కెనడా – బంగ్లాదేశ్‌లలో హిందువులపై దాడులు.. అమెరికాలో ప్రవాస భారతీయుల ర్యాలీ
TeluguStop.com
కెనడాలో ఖలిస్తాన్( Khalistan In Canada ) వేర్పాటువాదులు రెచ్చిపోతుండటంతో అక్కడ పరిస్ధితులు నానాటికీ దిగజారిపోతున్నాయి.
ప్రధాని జస్టిన్ ట్రూడో ( Prime Minister Justin Trudeau )అండ చూసుకుని వీరు పేట్రెగిపోతున్నారు.
ముఖ్యంగా సిక్కుయేతర మతస్తులను వీరు టార్గెట్ చేస్తుండటంతో అక్కడ ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియని పరిస్దితి నెలకొంది.
స్వయంగా కెనడియన్లనే ఖలిస్తానీలు బెదిరిస్తున్నారు.కెనడా మాదని.
మీరంతా యూరప్‌కు, బ్రిటన్‌కు వెళ్లిపోవాలని వార్నింగ్ ఇచ్చారు.ఈ క్రమంలో కెనడా, బంగ్లాదేశ్‌లలో హిందువులపై జరుగుతున్న దాడులు, హింసకు వ్యతిరేకంగా అమెరికాలోని సిలికాన్ వ్యాలీలో భారతీయ అమెరికన్లు సంఘీభావ ర్యాలీ నిర్వహించారు.
మిల్పిటాస్ సిటీ హాల్‌లో జరిగిన సమావేశంలో పలువురు భారతీయ అమెరికన్లను ఉద్దేశించి ప్రసంగిస్తూ .
కమ్యూనిటీ నాయకులు హిందూ మైనారిటీపై దాడులను ప్రస్తావించారు.మానవ హక్కుల ఉల్లంఘనలను ఖండించాలని, హిందూ మైనారిటీ జనాభాను రక్షించడానికి కెనడియన్, బంగ్లాదేశ్ ప్రభుత్వాలు బాధ్యత వహించేలా ఒత్తిడి తీసుకురావాలని అమెరికా ప్రభుత్వాన్ని వారు కోరారు.
"""/" /
కాగా.కాలిఫోర్నియా బే ఏరియాలో( California Bay Area ) దాదాపు 2 లక్షల మందికి పైగా ఇండో అమెరికన్లు నివసిస్తున్న సంగతి తెలిసిందే.
కెనడాలోని బ్రాంప్టన్‌లో హిందూ సభ ఆలయంలో హిందూ భక్తులపై ఖలిస్తానీయులు దాడి చేసిన ఘటనను ప్రస్తావించారు.
ఖలిస్తానీ ఉగ్రవాదాన్ని ఆపండి.కెనడియన్ హిందువులను రక్షించాలని, ఇస్లామిస్ట్ ఉగ్రవాదాన్ని ఆపండి.
బంగ్లాదేశ్ - హిందువులను రక్షించండి అంటూ ర్యాలీలో నినాదాలు చేశారు. """/" /
ఖలిస్తాన్ ఉగ్రవాదులు ఆలయ ప్రాంగణంలోకి చొరబడి పురుషులు, మహిళలు, పిల్లలను కొట్టిన వీడియోలను చూసి తాము దిగ్భ్రాంతి వ్యక్తం చేసినట్లు తెలిపారు.
దీపావళి పండుగను జరుపుకోవడానికి వెళ్లిన హిందువులను గూండాలు వేటాడటం భయంకరంగా ఉందని పేర్కొన్నారు.
పరిస్ధితిని మరింత దిగజార్చడానికి పోలీసులు, ఖలిస్తాన్ మద్ధతుదారులతో కలిసి హిందూ భక్తులను కొట్టడం చూశామన్నారు.
కెనడియన్ హిందువుల ప్రాథమిక మానవ హక్కులను పరిరక్షించడంలో ట్రూడో ప్రభుత్వంపై తాము పూర్తిగా విశ్వాసం కోల్పోయామని చెప్పారు.
కెమెరాలో చిక్కిన సీక్రెట్ మూమెంట్.. మెలానియా ట్రంప్‌కు గవర్నర్ ముద్దు.. వీడియో వైరల్..