భారత్ క్రికెటర్లు 8 నిమిషాల్లో ఇక 2 కిలోమీటర్లు పరుగెత్తాల్సిందే!

భారత జాతీయ,క్రికెట్ జట్టుకు ఎంపికైన ప్రతి ఒక్క క్రికెటర్ కు పరీక్ష పెడుతోంది.

టీమిండియా క్రికెటర్లకు యో-యో టెస్ట్ ఎంత ముఖ్యమైనదో మనందరికీ తెలుసు.మైదానంలో మెరుగైన ఆట ప్రదర్శించిన యో-యో టెస్ట్ లో విఫలమైతే జట్టులో చోటు దక్కదు.

తాజాగా భారత మహిళల జట్టు సభ్యులందరూ యో-యో టెస్ట్ లో పాస్ అయ్యారు.

ఇక భారత్ క్రికెటర్ల ఫిట్ నెస్ స్థాయిని పెంచేందుకు బీసీసీఐ యో-యో టెస్ట్ నిర్వహించింది అన్న విషయం తెలిసిందే.

ఇప్పుడు తాజాగా క్రికెటర్ల ఫిట్నెస్ స్థాయిని పరీక్షించేందుకు ఇప్పటికే అమల్లో ఉన్న యో-యో టెస్ట్ తో పాటు మరో కొత్త తరహా పరీక్షలు నిర్వహించాలని బీసీసీఐ నిర్ణయించింది.

పరుగులో వేగాన్ని బట్టి ఆటగాళ్ల ఫిట్ నెస్ ను కొలవమన్నారు.పేస్ బౌలర్ అయితే రెండు కిలోమీటర్ల పరుగును 8 నిమిషాల 15 సెకన్లలో పూర్తి చేయాల్సి ఉంటుంది.

స్పిన్నర్లు, వికెట్ కీపర్,బ్యాట్స్ మెన్ కు మరో పదిహేను సెకండ్ల అదనపు అవకాశం కల్పిస్తూ 8 నిమిషాల 30 సెకండ్ల గరిష్ట సమయము నిర్దేశించడం జరిగింది.

కాంట్రాక్టు ప్లేయర్ తో పాటు జట్టులోకి వచ్చే అందరికీ ఇది వర్తిస్తుంది.సంవత్సరానికి మూడు సార్లు ఈ పరీక్ష నిర్వహించడం జరుగుతుంది.

ఇంగ్లాండ్ లో జరగబోయే ఓవర్ల పరిమిత ఈ సిరీస్ లో పాల్గొనే ఆటగాళ్లు ముందుగా ఈ పరీక్షను ఎదుర్కొన్నారు.

క్రికెటర్లు సాధారణంగా 6 నిమిషాల్లోనే 8 కిలోమీటర్లు పూర్తి చేస్తారు.కాబట్టి ఇప్పుడు కొత్తగా పెట్టిన పరీక్ష వల్ల క్రికెటర్లు ఇబ్బంది పడకపోవచ్చు.

కేసీఆర్ వలనే తెలంగాణకు అన్యాయం..: కిషన్ రెడ్డి