గూఢచార్యం కేసులో భారతీయ దంపతులకి జర్మన్ లో జైలు శిక్ష

ఇతర దేశాలలో ఉంటూ సొంత దేశానికి గూఢచారులు ఉండటం నేరం అనే విషయం అందరికి తెలిసిందే.

కానీ అన్ని దేశాలు తమ దేశాలకి చెందిన వారిని ఉద్యోగులగానో, పర్యాటకులు గానో ఇతర దేశాలలో ఉంచుతూ ఆ దేశాలకి సంబందించిన నిఘా సమాచారం తెలుసుకునే ప్రయత్నం చేస్తూ ఉంటారు.

ఇలాంటి గూఢచారులు ప్రతి దేశంలో ఉన్నారు.అయితే వీళ్ళు ఆధారాలతో దొరికితే మాత్రం ఆయా దేశాలు కఠిన శిక్షలు విధిస్తాయి.

తాజాగా గూఢచార్యం చేశారనే ఆరోపణలతో భారత్ కి చెందిన భార్యాభర్తలకి జర్మన్ కోర్టు జైలు శిక్ష విధించింది.

ఇండియా గూఢచార్యం సంస్థ కోసం వీళ్ళు పని చేశారని జర్మన్ లో ఉన్న సిక్కులు, కాశ్మీర్ ల మీద నిఘా పెట్టి రహస్యాలని ఇండియాకి చేరవేసే ప్రయత్నం చేశారని న్యాయస్థానం నిర్ధారించింది.

మన్మోహన్ ఎస్ అనే వ్యక్తి ఫారిన్ ఇంటెలిజెన్స్ ఏజెంట్‌గా పనిచేస్తూ జర్మనీలోని సిక్కులు, కశ్మీరీలకు సంబంధించిన రహస్య సమాచారాన్ని ఇంటెలిజెన్స్ సర్వీసెస్‌కు అందించాడు.

దీనికి అతని భార్య కన్వాల్ జీత్ కే సహకరించింది.మన్మోహన్‌ను ఇండియన్ ఫారిన్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్ గూఢచర్యం కోసం నియమించినట్లు కోర్టు విచారణలో తేల్చింది.

అతను కొలోన్, ఫ్రాంక్‌ఫర్ట్‌లలోని గురుద్వారాలకు వెళ్లి అక్కడి సిక్కులతో పరిచయం పెంచుకొని వారికి సంబందించిన సమాచారం భారత ఉన్నతాధికారులకి అందించారని రుజువైంది.

ఇలా రహస్య సమాచారాన్ని చేరవేసినందుకు ఉన్నతాధికారుల ఈ దంపతులకి 5 లక్షల 70వేల వరకు చెల్లించారు.

అలాగే మనోహర్ 2017 జూలై నుంచి క్రమం తప్పకుండా భారత ఇంటెలిజెన్స్ అధికారిని కలిసినట్టు విచారణలో తేలింది.

తాను చేసిన నేరాన్ని మనోహర్ అంగీకరించడంతో అతనికి 18 నెలలు, అతనికి సహకరించిన భార్య కన్యాల్ జీత్ కి మూడు నెలల జైలు శిక్ష విధిస్తూ జర్మన్ కోర్టు తీర్పు చెప్పింది.

హెయిర్ ను ట్రిపుల్ చేసే పవర్ ఫుల్ టానిక్ ఇది.. వారానికి ఒక్కసారి వాడిన రిజల్ట్ అదిరిపోద్ది!