాల‌యాల్లో ఉన్న కీలక పత్రాలను, పార్క్ చేసిన కార్ల‌ను తీసుకువెళ్లిన‌ట్లు కథనాలు వెలువడ్డాయి.

అయితే ప్రస్తుతం కాబూల్‌లోని భారత రాయబార కార్యాలయం సురక్షితంగానే వున్నట్లు విదేశాంగ శాఖ వర్గాలు చెబుతున్నాయి.

యథావిధిగానే కార్యకలాపాలు కొనసాగిస్తుండటంతో పాటు స్థానిక ఉద్యోగుల వేతనాలను కూడా సకాలంలోనే చెల్లించినట్లు విదేశాంగ శాఖకు చెందిన ఓ అధికారి జాతీయ మీడియాకు తెలిపారు.

కార్యాలయ నిర్వహణ ఛార్జీలను కూడా సకాలంలోనే చెల్లించినట్లు సదరు అధికారి వెల్లడించారు.విదేశాంగ మంత్రిత్వ శాఖ కూడా కాబూల్‌లోని రాయబార కార్యాలయంతో ఎప్పటికప్పుడు టచ్‌లోనే వుందని ఆయన చెప్పారు.

అయితే తాలిబన్ల రాకతో రాజధానిలో ఇంకా ఉద్రిక్త పరిస్ధితులు కొనసాగుతుండటంతో కాబూల్‌లోని బ్యాంకులు పూర్తి స్థాయిలో పనిచేయడం లేదని నివేదికలు చెబుతున్నాయి.

అందువల్ల అక్కడి భారత రాయబార కార్యాలయంలో పనిచేసే ఉద్యోగులు నగదు విత్ డ్రా చేసుకోవడంలో ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం వుందని సదరు అధికారి పేర్కొన్నారు.

అలాగే కొంతమంది భారతీయులు ఇంకా ఆఫ్ఘనిస్తాన్‌లోనే చిక్కుకుపోయారని.వారిని సురక్షితంగా ఇండియాకు తరలించేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోందని ఆయన చెప్పారు.

అయితే అమెరికా, నాటో దళాలు ఆఫ్ఘన్‌ను వీడి వెళ్లిపోవడంతో కాబూల్ ఎయిర్‌పోర్ట్‌ను తాలిబన్లు మూసివేశారని, దీనితో పాటు విమానాల కదలికలను కూడా నిషేధించారని ఆ అధికారి వెల్లడించారు.

"""/"/ ఈ పరిణామాల నేపథ్యంలో కాబూల్‌లో చిక్కుకున్న భారతీయుల కోసం తరలింపు చర్యలు త్వరలో ప్రారంభమయ్యే అవకాశం వుందని కేంద్ర విదేశాంగ శాఖ తెలిపింది.

తరలింపుకు సంబంధించి కాబూల్‌లోని ఇండియన్ ఎంబసీ సిబ్బంది తాలిబన్లతో చర్చలు జరుపుతున్నట్లుగా వెల్లడించింది.

ఇదే సమయంలో కాబూల్‌లోని భారత రాయబార కార్యాలయంలో ఎంతమంది ఉద్యోగులు పనిచేస్తున్నారనే దానిపై విదేశాంగ శాఖ క్లారిటీ ఇవ్వలేదు.

ఇప్పటికైనా రోటీన్ సినిమాలను చేయడం ఆపకపోతే తెలుగు ఇండస్ట్రీ పరువు పోతుందా..?