బ్యాటిల్ గ్రౌండ్‌లోకి ఇండో అమెరికన్లు.. కమలా హారిస్ కోసం భారీ క్యాంపెయినింగ్
TeluguStop.com
అమెరికా అధ్యక్ష ఎన్నికలు(
US Presidential Election ) హోరాహోరీగా జరుగుతున్నాయి.డెమొక్రాటిక్ పార్టీ అభ్యర్ధి, ప్రస్తుత ఉపాధ్యక్షురాలు కమలా హారిస్, రిపబ్లికన్ పార్టీ అభ్యర్ధి డొనాల్డ్ ట్రంప్‌లు ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు.
నవంబర్ 5 ఎన్నికల్లో ట్రంప్‌ను ఓడించాలని కమలా హారిస్ పావులు కదుపుతున్నారు.అన్ని వర్గాల మద్ధతును కూడగట్టేందుకు ఆమె వ్యూహాలు రచిస్తున్నారు.
ఈ నేపథ్యంలో స్వింగ్ స్టేట్స్‌లో కమలా హారిస్‌కు మద్ధతుగా భారతీయ అమెరికన్ల బృందం క్షేత్రస్థాయిలో ప్రచారాన్ని ప్రారంభించింది.
‘‘ ఇండియన్ అమెరికన్స్ ఫర్ హారిస్ ’’ క్యాంపెయినింగ్‌ను మంగళవారం ప్రారంభించారు.అమెరికా అధ్యక్షురాలిగా ఎన్నికయిన తొలి భారత సంతతి వ్యక్తిగా కమలా హారిస్‌ను గెలిపించాలని వారు లక్ష్యంగా పెట్టుకున్నారు.
"""/" /
నార్త్ కరోలినాకు చెందిన భారత సంతతి వ్యాపారవేత్త స్వదేశ్ ఛటర్జీ ( Swadesh Chatterjee )పీటీఐతో మాట్లాడుతూ.
కమలా హారిస్( Kamala Harris )కు భారతీయ వారసత్వం ఉందని, ఆమె అమెరికాలో ఎంతో నేర్చుకున్నారని చెప్పారు.
భారతీయ అమెరికన్లు పార్టీలకు అతీతంగా కమలా హారిస్‌కు మద్ధతు ఇవ్వాలని ఛటర్జీ కోరారు.
ఈ దేశంలో అత్యున్నత పదవికి ఓ భారత మూలాలున్న వ్యక్తి పోటీ చేయడం ఎప్పుడూ జరగలేద్నారు.
ఛటర్జీని భారత్ - అమెరికాల మధ్య సంబంధాలను బలోపేతం చేసినందుకు గాను భారత మూడవ అత్యున్నత పౌర పురస్కారం పద్మభూషణ్ వరించింది.
"""/" /
నార్త్ కరోలినా, విస్కాన్సిన్, మిచిగాన్, పెన్సిల్వేనియా, అరిజోనా, జార్జియాలను కీలకమైన యుద్ధభూమి రాష్ట్రాలకు లిస్ట్ చేస్తూ అలాంటి ఏరియాలలో గ్రాస్‌రూట్ ప్రచారం ప్రారంభించినట్లు ఛటర్జీ వెల్లడించారు.
హారిస్ ద్విజాతి వారసత్వం అమెరికాకు ఒక మెల్టింగ్ పాయింట్‌గా క్యాంపెయిన్ వెబ్‌సైట్ తెలిపింది.
ప్రపంచం నలుమూలల నుంచి వచ్చిన ప్రజలకు అమెరికా ఒక ఆశ్రయంగా పేర్కొంది.కమల వంటి వారు యూఎస్ జనాభాలో 12.
5 శాతం మంది ఉన్నారని తెలిపింది.భారతీయ అమెరికన్ కమ్యూనిటీ ఇప్పుడు అమెరికాలో ఐదు మిలియన్ల మార్క్‌కు చేరుకుందని, వారిలో మూడింట ఒక వంతు దేశంలోనే జన్మించారని వెబ్‌సైట్ వెల్లడించింది.
అమెరికా( America )లోని అత్యంత విజయవంతమైన సమూహాలలో ఒకటైన భారతీయ అమెరికన్‌లు .
దేశ అత్యున్న కార్యాలయంలో తమ సొంత వ్యక్తిని కలిగి ఉండటానికి సమయం ఆసన్నమైందని క్యాంపెయిన్ సభ్యులు తెలిపారు.
సుకుమార్ సినిమాలో రామ్ చరణ్ అలా కనిపించబోతున్నాడా..?