మాతృదేశానికి అండగా నిలవండి .. ఆకాంక్షలు నెరవేర్చండి : ప్రవాస భారతీయులకు విదేశాంగ శాఖ సెక్రటరీ పిలుపు

ప్రవాస భారతీయులు తాము స్థిరపడిన దేశాలతో పాటు మాతృభూమి అభివృద్ధికి కూడా సహకరిస్తున్నారని అన్నారు భారత విదేశాంగ శాఖ సెక్రటరీ డాక్టర్ ఔసఫ్ సఫ్ సయీద్( Dr.

Ausaf Saf Saeed ).బెంగళూరులో జరిగిన గ్లోబల్ ఆర్గనైజేషన్ ఆఫ్ పీపుల్ ఆఫ్ ఇండియన్ ఆరిజిన్ (జీవోపీఐవో) అంతర్జాతీయ సదస్సులో ఆయన పాల్గొని ప్రసంగించారు.

ఇతర దేశాల్లో స్థిరపడిన భారతీయుల కారణంగా నేడు మనం సాంకేతికత, ఆరోగ్యం, విద్యలో మనకున్న విభిన్న పరిజ్ఞానాన్ని పంచుకోగలుగుతున్నామని సయీద్ పేర్కొన్నారు.

ఇదే సమయంలో రెమిటెన్స్‌ల గురించి ప్రస్తావిస్తూ .ప్రవాస భారతీయుల వల్ల 100 బిలియన్ డాలర్లు అందాయని , దీని వల్ల దేశానికి విదేశీ మారక నిల్వలు పెరిగాయని సయీద్ స్పష్టం చేశారు.

ప్రపంచ స్థాయి కన్సల్టెన్సీ సంస్థ, శక్తివంతమైన వాణిజ్య మధ్యవర్తిత్వం, అంతర్జాతీయ వార్తా ఛానల్ , అగ్రశ్రేణి ఉన్నత విద్యా సంస్థలను దాని ఆకాంక్షలను నెరవేర్చడంలో కేంద్రానికి ప్రవాస భారతీయులు మద్ధతుగా నిలవాలని ఔసఫ్ కోరారు.

"""/" / ఇదే సమావేశంలో కర్ణాటక ఇంధన శాఖ మంత్రి కేజే జార్జ్( KJ George ) మాట్లాడుతూ.

కర్ణాటక ప్రభుత్వం పునరుత్పాదక ఇంధన వ్యవస్థను నిర్మించడంపై దృష్టి పెట్టిందన్నారు.2027 నాటికి రాష్ట్రం 10 గిగావాట్ల అదనపు పునరుత్పాదక శక్తిని ఉత్పత్తి చేస్తుందన్నారు.

పెట్టుబడిదారులు కొత్త వ్యాపారాలను నిర్మించడానికి కర్ణాటక‌ను వన్ స్టాప్ గమ్యస్థానంగా చూడాలని కేజే జార్జ్ కోరారు.

"""/" / ఇకపోతే.ఫస్ట్ గ్లోబల్ కన్వెన్షన్ ఆఫ్ పీపుల్ ఆఫ్ ఇండియన్ ఆరిజిన్ సమ్మిట్ 1989లో అమెరికాలోని న్యూయార్క్( New York ) నగరంలో జరిగింది.

జీవోపీఐవో తొలి లక్ష్యం భారత సంతతికి చెందిన వ్యక్తులపై జరిగే మానవ హక్కుల ఉల్లంఘనపై పోరాడటం.

గత దశాబ్ధకాలంలో ఇది చాలా వరకు మెరుగైనప్పటికీ, భారతదేశం వెలుపల నివసిస్తున్న పీఐవోలకు మానవ హక్కుల ఉల్లంఘనలు ప్రధాన సమస్యగా కొనసాగుతున్నాయని నిపుణులు అంటున్నారు.

జీవోపీఐవో వ్యవస్థాపక అధ్యక్షుడు డాక్టర్ థామస్ అబ్రహం ప్రారంభం నుంచి 2004 వరకు పనిచేశారు.

ఆ తర్వాత ఇందర్ సింగ్ 2004లో అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించారు.అనంతరం లండన్‌లోని హౌస్ ఆఫ్ లార్డ్స్ సభ్యుడు లార్డ్ దిల్జిత్ రాణా 2009 వరకు, అశోక్ రామ్ శరణ్ 2011 నుంచి 2016 వరకు అధ్యక్షులుగా పనిచేశారు.

ఏపీలో ఈసీ నిర్ణయం..విధుల్లోకి అంగన్వాడీలు, కాంట్రాక్టు ఉద్యోగులు..!