చంద్రయాన్ -3 ల్యాండింగ్ : ఉత్కంఠగా ఎదురుచూస్తున్న ఇండో అమెరికన్లు.. సక్సెస్ కావాలంటూ ఆకాంక్ష
TeluguStop.com
చంద్రుడి గుట్టు విప్పేందుకు గాను భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో)( ISRO ) ప్రయోగించిన చంద్రయాన్-3( Chandrayaan-3 ) ప్రయోగంలో భాగంగా ఈరోజు సాయంత్రం 6.
04 గంటలకు విక్రమ్ ల్యాండర్ చంద్రుడిపై అడుగుపెట్టనుంది.సాఫ్ట్ ల్యాండింగ్ కోసం ఇస్రో అన్ని ఏర్పాట్లు చేసింది.
రష్యా ప్రయోగించిన లూనా -25( Luna-25 ) విఫలమైన నేపథ్యంలో ప్రపంచం దృష్టి చంద్రయాన్ 3పై పడింది.
అగ్రరాజ్యాలు సైతం ఇప్పటి వరకు చేరుకోలేని చంద్రుని దక్షిణ ధ్రువంపై దిగాలని ఇస్రో ఊవ్విళ్లూరుతోంది.
అన్ని అనుకున్నట్లుగా జరిగితే ఈ ఘనత సాధించిన తొలి దేశంగా భారత్( India ) చరిత్ర సృష్టించనుంది.
ఈ అద్భుత క్షణాల కోసం యావత్ భారతదేశం ఉత్కంఠగా ఎదురుచూస్తోంది.ల్యాండింగ్ సజావుగా సాగాలని కోరుతూ కుల, మతాలకు అతీతంగా ప్రార్ధనలు, ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు.
అటు బ్రిక్స్ దేశాధినేతల శిఖరాగ్ర సమావేశంలో పాల్గొనేందుకు దక్షిణాఫ్రికా వెళ్లిన ప్రధాని నరేంద్ర మోడీ( PM Narendra Modi ) ఇస్రో అధికారులతో కలిసి వర్చువల్‌గా ల్యాండింగ్‌ను వీక్షించనున్నారు.
దేశంలోని విద్యాసంస్థలు కూడా చంద్రయాన్ 3 ల్యాండింగ్‌ను ప్రత్యక్ష ప్రసారం చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నాయి.
"""/" /
ఇదిలావుండగా.చంద్రయాన్ 3 ల్యాండింగ్‌పై అమెరికాలోని ప్రవాస భారతీయులు( USA NRIs ) ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
ఈ ప్రయోగం ద్వారా స్పేస్ టెక్నాలజీలో భారత్ గ్లోబల్ లీడర్‌గా నిలుస్తుందని వారు ఆకాంక్షిస్తున్నారు.
అలాగే పిల్లలకు సైన్స్, ఫిజిక్స్‌లపై మరింత ఆసక్తి పెరుగుతుందని వారు చెబుతున్నారు.న్యూయార్క్‌లో స్థిరపడిన కమోడిటీ వ్యాపారి , ఫిజిక్స్‌పై ఆసక్తిగల సందీప్ దాగా ( Sandeep Daga ) మీడియాతో మాట్లాడుతూ.
చంద్రయాన్ 3 ఏం సాధిస్తుందో చూసేందుకు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నట్లు చెప్పారు. """/" /
చంద్రయాన్ 3 మిషన్ అనేది భారత అంతరిక్ష కార్యక్రమానికి, ఇస్రోకి ఒక షాట్ లాంటిదని సందీప్ వ్యాఖ్యానించారు.
ఇది అంతరిక్ష సాంకేతికతలో భారతదేశాన్ని ప్రపంచ అగ్రగామిగా ముందుకు నడిపిస్తుందని ఆయన ఆకాంక్షించారు.
సందీప్‌తో పాటు అమెరికాలో స్థిరపడిన ప్రవాస భారతీయులు బుధవారం చంద్రుని ఉపరితలంపై విక్రమ్ ల్యాండర్ దిగడాన్ని ప్రత్యక్ష ప్రసారం ద్వారా వీక్షించనున్నారు.
సంక్రాంతికి వస్తున్నాం మూవీ ఈ రేంజ్ లో హిట్ కావడం వెనుక అసలు కారణాలివేనా?