ఇండియన్ కమ్యూనిటీ మద్ధతు కమలా హారిస్‌కే .. ట్రంప్‌ను తేలిగ్గా తీసుకోవద్దంటున్న సర్వే

అమెరికా అధ్యక్ష ఎన్నికలు హోరాహోరీగా జరుగుతున్నాయి.మరో వారంలో అగ్రరాజ్యంలో ఎన్నికలు ముగుస్తాయి.

సమయం దగ్గర పుడుతుండటంతో ప్రధాన పార్టీల అభ్యర్ధులు ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు.డెమొక్రాటిక్ పార్టీ తరపున భారత సంతతికి చెందిన కమలా హారిస్, రిపబ్లికన్ల తరపున డొనాల్డ్ ట్రంప్‌లు ( Donald Trump )ఎన్నికల బరిలో నిలిచిన సంగతి తెలిసిందే.

వీరిద్దరూ కాకుండా ఇతర పార్టీలకు చెందిన పలువురు అభ్యర్థులు కూడా తమ అదృష్టం పరీక్షించుకుంటున్నారు.

అయితే అమెరికాలో బలమైన శక్తిగా ఉన్న భారతీయ కమ్యూనిటీ ఈ ఎన్నికలలో ఎవరి వైపు నిలబడుతుందోనని ప్రపంచం ఆసక్తిగా గమనిస్తోంది.

దీనిపై ఎప్పటికప్పుడు సర్వేలు వెలువడుతూనే ఉన్నాయి.తాజాగా వెలువడిన సర్వేలో 61 శాతం మంది భారతీయ అమెరికన్లు కమలా హారిస్‌కు జై కొట్టగా.

31 శాతం మంది ట్రంప్‌కు మద్ధతుగా నిలుస్తున్నారు.కార్నెగీ నిర్వహించిన ఇండియన్ అమెరికన్ యాటిట్యూడ్ సర్వే (ఐఏఏస్) 2024 ఫలితాలను సోమవారం విడుదల చేసింది.

"""/" / ఇందులో డెమొక్రాట్లకు ఆందోళన కలిగించే అంశాలను కూడా పేర్కొన్నారు.2020 అధ్యక్ష ఎన్నికల్లో జో బైడెన్‌కు 68 శాతం మంది భారతీయ అమెరికన్లు మద్ధతు పలకగా.

ఇది కమలా హారిస్‌కు వచ్చేసరికి 61 శాతానికి పడిపోయింది.ఇదే సమయంలో నాలుగేళ్ల క్రితం డొనాల్డ్ ట్రంప్‌కు 22 శాతం మంది ప్రవాస భారతీయులు జైకొట్టగా.

అది ఇప్పుడు 31 శాతానికి చేరుకుంది.డెమొక్రాట్ మద్ధతుదారులుగా గుర్తింపు తెచ్చుకున్న భారతీయ అమెరికన్లు 56 శాతం నుంచి 47 శాతానికి.

డెమొక్రాట్ల వైపు మొగ్గు చూపే భారతీయుల సంఖ్య 66 శాతం నుంచి 57 శాతానికి పడిపోయింది.

"""/" / అలాగే 40 ఏళ్ల లోపు వయసున్న భారతీయ అమెరికన్ పురుషులలో 48 శాతం మంది ట్రంప్‌కు మద్దతు పలుకుతుండగా .

కమలా హారిస్‌కు కేవలం 44 శాతం మందే జై కొడుతున్నారు.భారతీయ వలసదారులతో పోలిస్తే.

అమెరికాలో పుట్టిన భారత సంతతిలో ట్రంప్‌కు మద్ధతు పలికే వారి సంఖ్య ఎక్కువగా ఉందని నివేదిక చెబుతోంది.

మూవీ కోసం గుండు గీయించుకున్న సుకుమార్ కూతురు.. కష్టానికి ఫిదా అవ్వాల్సిందే!