అమెరికా : ఎఫ్‌బీఐలో భారత సంతతి మహిళకు కీలక పదవి.. !!
TeluguStop.com
భారత సంతతికి చెందిన మహిళ శోహిని సిన్హాకు( Shohini Sinha ) అమెరికా అగ్రశ్రేణి దర్యాప్తు సంస్థ (ఎఫ్‌బీఐ)లో కీలక పదవి దక్కింది.
ఉటా రాష్ట్రంలోని సాల్ట్ లేక్ సిటీలో ఎఫ్‌బీఐ ఫీల్డ్ ఆఫీస్‌కు ప్రత్యేక ఏజెంట్‌గా నియమితులయ్యారు.
ప్రస్తుతం ఆమె వాషింగ్టన్ డీసీలోని ఎఫ్‌బీఐ ప్రధాన కార్యాలయంలో డైరెక్టర్‌కు ఎగ్జిక్యూటివ్ స్పెషల్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్నారు.
ఈ క్రమంలోనే ఎఫ్‌బీఐ డైరెక్టర్ క్రిస్టోఫర్ వ్రే .సిన్హాను ప్రత్యేక ఏజెంట్‌గా నియమించారు.
తీవ్రవాద నిరోధక పరిశోధనలపై సిన్హా అసాధారణ ట్రాక్ రికార్డ్‌ను, ఏజెన్సీలో విస్తృతమైన అనుభవాన్ని క్రిస్టోఫర్ పరిగణనలోనికి తీసుకున్నారు.
2001లో ఎఫ్‌బీఐలో( FBI ) స్పెషల్ ఏజెంట్‌గా చేరిన సిన్హా అద్భుతమైన కెరీర్‌ను కలిగివున్నారని సోమవారం విడుదల చేసిన ప్రకటన తెలిపింది.
మిల్వాకీ ఫీల్డ్ ఆఫీస్‌లో( Milwaukee Field Office ) ఆమె కెరీర్ ప్రారంభమైంది.
అక్కడ ఆమె తీవ్రవాద నిరోధక పరిశోధనలు చేశారు.తన బహుముఖ ప్రజ్ఞ, నిబద్ధతను ప్రదర్శించిన శోహిని.
గ్వాంటనామో బే నావల్ బేస్, లండన్‌లోని ఎఫ్‌బీఐ లీగల్ అటాచ్ ఆఫీస్, బాగ్దాద్ ఆపరేషన్స్ సెంటర్‌తో సహా అనేక అసైన్‌మెంట్‌లలో పాలు పంచుకున్నారు.
"""/" /
ఆమె అత్యుత్తమ పనితీరుకు గుర్తింపుగా.శోహిని సిన్హా 2009లో సూపర్ వైజరీ స్పెషల్ ఏజెంట్‌గా పదోన్నతి పొందారు.
అలాగే వాషింగ్టన్ డీసీలోని ఉగ్రవాద నిరోధక విభాగానికి బదిలీ అయ్యారు.అక్కడ కెనడా కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్న ఉగ్రవాదులపై సిన్హా ఫోకస్ పెట్టారు.
2012లో కెనడాలోని ఒట్టావాలో లీగల్ అసిస్టెంట్ అటాచ్‌గా పదోన్నతి పొంది సిన్హా మరో మైలురాయిని సాధించింది.
ఆ సమయంలో రాయల్ కెనడియన్ మౌంటెండ్ పోలీస్ ( Royal Canadian Mounted Police ), కెనడియన్ సెక్యూరిటీ ఇంటెలిజెన్స్ సర్వీస్‌తో కలిసి పనిచేశారు.
అనంతరం 2015లో డెట్రాయిట్ ఫీల్డ్ ఆఫీస్‌లో ఫీల్డ్ సూపర్‌వైజర్‌గా సిన్హా పదోన్నతి పొందారు.
ఈ సమయంలో అంతర్జాతీయ ఉగ్రవాద కేసులను పరిశోధించే బృందాలను ఆమె సమర్ధవంతంగా నడిపించారు.
"""/" /
అత్యాధునిక విషయాలపై ఆసక్తిని ప్రదర్శించే సిన్హా.2020 ప్రారంభంలో సైబర్ ఇన్‌ట్రూషన్ స్క్వాడ్‌లో( Cyber Intrusion Squad ) అడుగుపెట్టారు.
ఆ మరుసటి ఏడాది మరోసారి ప్రమోషన్ పొందిన శోహిని పోర్ట్‌ల్యాండ్ ఫీల్డ్ ఆఫీస్‌లో జాతీయ భద్రతా విషయాలకు బాధ్యత వహించే అసిస్టెంట్ స్పెషల్ ఏజెంట్‌గా నియమితులయ్యారు.
2021లో వాషింగ్టన్ డీసీలో ఎఫ్‌బీఐ డైరెక్టర్‌కి ఎగ్జిక్యూటివ్ స్పెషల్ అసిస్టెంట్‌గా ఎంపికై తన అసమాన నాయకత్వ లక్షణాలను ప్రదర్శించారు.
తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – డిసెంబర్22, ఆదివారం 2024