విద్యారంగం అభివృద్ధికి భారత సంతతి వ్యాపారవేత్త చొరవ.. కొత్త వ్యవస్థకు శ్రీకారం

విద్యారంగం అభివృద్ధికి భారత సంతతి వ్యాపారవేత్త చొరవ కొత్త వ్యవస్థకు శ్రీకారం

గ్లోబల్ టీచర్ ప్రైజ్ వ్యవస్థాపకుడు, భారత సంతతికి చెందిన వ్యాపారవేత్త సన్నీ వర్కీ బుధవారం విద్యా రంగానికి సంబంధించి కీలక నిర్ణయం తీసుకున్నారు.

విద్యారంగం అభివృద్ధికి భారత సంతతి వ్యాపారవేత్త చొరవ కొత్త వ్యవస్థకు శ్రీకారం

విద్యా ఫలితాలను మెరుగుపరిచే జ్ఞానాన్ని పంచుకునే విధంగా పాఠశాలలకు సహాయపడేందుకు అంతర్జాతీయ స్థాయిలో ఓ ప్రాతినిథ్య సంస్థను ప్రారంభించారు.

విద్యారంగం అభివృద్ధికి భారత సంతతి వ్యాపారవేత్త చొరవ కొత్త వ్యవస్థకు శ్రీకారం

‘‘ ది న్యూ గ్లోబల్ ఇండిపెండెంట్ స్కూల్స్ అసోసియేషన్ (జీఐఎస్ఏ) భాగస్వామ్యంతో ఐక్యరాజ్యసమితి సస్టైనబుల్ డెవలప్‌మెంట్ గోల్ (ఎస్‌డీజీ) 4ను సాధించేందుకు ఆయన ప్రణాళికను రూపొందించారు.

2030 నాటికి అందరిని కలుపుకుని, నాణ్యమైన విద్యను అందించాలన్నది ఈ ప్రాజెక్ట్ లక్ష్యం.

ఇందుకోసం భారతదేశంలోని 3,40,000కు పైగా స్వతంత్ర పాఠశాలలకు వర్కీ పిలుపునిచ్చారు.విభిన్న నేపథ్యాల నుంచి వచ్చే పిల్లలకు విద్యను అందించే ఈ ఫ్రంట్ లైన్ నైపుణ్యం ప్రపంచవ్యాప్తంగా విద్యను మెరుగుపరచడానికి ప్రయత్నాలను మరింత ప్రభావవంతంగా మారుస్తుంది.

ఇటీవలి ప్రపంచ బ్యాంక్ డేటా ప్రకారం.భారతదేశంలోని మాధ్యమిక పాఠశాల విద్యార్ధులలో 50 శాతం , ప్రాథమిక పాఠశాల విద్యార్ధులలో 13 శాతం మంది ఈ స్వతంత్ర సంస్థలో నమోదు చేసుకున్నారు.

జీఐఎస్ఏ చొరవకు మద్ధతుగా ఆర్గనైజేషన్ ఫర్ ఎకనామిక్ కో ఆపరేషన్ అండ్ డెవలప్‌మెంట్ (ఓఈసీడీ) కూడా పనిచేయనుంది.

యునెస్కో అంచనాల ప్రకారం .ప్రపంచవ్యాప్తంగా 350 మిలియన్ల మంది పిల్లలు స్వతంత్ర పాఠశాలల విభాగంలో చదువుతున్నారు.

అందరికీ నాణ్యమైన విద్యను సాధించే లక్ష్యాన్ని ఎలా వేగవంతం చేయాలనే దానిపై ఉన్నత స్థాయి చర్చ కోసం ప్రభుత్వాలు, వ్యాపారవేత్తలు, ఎన్‌జీవోలు, మేధావులుతో వార్షిక సమావేశాన్ని నిర్వహించాలని జీఐఎస్ఏ లక్ష్యంగా పెట్టుకుంది.

ఉపాధ్యాయులు వృత్తిపరమైన అభివృద్ధికి తోడ్పాటు అందించడంతో పాటు టీచింగ్, లెర్నింగ్‌లో సాంకేతికతను ఉపయోగించాలని నోర్డ్ ఆంగ్లియా ఎడ్యుకేషన్ సీఈవో, జీఐఎస్ఏ ఛైర్మన్ ఆండ్రూ ఫిట్జ్ మౌరిస్ అన్నారు.

"""/"/ ఇక సన్నీ వర్కీ విషయానికి వస్తే.1957 ఏప్రిల్ 9న కేరళలోని రన్నీలో జన్మించారు.

ఆయనకు రెండేళ్లు వున్నప్పుడే వీరి కుటుంబం దుబాయ్‌కి వలస వెళ్లింది.తర్వాత తిరిగి కేరళకు వచ్చిన అనంతరం కొల్లామ్‌లో ఆయన విద్యాభ్యాసం జరిగింది.

అయితే పేదరికం కారణంగా అంత చిన్న వయసులోనే సన్నీ రోడ్డుపై పళ్లు అమ్మేవారు.

యూకేలో ఉన్నత విద్యను చదివిన ఆయన.తర్వాత దుబాయ్‌కి తన మకాం మార్చారు.

గ్లోబల్ ఎడ్యుకేషన్ మేనేజ్‌మెంట్ సిస్టమ్స్‌ను స్థాపించారు.ఈ సంస్థ పాఠశాలలకు , ఇతర విద్యాసంస్థలకు సలహాలు అందిస్తుంది.

విద్యారంగంలో సన్నీ వర్కీ చేసిన సేవలకు గాను భారత ప్రభుత్వం 2009లో పద్మశ్రీ అవార్డ్‌తో సత్కరించింది.

100 కోట్ల క్లబ్బులో అక్కినేని నాగచైతన్య.. అక్కినేని హీరోల రేంజ్ పెరిగినట్టేనా?

100 కోట్ల క్లబ్బులో అక్కినేని నాగచైతన్య.. అక్కినేని హీరోల రేంజ్ పెరిగినట్టేనా?