యూకే : ప్రతిష్టాత్మక ‘‘ మార్షల్ స్కాలర్‌షిప్ 2024’’ విజేతల జాబితాలో భారతీయ అమెరికన్‌కు చోటు
TeluguStop.com
ప్రతిష్టాత్మక ‘‘ 2024 మార్షల్ స్కాలర్‌షిప్ ’’ విజేతలలో భారతీయ అమెరికన్ చోటు దక్కించుకున్నారు.
మొత్తం 51 మంది ఈ స్కాలర్‌షిప్‌కు ఎంపికైతే వారిలో అతను ఒకడు.యూకేలోని ఏ యూనివర్సిటీలోనైనా గ్రాడ్యుయేట్ విద్యను అభ్యసించడానికి అమెరికన్ స్కాలర్‌కు ఇది అవకాశం కల్పిస్తుంది.
బెంగళూరులో జన్మించిన హరి చౌదరి( Hari Chaudhary ) ఈ ప్రతిష్టాత్మక స్కాలర్‌షిప్‌కు ఎంపికయ్యాడు.
జార్జ్‌టౌన్ వర్సిటీలో హిస్టరీ( History At Georgetown University ) , ఇంటర్నేషనల్ పాలిటిక్స్‌ను అతను అభ్యసిస్తున్నాడు.
2004లో ఆయన తన గ్రాడ్యుయేట్ స్టడీస్‌ను ప్రారంభించారు.ఈ ప్రోగ్రామ్ కింద ఈ ఏడాది అమెరికా వ్యాప్తంగా 1006 దరఖాస్తులు వచ్చాయి.
మార్షల్ స్కాలర్‌గా ఆయన క్వీన్స్ యూనివర్సిటీ బెల్‌ఫాస్ట్‌లో కన్‌ఫ్లిక్ట్ ట్రాన్స్‌ఫార్మేషన్, సామాజిక న్యాయాన్ని అధ్యయనం చేస్తాడు.
ఆ తర్వాత లండన్‌లోని కింగ్స్ కాలేజ్‌లోని ( King's College, London )గ్లోబల్ లీడర్‌షిప్ అండ్ పీస్ బిల్డింగ్‌లో ఎంఎస్సీ చదవనున్నాడు.
హరి తన కాలేజ్ కెరీర్‌లో పలు ఇంటర్న్‌షిప్‌లలో పాల్గొన్నాడు.ఉత్తర ఐర్లాండ్‌లోని సెంటర్ ఫర్ క్రాస్ బోర్డర్ స్టడీస్ అండ్ మెరిడియన్ ఇంటర్నేషనల్ సెంటర్‌లలో పలు కార్యక్రమాల్లో హరి భాగమయ్యాడు.
"""/" /
ఆయన ప్రస్తుతం జర్మనీలోని మ్యూనిచ్‌లో వున్న యూఎస్ కాన్సులేట్ జనరల్ కార్యాలయంలోని పొలిటికల్ విభాగంలో వర్చువల్ స్టూడెంట్ ఫెడరల్ సర్వీస్ (వీఎస్ఎఫ్ఎస్)లో ఇంటర్న్‌గా వున్నారు.
తదుపరి సెమిస్టర్‌లో యూఎస్ కాంగ్రెస్ హౌస్ కమిటీ ఆన్ ఫారిన్ అఫైర్స్‌తో ఇంటర్న్ చేయనున్నారు.
జర్మన్ భద్రతా విధానంపై ఆయన పరిశోధనను అమెరికన్ జర్మన్ ఇన్‌స్టిట్యూట్ ప్రచురించింది. """/" /
నార్త్ అమెరికా ట్రేడ్ కమీషనర్, న్యూయార్క్‌లోని బ్రిటీష్ కాన్సుల్ జనరల్‌గా విధులు నిర్వర్తిస్తున్న ఎమ్మా వేడ్ స్మిత్ ( Emma Wade Smith )సోమవారం ఈ స్కాలర్‌షిప్‌ను ప్రకటించారు.
సైన్స్, మ్యాథ్స్, భాషాశాస్త్రం, కృత్రిమ మేథ, శక్తి, స్థిరత్వం, వలస అధ్యయనాల వరకు ఈ యంగ్ లీడర్స్ వారి బలమైన విద్యా శిక్షణతో ఇప్పటికే ఆకట్టుకున్నారని స్మిత్ ప్రశంసించారు.
వారు తమ కెరీర్ పథాల పరంగా నిజమైన వాగ్థానాన్ని ప్రదర్శించారని తెలిపారు.ఈ ఏడాది మార్షల్ స్కాలర్‌షిప్ తరగతతిలో ఔత్సాహిక దౌత్యవేత్తలు , వైద్యులు, ఫైటర్ పైలట్లు, శాస్త్రవేత్తలు స్థానం సంపాదించారు.
స్పిరిట్ లో స్టార్ హీరో ప్రభాస్ అలా కనిపించనున్నారా.. ఇదే జరిగితే అరాచకం!