చేతులు లేకపోయినా బంగారు పతకాలు సాధించిన శీతల్ దేవి.. ఈమె సక్సెస్ కు హ్యాట్సాఫ్ అనాల్సిందే!
TeluguStop.com
కొంతమంది సక్సెస్ గురించి విన్నా, చదివినా మన కళ్లు చెమర్చుతాయి.జమ్మూ కాశ్మీర్ క్రీడాకారిణి శీతల్ దేవి( Sheetal Devi ) సక్సెస్ స్టోరీ ఎంతోమందికి స్పూర్తిగా నిలుస్తుందనే సంగతి తెలిసిందే.
రెండు చేతులు లేకపోయినా పారా ఆసియా క్రీడల్లో( Para Asian Games ) శీతల్ దేవి ప్రతిభ కనబరచడంతో పాటు శీతల్ దేవి వల్ల మన దేశానికి రెండు స్వర్ణ పతకాలు వచ్చాయి.
16 సంవత్సరాల చిన్నారి శీతల్ దేవి వేర్వేరు విభాగాలలో 2 స్వర్ణ పతకాలతో పాటు ఒక రజత పతకాన్ని సాధించారు.
శీతల్ దేవి నిరుపేద కుటుంబంలో( Poor Family ) జన్మించగా ఆమె తండ్రి వ్యవసాయం చేసేవారు.
శీతల్ దేవి తల్లి గొర్రెలు కాస్తూ కుటుంబానికి ఏ కష్టం రాకుండా చూసుకున్నారు.
శీతల్ దేవి చెల్లి పేరు శివాని ( Sivani ) కాగా అక్కకు ఏ కష్టం రాకుండా ఆమె చూసుకునేవారు.
బాల్యం నుంచి కాళ్లతో పని చేయడం నేర్చుకున్న శీతల్ దేవి ఇండియన్ ఆర్మీ నిర్వహించిన ఒక క్రీడా శిబిరంలో పాల్గొని సత్తా చాటారు.
"""/" /
బాల్యంలోనే ఇండియన్ ఆర్మీ( Indian Army ) శీతల్ దేవి సక్సెస్ కోసం తమ వంతు సహాయసహకారాలు అందించింది.
కాళ్లతో బాణాలు వేయడం నేర్చుకున్న శీతల్ దేవి బాణాలు సంధిస్తున్న ఫోటోలు, వీడియోలను చూసిన నెటిజన్ల రోమాలు నిక్కబొడుచుకుంటున్నాయి.
వచ్చే ఏడాది జరగనున్న పారిస్ పారాలింపిక్స్ లో కూడా మన దేశానికి పతకాలు తెచ్చిపెట్టాలని శీతల్ భావిస్తున్నారు.
"""/" /
ప్రధాని నరేంద్ర మోదీ( PM Narendra Modi ) సైతం శీతల్ దేవిని అభినందించడం గమనార్హం.
వైకల్యం ప్రతిభకు అడ్డు కాదని శీతల్ చెప్పుకొచ్చారు.ఈ ఘనత సాధించిన తొలి భారతీయ మహిళ శీతల్ వెల్లడించారు.
శీతల్ దేవి కెరీర్ పరంగా మరిన్ని విజయాలను సొంతం చేసుకోవాలని నెటిజన్లు ఫీలవుతున్నారు.
శీతల్ దేవి టాలెంట్ గురించి తెలిసి నెటిజన్లు ఫిదా అవుతుండటం గమనార్హం.
రాజమౌళికి పోటీగా మారుతున్న కోలీవుడ్ డైరెక్టర్ అట్లీ.. ఇద్దరిలో నంబర్ వన్ ఎవరు?