నిర్లక్ష్యంగా డ్రైవింగ్, మహిళ కాళ్ల మీదుగా కారు .. భారతీయుడి విషయంలో దుబాయ్ కోర్ట్ తీర్పు
TeluguStop.com
నిర్లక్ష్యంగా వాహనం నడిపి మహిళను తీవ్రంగా గాయపరిచినందుకు గాను 39 ఏళ్ల భారతీయ వ్యక్తికి దుబాయ్ కోర్ట్ నెల రోజులు జైలు శిక్షతో పాటు 10,000 దిర్హామ్‌ల జరిమానా విధించింది.
మద్యం మత్తులో డ్రైవింగ్ చేయడంతో పాటు ప్రమాదం జరిగిన ప్రదేశం నుంచి పారిపోయినందుకు అతనిని దుబాయ్ కోర్ట్ ఆఫ్ అప్పీల్ కూడా దోషిగా నిర్ధారించింది.
అయితే అతని బహిష్కరణ ఆర్డర్‌ను మాత్రం రద్దు చేసినట్లు ది నేషనల్ నివేదించింది.
నిందితుడైన భారతీయుడు గతేడాది నవంబర్‌లో దుబాయ్‌లోని అల్ మంఖూల్ ప్రాంతంలోని హోటల్ కార్ పార్క్ నుంచి తన నిస్సాన్ పెట్రోల్‌ను నడుపుతూ.
పేవ్‌మెంట్‌పై కూర్చొని రోడ్డుపైకి కాళ్లు చాచిన మహిళను గుర్తించలేకపోయాడు.యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లో తాగి డ్రైవింగ్ చేయడానికి సంబంధించి జీరో టాలరెన్స్ విధానాన్ని అమలు చేస్తోంది.
దీనిని బట్టి ఇది క్రిమినల్ నేరం.యూఏఈ ట్రాఫిక్ చట్టంలోని ఆర్టికల్ 393 ప్రకారం.
రోడ్డు ప్రమాదంలో మరణానికి కారణమయ్యే నేరస్థులకు కనిష్టంగా నెల రోజుల నుంచి మూడేళ్ల జైలు శిక్ష లేదా భారీ జరిమానా విధించవచ్చని న్యాయ నిపుణులు చెబుతున్నారు.
"""/" /
ఇకపోతే.గత నెలలో రోడ్డు ప్రమాదంలో ఇద్దరి మృతికి కారణమైన భారతీయుడి విషయంలో దుబాయ్ కోర్ట్ సంచలన తీర్పు వెలువరించిన సంగతి తెలిసిందే.
బాధిత కుటుంబాలకు 80 వేల దిర్హామ్స్ ( భారత కరెన్సీలో రూ.18 లక్షలు) బ్లడ్ మనీతో పాటు 2 వేల దిర్హామ్స్ (భారత కరెన్సీలో రూ.
44,986) జరిమానా విధించింది.నిందితుడైన 48 ఏళ్ల భారతీయుడు గతేడాది జూన్ 3న రెసిడెన్షియల్ టౌన్ అయిన అల్ బార్షాలో నిర్లక్ష్యంగా కారు నడిపి ప్రమాదానికి కారణమయ్యాడు.
ఈ ఘటనలో సౌదీ అరేబియాకు చెందిన ఇద్దరు మహిళలు ప్రాణాలు కోల్పోగా, మరో నలుగురు గాయపడ్డారని దుబాయ్ ట్రాఫిక్ కోర్ట్‌కు దర్యాప్తు అధికారులు నివేదించారు.
"""/" /
ప్రధాన రహదారి మధ్యలో రివర్స్ చేస్తున్న కారును భారతీయుడు గమనించకుండా దానిని ఢీకొట్టినట్లు ది నేషనల్ వార్తా సంస్థ నివేదించింది.
దురదృష్టవశాత్తూ బాధితుల కారును బంగ్లాదేశ్‌కు చెందిన మరో డ్రైవర్ కూడా ఢీకొట్టడంతో ప్రమాద తీవ్రత పెరిగింది.
ఈ కేసుకు సంబంధించి సోమవారం జరిగిన విచారణ సందర్భంగా బాధిత కుటుంబానికి బ్లడ్ మనీ చెల్లించాలని న్యాయమూర్తి తీర్పు వెలువరించారు.
ఇదే కేసులో సహ నిందితుడిగా వున్న బంగ్లాదేశీ లైసెన్స్‌ను కోర్ట్ మూడు నెలల పాటు రద్దు చేసింది.
అలాగే 10,000 దిర్హామ్‌ల జరిమానా.3,20,000 దిర్హామ్‌ల బ్లడ్ మనీని చెల్లించాల్సిందిగా ఆదేశించింది.
మరో యంగ్ డైరెక్టర్ కు ఛాన్స్ ఇచ్చిన చిరంజీవి.. భారీ బ్లాక్ బస్టర్ హిట్ సాధిస్తారా?