Viral Video : ఇదేం టెక్నిక్ అయ్యా బాబోయ్.. జీరో-బ్యాలెన్స్ ఏటీఎం రిసిప్ట్స్‌తో టీ కొన్నారుగా..!

భారతదేశంలో 'జుగాడ్‌' వీడియోలకు( Jugaad Videos ) కొదవ ఉండదు.జుగాడ్లు చేస్తూ భారతీయులు ఎలాంటి పరిస్థితుల్లోనైనా తమకు కావాల్సిన పనులను పూర్తి చేసుకుంటారు.

జుగాడ్‌ అంటే పరిమిత వనరులతో క్లిష్టమైన సమస్యలకు తెలివైన పరిష్కారాలను కనుగొనడం.ఇందులో ఇండియన్స్‌కి తిరుగులేదు.

అదే విషయాన్ని ఇద్దరు అబ్బాయిలు మరోసారి నిరూపించారు.ఈ ఇద్దరు అబ్బాయిలు టీ( Tea ) కోసం డబ్బు సంపాదించడానికి తమ సృజనాత్మకతను ఉపయోగించారు.

వారికి సంబంధించిన ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా కూడా మారింది.

"""/" / ఈ యువకులు ఏటీఎం( ATM ) నుంచి నగదు తీసుకునేందుకు ప్రయత్నిస్తున్నారని, అయితే వారి బ్యాంకు ఖాతాల్లో డబ్బులు లేవని వీడియోలో మనకు కనిపిస్తుంది.

అయినా టీ తాగాలనే వారి ఆశ మాత్రం తీరలేదు.అందుకే వారు జీరో బ్యాలెన్స్( Zero Balance ) చూపించే అనేక ATM రసీదులను సేకరిస్తారు.

ఎందుకు ప్రతిసారి బ్యాలెన్స్ రిసిప్ట్ కోసం ఏటీఎంలో బటన్లు నొక్కారు.అలా వారు ఏటీఎం నుంచి కేజీకి సమానమైన రసీదుల పేపర్లను తీసుకున్నారు.

ఈ రశీదుల కట్టను తయారు చేసి రూ.20కి చిత్తు పేపర్లను కొనే దుకాణంలో విక్రయించారు.

ఆ డబ్బులతో టీ తాగి ఎంజాయ్ చేశారు. """/" / నిక్‌హంటర్ అనే వినియోగదారు ఈ వీడియోను మొదట ఎక్స్‌లో పోస్ట్ చేశాడు.

దానికి 5 లక్షల కంటే ఎక్కువ వ్యూస్ వచ్చాయి.ఈ టెక్నిక్‌ను భారతదేశంలో మాత్రమే చేయాలని నిక్‌హంటర్ రాశాడు.

చాలా మంది ఈ వీడియోపై కామెంట్స్ చేస్తూ యువకుల తెలివితేటలను కొనియాడారు.కొంతమంది వ్యక్తులు వీడియోను తమాషాగా భావించారు, ఎందుకంటే వీళ్లు కేవలం ఒక కప్పు టీ కోసం చాలా ఇబ్బందులు పడ్డారు.

టీ కోసం ఎందుకు ఇంత కష్టపడ్డారని ఒక యూజర్ అడిగాడు.అయితే పని పాట లేకపోతే ఇలాంటి పనిలే యువకులు చేస్తారని కొందరు సరదాగా కామెంట్ చేశారు.

న్యూజిలాండ్: నింగిలో భారీ అగ్నిగోళం.. భయంతో వణికిపోయిన ప్రజలు.. వీడియో వైరల్..