Sonali Korde : అమెరికా : యూఎస్ఏఐడీలో భారత సంతతి మహిళకు కీలక పదవి..!!
TeluguStop.com
వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల కోసం అమెరికా( America ) వెళ్లి అక్కడ స్థిరపడిన భారతీయులు ఎన్నో రంగాల్లో కీలక స్థానాల్లో వున్న సంగతి తెలిసిందే.
రోజురోజుకీ ఈ లిస్ట్ మరింత పెరుగుతూ వస్తోంది.తాజాగా యూఎస్ ఏజెన్సీ ఫర్ ఇంటర్నేషనల్ డెవలప్‌మెంట్ (యూఎస్ఏఐడీ) అనుబంధ ‘‘ బ్యూరో ఫర్ హ్యుమానిటేరియన్ అసిస్టెన్స్ ’’( Bureau For Humanitarian Assistance ) అడ్మినిస్ట్రేటర్‌కి అసిస్టెంట్‌గా భారతీయ అమెరికన్ సోనాలి కోర్డే( Sonali Korde ) ప్రమాణ స్వీకారం చేశారు.
గతంలో అడ్మినిస్ట్రేటర్‌కు డిప్యూటీ అసిస్టెంట్‌గా వున్న సమయంలో .గాజాలో మానవతా సంక్షోభాన్ని పరిష్కరించడానికి , అమెరికా తరపున దౌత్య ప్రయత్నాలకు నాయకత్వం వహించిన యూఎస్ ప్రతినిధికి డిప్యూటీగానూ సోనాలి పనిచేశారు.
"""/" /
కోర్డే గతంలో జాతీయ భద్రతా మండలిలో గ్లోబల్ హెల్త్ అండ్ డెవలప్‌మెంట్ డైరెక్టర్‌గానూ విధులు నిర్వర్తించారు.
ఈ హోదాలో ఆమె అమెరికా ప్రభుత్వ గ్లోబల్ హెల్త్ పోర్ట్‌ఫోలియాలో విస్తృత అభివృద్ధి, భద్రత, ద్వైపాక్షిక దౌత్యం, సహకారా లక్ష్యాల అనుసంధానానికి మద్ధతు ఇచ్చారు.
2005 నుంచి 2013 వరకు యూఎస్ఏఐడీ( USAID ) బ్యూరో ఫర్ గ్లోబల్ హెల్త్‌లో ప్రెసిడెంట్స్ మలేరియా ఇనిషియేటివ్‌కు సీనియర్ సాంకేతిక సలహాదారుగా సేవలందించారు.
ప్రపంచ ఆరోగ్య సంస్థ, ఇతర ఐక్యరాజ్యసమితి అనుబంధ సంస్థలు, ఎన్‌జీవోలు, ప్రభుత్వ సహచరుల సమన్వయంతో ఆఫ్రికా, ఆసియాలో సమీకృత మలేరియా , ప్రజారోగ్య కార్యక్రమాల నిర్వహణను కూడా చేపట్టారు.
యేల్ యూనివర్సిటీ నుంచి ఇంటర్నేషనల్ రిలేషన్స్‌లో ఎంఏ, న్యూయార్క్ విశ్వవిద్యాలయం నుంచి ఆర్ధిక శాస్త్రంలో సోనాలి బీఎస్ పట్టా పొందారు.
"""/" /
కాగా.యూఎస్ఏఐడీ మిషన్‌కు డైరెక్టర్‌గా గతంలో భారత సంతతికి చెందిన వీణా రెడ్డి( Veena Reddy ) నియమితులైన సంగతి తెలిసిందే.
తద్వారా ఈ మిషన్‌కు తొలి ఇండో అమెరికన్ డైరెక్టర్‌గా వీణా చరిత్ర సృష్టించారు.
గతంలో వీణా రెడ్డి హైతీలో డిప్యూటీ మిషన్ డైరెక్టర్‌గా పనిచేశారు.అక్కడ తలెత్తిన భారీ భూకంపం అనంతరం పునర్నిర్మాణ ప్రయత్నాలు, ఎన్నికలకు సాయం, ఆర్ధిక వృద్ధి, ఆహార భద్రత, హారికేన్‌లను ఎదుర్కోవడంపై కొత్త వ్యూహాలను అభివృద్ధి చేయడం వంటి వాటిని వీణా పర్యవేక్షించారు.
దీనికి ముందు ఆమె వాషింగ్టన్‌లో అసిస్టెంట్ జనరల్ కౌన్సిల్‌గా విధులు నిర్వర్తించారు.ఆసియా, మిడిల్ ఈస్ట్, ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్‌లలో యూఎస్ఏఐడీ కార్యక్రమాలకు చట్టపరమైన విషయాల్లో సలహాలు అందించారు.
అలాగే పాకిస్తాన్, మిడిల్ ఈస్ట్, సెంట్రల్ అమెరికాలలోని దేశాలని యూఎస్ఏఐడీ మిషన్‌లలో పాలు పంచుకున్నారు.
హలో అబ్బాయిలు.. త్వరలో పెళ్లి చేసుకోబోతున్నారా.. అయితే ఇవి తప్పక తెలుసుకోండి!