సంపన్న ఎన్ఆర్ఐల జాబితాలో గౌతమ్ అదానీ అన్నయ్యకి అగ్రస్థానం...!!

భారతదేశంలో సంపన్నుడెవరంటే నిన్న మొన్నటి వరకు రిలయన్స్ ఇండస్ట్రీస్ ఛైర్మన్ ముఖేష్ అంబానీ పేరే వినిపించేది.

కానీ గౌతం అదానీ ఆ రికార్డును బ్రేక్ చేశారు.భారత్‌లోనే కాదు ప్రపంచ కుబేరుల జాబితాలో ఆయన స్థానం సంపాదించారు.

అది కూడా ఏకంగా రెండవ స్థానం.లూయి విట్టన్ అధినేత అర్నాల్డ్‌ను దాటేసి గత ఆగస్టులో ప్రపంచంలోకెల్లా మూడవ అత్యంత సంపన్నుడిగా అవతరించిన అదానీ.

తాజాగా అమెజాన్ అధినేత జెఫ్ బెజోస్‌ను అధిగమించి రెండో స్థానంలోకి చేరిపోయారు.ప్రస్తుత లెక్కల ప్రకారం అదానీ సంపద విలువ 273.

5 కోట్లుకు చేరినట్లు ఫోర్బ్స్‌ చెబుతోంది.ఇప్పుడు ప్రపంచ కుబేరుల జాబితాలో ఎలన్ మస్క్ నెంబర్‌వన్‌గా వున్న సంగతి తెలిసిందే.

ఇదిలావుండగా అదానీ అన్నయ్య వినోద్ శాంతి లాల్ కూడా అరుదైన ఘనత సాధించారు.

సంపన్న ఎన్ఆర్ఐల జాబితాలో ఆయన నెంబర్‌వన్‌గా నిలిచారు.ఈ మేరకు ఐఐఎఫ్‌ఎల్ వెల్త్ హురున్ ఇండియా తెలిపింది.

దుబాయ్‌లో స్థిరపడిన గౌతమ్ అదానీ పెద్ద సోదరుడు యూఏఈతో పాటు సింగపూర్, జకార్తాలో వ్యాపారాలను నిర్వహిస్తున్నారు.

ఆయన సంపద గతేడాది 28 శాతం (రూ.37,400 కోట్లు) పెరిగింది.

తద్వారా భారతదేశపు కుబేరుల జాబితాలో ఆరో స్థానాన్ని పొందాడు.గడిచిన ఐదేళ్లలో వినోద్ అదానీ సంపద 850 శాతం పెరిగి రూ.

1,51,200 కోట్ల నుంచి రూ.1,69,000 కోట్లకు చేరుకుంది.

"""/"/ ఇకపోతే.ఐఐఎఫ్ఎల్ ప్రకటించిన సంపన్న ఎన్ఆర్ఐల జాబితాలో 94 మంది ఎన్ఆర్ఐలు వున్నారు.

వీరిలో వినోద్ గతేడాది ప్రతిరోజూ సగటున రూ.102 కోట్లు ఆర్జించినట్లుగా ఐఐఎఫ్ఎల్ తెలిపింది.

అటు ఈ లిస్ట్‌లో 1.65 లక్షల కోట్లతోఅహూజా సోదరులు రెండో స్థానంలో, ఉక్కు వ్యాపారి లక్ష్మీ నివాస్ మిట్టల్, జే చౌదరి, అనిల్ అగర్వాల్, యూసఫ్ అలీ, షాపూర్ పల్లోంజీ మిస్త్రీ, శ్రీ ప్రకాశ్ లోహియా, రాకేశ్ గంగ్వాల్ , వివేక్ చాంద్ సెహగల్ తదితరులు వున్నారు.

కేటీఆర్ కు అంత శక్తి ఉందా ? జగ్గారెడ్డి కౌంటర్