నాలుగేళ్లుగా కారునే ఇల్లుగా చేసుకుని.. దుబాయ్‌లో భారతీయ మహిళ దీనావస్థ, చలించిన ఇండియన్ కాన్సులేట్
TeluguStop.com
మనిషికి జీవన గమనానికి కూడు, గూడు, గుడ్డ అత్యవసరం.కోటీశ్వరుడైనా, కూలివాడైనా సరే.
కష్టపడేది, కోట్లు పోగేసేది వీటి కోసమే.కానీ నేటి సమాజంలో ఈ మూడు అందని వారు కోట్ల మంది వున్నారు.
అమలాపురం నుంచి అమెరికా వరకు ఇదే పరిస్ధితి.ప్రతి నిత్యం ఎన్నో ఆకలి చావులు చూస్తూనే వున్నాం.
ఇదిలావుండగా.తలదాచుకోవడానికి నిలువ నీడ లేక కారునే ( Car ) ఇల్లుగా చేసుకుని జీవిస్తోన్న ఓ భారతీయ మహిళ దీనస్థితిని చూసి దుబాయ్‌లోని ఇండియన్ కాన్సులేట్( Indian Consulate ) చలించిపోయింది.
వివరాల్లోకి వెళితే.55 ఏళ్ల ప్రియా ఇంద్రు మణి( Priya Indru Mani ) ఆర్ధిక ఇబ్బందుల కారణంగా గత నాలుగేళ్లుగా కారులోనే జీవిస్తున్నారు.
ఈ విషయం తెలుసుకున్న దుబాయ్‌లోని( Dubai ) ఇండియన్ కాన్సులేట్ సాయం చేసింది.
2017లో తన తల్లికి స్ట్రోక్ రావడంతో మణికి కష్టాలు మొదలయ్యాయి.వ్యాపారంలో ఇబ్బందులతో పాటు తల్లి అనారోగ్యం ఆమెను తీవ్రంగా కృంగదీసింది.
ఈ నేపథ్యంలో దుబాయ్‌లోని బార్షా హైట్స్‌లో వున్న డెసర్ట్ స్ప్రింగ్స్ విలేజ్‌లోని తన ఇంటికి అద్దె సైతం చెల్లించలేకపోయింది.
దీంతో తల్లీకూతుళ్లను ఇంటి యజమాని వీధిలోకి నెట్టారు.ఈ క్రమంలో మణి కారులోనే తన జీవితాన్ని వెళ్లదీస్తున్నారు.
"""/" /
అయితే నానాటికీ పరిస్ధితులు దిగజారుతూ వుండటంతో మణి .దుబాయ్‌లోని భారత కాన్సులేట్‌ను సంప్రదించింది.
దౌత్య కార్యాలయం ద్వారా ఆమె దీనగాథను తెలుసుకున్న పలువురు వ్యక్తులు.రంజాన్ సందర్భంగా దుబాయ్ ఎలక్ట్రిసిటీ అండ్ వాటర్ అథారిటీ (డీఈడబ్ల్యూఏ)కి వున్న బకాయిలు సహా మణికి వున్న అప్పులు తీర్చేందుకు ముందుకు వచ్చారు.
కార్ ఫేర్ గ్రూప్ ఎండీ జస్బీర్ బస్సీ.( Jasbir Bassi ) అద్దె బకాయిల కోసం AED 50,000 .
కరెంట్ బిల్లు బకాయిల కోసం మరో AED 30,000లు అందించారు. """/" /
ఆయనతో పాటు మరికొందరు వ్యక్తులు, కాన్సులేట్ కార్యాలయం సాయంతో మణి కొత్త జీవితాన్ని ప్రారంభించింది.
మణి పరిస్థితిని తెలుసుకుని ఆమెకు సహాయం చేసిన వినయ్ చౌదరి, అనీష్ విజయన్, జస్బీర్ బస్సీలకు దుబాయ్‌లోని భారత కాన్సులేట్ కార్యాలయం ధన్యవాదాలు తెలిపింది.
ఇది యూఏఈలోని భారతీయ సమాజం ఐక్యతకు చిహ్నమని పేర్కొంది.
11 వేల జనాభా ఉన్న దేశంలో మొదటిసారి ఏటీఎం.. ఎలా సాధ్యమైందో తెలుసా?