అమెరికాలో చరిత్ర సృష్టించిన తెలుగు మహిళ.. కాన్సాస్ రాష్ట్ర సెనేటర్‌గా పగ్గాలు..!!

వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల కోసం అమెరికాకు వెళ్లిన భారతీయులు ఇప్పుడు అక్కడ కీలక స్థానాల్లో వున్న సంగతి తెలిసిందే.

శాస్త్రవేత్తలు, డాక్టర్లు, లాయర్లు, ఇంజనీర్లు, వ్యాపారవేత్తలు, సీఈవోలు, పారిశ్రామికవేత్తలుగా రాణిస్తున్నారు.ఉద్యోగం కోసం అమెరికాకు వెళ్లిన భారతీయులు.

ఇప్పుడు అమెరికన్లకే ఉద్యోగాలు ఇచ్చే స్థాయికి చేరుకుంటున్నారు.తాజాగా తెలుగు మూలాలున్న మహిళ అమెరికాలో చరిత్ర సృష్టించింది.

డెమొక్రాటిక్ పార్టీకి చెందిన ఉషారెడ్డి కాన్సాస్ రాష్ట్రంలోని డిస్ట్రిక్ట్ 22 సెనేటర్‌గా ఎన్నికయ్యారు.

గత నెలలో శాసనసభ నుంచి పదవీ విరమణ చేసిన మాన్‌హట్టన్ సెనేటర్ టామ్ హాక్ స్థానంలో ఉషారెడ్డి నియమితులయ్యారు.

దీనిపై ఆమె తన ఆనందాన్ని వ్యక్తపరిచారు.ఈ మేరకు ట్విట్టర్ ద్వారా స్పందించారు.

డిస్ట్రిక్ట్ 22కి ప్రాతినిథ్యం వహిస్తున్నందుకు తనకు థ్రిల్‌గా వుందని.ఇప్పటి వరకు ఈ పదవిలో వున్న సెనేటర్ హాక్ ప్రజా సేవకు ఆమె ధన్యవాదాలు తెలిపారు.

ఆయన అత్యుత్తమ నాయకుడని, అతని స్థాయికి చేరుకుంటానని ఆమె పేర్కొన్నారు.ఆంధ్రప్రదేశ్‌లోని తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరానికి చెందిన ఉషా రెడ్డి కుటుంబం ఆమెకు ఎనిమిదేళ్లు వున్నప్పుడు 1973లో అమెరికాకు వలస వచ్చింది.

మనస్తత్వ శాస్త్రం, ప్రాథమిక విద్యలో బ్యాచిలర్ డిగ్రీలు, కాన్సాస్ స్టేట్ యూనివర్సిటీ నుంచి ఎడ్యుకేషన్ లీడర్‌షిప్‌లో మాస్టర్స్ డిగ్రీని ఆమె అందుకున్నారు.

"""/"/ ఉషారెడ్డి మాన్‌హట్టన్- ఓగ్డెన్ పబ్లిక్ స్కూల్స్‌లో టీచర్‌గా పనిచేసింది.అలాగే నేషనల్ ఎడ్యుకేషన్ అసోసియేషన్ చాప్టర్ అధ్యక్షురాలిగా విధులు నిర్వర్తించారు.

2013 నుంచి మాన్‌హాట్టన్ సిటీ కమీషన్‌లో కమీషనర్‌గా , రెండుసార్లు మేయర్‌గా పనిచేశారు.

గత 28 ఏళ్ల నుంచి ఉషారెడ్డి మాన్‌హాట్టన్‌లో నివసిస్తున్నారు.సెనేటర్ హాక్ మిగిలిపోయిన పదవీకాలం 2025లో ముగుస్తుంది.

ఈ సమయంలో ఉషారెడ్డి సెనేటర్‌గా విధులు నిర్వర్తిస్తారు.ఇకపోతే.

అమెరికాలోని టెక్సాస్ రాష్ట్రంలో ఇటీవల భారతీయ మూలాలున్న వారు కీలక పదవులు అందుకుంటున్న సంగతి తెలిసిందే.

తాజాగా ఫోర్డ్ బెండ్ టోల్ రోడ్ అథారిటీ అండ్ గ్రాండ్ పార్క్‌వే టోల్ రోడ్ అథారిటీ డైరెక్టర్ల బోర్డులో భారత సంతతి వ్యక్తి నియమితులయ్యారు.

"""/"/ ఆర్ధిక నైపుణ్యం, వృత్తి అనుభవం తదితర అంశాలను దృష్టిలో వుంచుకుని స్వపన్ ధైర్యవాన్ (57) ఈ పదవిలో నియమితులయ్యారు.

దీనిపై Precinct 3 కమీషనర్ ఆండీ మేయర్స్ స్పందిస్తూ.గ్రాండ్ పార్క్ వే టోల్ వే బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్‌లో ధైర్యవాన్‌ను నియమించడం తనకు గర్వకారణంగా వుందన్నారు.

అతను సర్టిఫైడ్ పబ్లిక్ అకౌంటెంట్, ప్రజల డబ్బుకు జవాబుదారీగా వుంటాడని మేయర్స్ పేర్కొన్నారు.

ఈ సంస్థ డైరెక్టర్‌గా.కౌంటీ నిర్వహణ, విస్తరణ, బడ్జెట్, ఆర్ధిక అంశాలను ధైర్యవాన్ పర్యవేక్షిస్తారు.

తన నియామకంపై ధైర్యవాన్ స్పందిస్తూ.కమీషనర్ ఆండీ మేయర్స్‌కి కృతజ్ఞతలు తెలిపారు.

టోల్ వేలు ప్రజలను కనెక్ట్ చేయడమే కాకుండా పొరుగు ప్రాంతాలకు ఆర్ధిక ఇంజిన్‌గా వుంటాయని చెప్పారు.

నాగార్జున 100 వ సినిమా మీద ఫోకస్ పెడితే మంచిదని ఫ్యాన్స్ కోరుతున్నారా..?