అమెరికాలోని ఎన్ఆర్ఐలకు శుభవార్త.. సీటెల్‌లో అందుబాటులోకి వీసా అప్లికేషన్ సెంటర్

విద్య, ఉపాధి, వ్యాపార అవకాశాల కోసం ప్రతి ఏటా అగ్రరాజ్యం అమెరికాకు వెళ్లే వారి సంఖ్య పెరుగుతోంది.

ఏదో ఒక రకంగా అమెరికాలో స్థిరపడి నాలుగు రాళ్లు వెనకేసుకోవాలని ప్రపంచం భావిస్తోంది.

ఇందులో భారతీయులు సైతం వున్నారు.అక్కడి వలసదారుల్లో అత్యంత శక్తివంతమైన, బలమైన కమ్యూనిటీ ఇండియన్సే.

అందుకే అప్పు చేసైనా సరే తమ పిల్లలను అమెరికా పంపిస్తున్నారు తల్లిదండ్రులు.అయితే అమెరికాపై అన్ని దేశాలకు మోజు పెరుగుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో పోటీ ఎక్కువైంది.

దీంతో వీసాల జారీ అమెరికాకు కత్తి మీద సాములా తయారైంది.అలాగే ఆ దేశ దౌత్య సిబ్బందికి కూడా వీసా ప్రాసెసింగ్ ప్రక్రియ గుదిబండలా మారుతోంది.

అటు అమెరికాలో స్ధిరపడే భారతీయుల సంఖ్య కూడా పెరుగుతూ ఉండటంతో అక్కడి ఇండియన్ మిషన్స్‌పైనా ఒత్తిడి పెరుగుతోంది.

"""/" / ఇలాంటి పరిస్ధితుల్లో సీటెల్‌లోని ఇండియన్ కాన్సులేట్ తన కొత్త వీసా అప్లికేషన్ సెంటర్‌ను శుక్రవారం ప్రారంభించింది.

ఇది గ్రేటర్ సీటెల్( Greater Seattle Area ) ప్రాంతానికి వీసా, పాస్‌పోర్ట్ సేవలను అందిస్తుంది.

సీటెల్ మేయర్ బ్రూస్ హారెల్( Seattle Mayor Bruce Harrell ), పోర్ట్ కమీషనర్ సామ్ చో, రాష్ట్ర ప్రతినిధి వందనా స్లాటర్ సహా నేతలు అధికారులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.

మేయర్ హారెల్ తొలి భారతీయ పాస్‌పోర్ట్, వీసాను ఓ దరఖాస్తుదారుడికి అందించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.

సీటెల్‌లోని ఇండియన్ కమ్యూనిటీపై ప్రశంసల వర్షం కురిపించారు.భారత్ - అమెరికాల మధ్య బంధాలను మరింత బలోపేతం చేయడంలో వారి పాత్ర కీలకమైనదన్నారు.

"""/" / సీటెల్, బెల్లేవ్ ఇండియన్ వీసా అప్లికేషన్ కేంద్రాలు (ఐవీఏసీ) రెండూ వీఎఫ్ఎస్ గ్లోబల్ ద్వారా నిర్వహించబడుతున్నాయి.

భారత విదేశాంగ శాఖకు వీఎఫ్ఎస్ గ్లోబల్( VFS Global ).ఔట్‌సోర్సింగ్ ద్వారా వీసా సేవలను అందిస్తోంది.

ఈ కేంద్రాలను భారతీయ పౌరులకు వీసా ప్రక్రియను క్రమబద్దీకరించడానికి, కాన్సులర్ అవసరాలకు మద్ధతును అందించడానికి ఏర్పాటు చేశారు.

అమెరికాలోని తొమ్మిది పసిఫిక్ వాయువ్య రాష్ట్రాలైన -అలాస్కా, ఇదాహో, మోంటానా, నెబ్రాస్కా, నార్త్ డకోటా, ఒరెగాన్, సౌత్ డకోటా, వాషింగ్టన్ , వ్యోమింగ్‌ పరిధిలోని భారతీయ ప్రవాస సమాజానికి ఈ కేంద్రం ప్రయోజనం చేకూరుస్తుందని ఇండియన్ కాన్సులేట్ ఒక ప్రకటనలో తెలిపింది.

అమ్మ అందుకే బయటకు ఎక్కువగా రాదు.. ఎన్టీఆర్ కామెంట్స్ వైరల్!