బంగ్లాదేశ్‌లో హిందువులపై దాడులు.. ఖండించిన ఇండో అమెరికన్ నేత వివేక్ రామస్వామి

బంగ్లాదేశ్‌( Bangladesh )లో రిజర్వేషన్ల అంశం షేక్ హసీనా ప్రభుత్వాన్ని గద్దె దించడంతో పాటు ఆమె రాజకీయ శరణార్ధిగా భారత్‌లో తలదాచుకోవాల్సిన పరిస్ధితులు నెలకొన్నాయి.

షేక్ హసీనా( Sheikh Hasina ) రాజీనామా చేసి దేశం వీడినా బంగ్లాదేశ్‌లో సాధారణ పరిస్ధితులు నెలకొనడం లేదు.

అల్లరి మూకలు ప్రభుత్వ ఆస్తులను, ప్రముఖుల నివాసాలే టార్గెట్‌గా విధ్వంసానికి తెగబడుతున్నాయి.అయితే ఆందోళనల ముసుగులో మతపరమైన హింస చోటు చేసుకుంటుండటం, ముఖ్యంగా హిందువులు , హిందూ ఆలయాలను ధ్వంసం చేయడంతో అంతర్జాతీయ సమాజం ఆగ్రహం వ్యక్తం చేస్తోంది.

హసీనా ప్రభుత్వం పడిపోయిన తర్వాత బంగ్లాదేశ్‌లోని 52 జిల్లాల్లో మైనారిటీలపై 205 దాడులు జరిగాయని బంగ్లాదేశ్ హిందూ బౌద్ధ క్రైస్తవ ఐక్యతా మండలి , బంగ్లాదేశ్ పూజ ఉద్జపన్ పరిషత్‌లు పేర్కొన్నట్లు పీటీఐ వార్తా సంస్థ నివేదించింది.

"""/" / హిందువులపై జరుగుతున్న హింసపై భారత సంతతి నేత, అమెరికన్ బిలియనీర్ వివేక్ రామస్వామి ఆందోళన వ్యక్తం చేస్తూ ట్వీట్ చేశారు.

బంగ్లాదేశ్‌లో కోటా వ్యవస్ధ విపత్తుగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు.2018లోనూ నిరసనల కారణంగా కోటా అంశాన్ని ప్రభుత్వం రద్దు చేసిందని, కానీ బాధితుల పోరాటంతో ఈ ఏడాది దానిని పునరుద్ధరించారని రామస్వామి వెల్లడించారు.

ఈసారి అది ఏకంగా ప్రభుత్వాన్ని పడగొట్టేలా నిరసనలను ప్రేరేపించిందని, ప్రధాని దేశం విడిచి పారిపోయారని.

ఒక్కసారి గందరగోళం ప్రారంభమైతే, అంత తేలిగ్గా నియంత్రించలేమన్నారు.ఈ క్రమంలోనే రాడికల్స్.

హిందూ మైనారిటీలను టార్గెట్ చేసుకున్నారని రామస్వామి తెలిపారు. """/" / అటు మైనారిటీలపై జరుగుతున్న దాడులను బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వ ప్రధాన సలహాదారు మొహమ్మద్ యూనస్ ఖండించారు.

మంగళవారం ఓ హిందూ దేవాలయాన్ని సందర్శించిన ఆయన బంగ్లాదేశ్‌లో హక్కులు అందరికీ సమానమేనన్నారు.

గత శనివారం వేలాదిమంది హిందువులు తమ దేవాలయాలు, గృహాలు, వ్యాపారాలను దాడుల నుంచి రక్షించాలని డిమాండ్ చేస్తూ ఢాకా, చట్టాగ్రామ్‌లలో నిరసనలకు దిగారు.

మైనారిటీలను వేధిస్తున్నట్లుగా ఆరోపణలు ఎదుర్కొంటున్న వారిని విచారించేందుకు ప్రత్యేక కోర్టులు, మైనారిటీలకు 10 శాతం పార్లమెంట్ స్థానాలు, మైనారిటీ రక్షణ చట్టం తీసుకురావాలని హిందువులు డిమాండ్ చేస్తున్నారు.

బాలయ్య లైనప్ లో చేరిపోయిన మరో ఇద్దరు దర్శకులు…