ఇద్దరు భారత సంతతి మహిళలకు వైట్‌హౌస్‌లో కీలక బాధ్యతలు!!
TeluguStop.com
అధికారంలోకి వచ్చిన నాటి భారతీయులకు తన టీమ్‌లో ఉన్నత పదవులు కట్టబెడుతూ వస్తోన్న అమెరికా అధ్యక్షుడు జో బైడెన్.
( President Joe Biden ) మరికొద్దినెలల్లో గద్దె దిగనున్నారు.అయితే వెళ్తూ వెళ్తూ ఇద్దరు భారత సంతతి మహిళలకు గుడ్‌న్యూస్ చెప్పారు.
పద్మిని పిళ్లై,( Padmini Pillai ) నళిని టాటాలను( Nalini Tata ) ప్రతిష్టాత్మక 2024-25 వైట్‌హౌస్ ఫెలోస్ ప్రోగ్రామ్‌కు నియమించారు .
ఈ ఏడాది అమెరికా వ్యాప్తంగా 15 మంది అత్యుత్తమ వ్యక్తులను ఈ కార్యక్రమానికి ఎంపిక చేసినట్లుగా అధ్యక్ష కార్యాలయం తెలిపింది.
తద్వారా వీరికి సీనియర్ వైట్‌హౌస్( White House ) సిబ్బంది, ఉన్నతాధికారులతో కలిసి పనిచేయడానికి , ప్రభుత్వ యంత్రాంగంలో ప్రత్యక్ష అనుభవాన్ని పొందడానికి వీలు కలుగుతుందన్నారు.
"""/" /
ఇమ్యునో ఇంజనీర్( Immunoengineer ) అయిన పద్మిని పిళ్లై సోషల్ సెక్యూరిటీ అడ్మినిస్ట్రేషన్‌లో పనిచేస్తున్నారు.
మానవ వ్యాధులను ఎదుర్కోవడానికి బయోమెటీరియల్ డిజైన్‌లో ఇమ్యూనాలజీలో ఆమె ఆవిష్కరణలు చేస్తున్నారు.మసాచుసెట్స్‌లోని న్యూటన్‌కు చెందిన పద్మిని పిళ్లై గతంలో ఎంఐటీలో ఒక బృందానికి నాయకత్వం వహించారు.
క్యాన్సర్ చికిత్సలలో కీలక పాత్ర పోషించే ట్యూమర్ సెలెక్టివ్ నానోథెరపీపై ఈ బృందం పరిశోధనలు చేసింది.
"""/" /
యునైటెడ్ పోర్పిరియాస్ అసోసియేషన్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో పద్మిని మాట్లాడుతూ.2013లో తను ఎదుర్కోన్న పరిస్ధితులు , దాదాపు మరణం అంచుల వరకు వెళ్లిన ఘటనలు తన జీవితాన్ని మలుపు తిప్పాయన్నారు.
యేల్ యూనివర్సిటీ నుంచి ఇమ్యునో బయాలజీలో పీహెచ్‌డీ, రెజిస్ కాలేజీ నుంచి బయో కెమెస్ట్రీలో బీఏను ఆమె అభ్యసించారు.
"""/" /
న్యూయార్క్‌కు చెందిన నళిని టాటా.వైట్‌హౌస్ కేబినెట్ అఫైర్స్ కార్యాలయంలో సేవలందిస్తున్నారు.
తాజా ఆదేశాల ప్రకారం వీరిద్దరూ కేబినెట్ సెక్రటరీలు, ఇతర ఉన్నత స్థాయి పరిపాలనా యంత్రాంగంతో కలిసి ఏడాది లేదా అంతకంటే ఎక్కువ కాలం పనిచేస్తారు.
వైట్‌హౌస్ నివేదిక ప్రకారం.ఈ ఏడాది ఫెలో సభ్యులను చాలా కఠినమైన ఎంపిక ప్రక్రియ ద్వారా నియమించినట్లు సమాచారం.
వీడియో: డబ్బాలో తల ఇరుక్కుని హిమాలయన్ ఎలుగుబంటి విలవిల.. రక్షించిన ఇండియన్ ఆర్మీ..