అమెరికా : రోడ్డు దాటుతుండగా దూసుకొచ్చిన కారు.. భారతీయుడు దుర్మరణం

అమెరికాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో భారతీయుడు దుర్మరణం పాలయ్యాడు.మృతుడిని మరియప్పన్ సుబ్రమణియన్‌గా( Mariyappan Subramanian ) (32)గుర్తించారు.

ఇతను హెచ్‌సీఎల్ టెక్నాలజీస్‌లో టెస్ట్ లీడ్‌గా పనిచేస్తున్నట్లు అతని లింక్డ్ ఇన్ ప్రొఫైల్‌ చెబుతోంది.

సోమవారం ఫ్లోరిడా( Florida ) రాష్ట్రం టంపాలోని హిల్స్‌బరో కౌంటీలో మరియప్పన్ రోడ్డు దాటుతుండగా ఓ కారు అత్యంత వేగంగా అతనిని ఢీకొట్టింది.

ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన ఆయన ప్రాణాలు కోల్పోయారు.మరియప్పన్‌కు భార్య, నాలుగేళ్ల కుమారుడు వున్నారు.

వీరిద్దరూ భారత్‌లోనే నివసిస్తున్నారు.మరియప్పన్ ఇటీవలే జాక్సన్‌విల్లే నుంచి టంపాకు తన మకాంను మార్చాడు.

అతని మరణవార్తతో భారత్‌లోని కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. """/" / మరియప్పన్‌ కుటుంబాన్ని ఆదుకోవడానికి ‘‘GoFundMe Page’’లో విరాళాల సేకరణను ప్రారంభించారు.

మీ విరాళాలు జీవించివున్న అతని కుటుంబానికి ఆసరాగా నిలుస్తాయని పేజ్‌లో పేర్కొన్నారు.టంపా, జాక్సన్‌విల్లేలోని ( Tampa, Jacksonville )స్థానిక కమ్యూనిటీ గ్రూపులు మరియప్పన్ మృతదేహాన్ని భారతదేశానికి తరలించేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నాయి.

ఇదిలావుండగా.గత నెలలో అమెరికాలోని బోస్టన్‌లో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఎన్ఆర్ఐ దుర్మరణం పాలైన సంగతి తెలిసిందే.

వివరాల్లోకి వెళితే.మృతుడిని 47 ఏళ్ల విశ్వచంద్ కొల్లాగా గుర్తించారు.

ఇతను బోస్టన్‌లోని లోగాన్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్‌లో( Logan International Airport ) మిత్రుడిని రిసీవ్ చేసుకోవడానికి వచ్చాడు.

ఈ క్రమంలో విమానాశ్రయంలోని టెర్మినల్ బీ సమీపంలో తన కారు వద్ద వేచి వుండగా.

అదే సమయంలో డార్ట్‌మౌత్ ట్రాన్స్‌పోర్టేషన్ మోటార్ కోచ్ అతని కారును వేగంగా ఢీకొట్టింది.

ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన విశ్వచంద్ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. """/" / ఇక లెక్సింగ్టన్‌లో నివసిస్తున్న విశ్వచంద్ డేటా సైంటిస్ట్‌( Vishwachand ).

ఇటీవలే టకేడాలో డేటా అనలిటిక్స్‌ డైరెక్టర్‌గా పనిచేస్తున్నారు.గతంలో జాన్ హాన్‌కాక్, డెలాయిట్, బోస్టన్ కన్సల్టింగ్ గ్రూప్, ఐబీఎం, సన్ మైక్రోసిస్టమ్స్‌లో మేనేజ్‌మెంట్ కన్సల్టెంట్‌గా పనిచేశాడు.

అంతేకాదు.అమెరికాలోని ప్రవాస తెలుగు సంఘాలతోనే విశ్వచంద్‌కు బలమైన సంబంధాలున్నాయి.

ఎన్ఆర్ఐ వాసవి అసోసియేషన్, గ్రేటర్ బోస్టన్ తెలుగు అసోసియేషన్‌లో ఈయన యాక్టీవ్ మెంబర్‌గా తెలుస్తోంది.

విశ్వచంద్‌కు భార్య, ఇద్దరు పిల్లలు వున్నట్లుగా పోలీసులు చెబుతున్నారు.

వైరల్ వీడియో: ఎంతకు తెగించావురా.. కారు బ్యానెట్ పై మనిషి ఉన్నా కానీ..