అమెరికా: ఇండో-యూఎస్ రక్షణ సంబంధాల్లో కీలకపాత్ర.. భారత సంతతి శాస్త్రవేత్తకు ప్రతిష్టాత్మక అవార్డు

వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల కోసం అమెరికాకు వలస వెళ్లిన భారతీయులు అక్కడి అన్ని రంగాల్లో రాణిస్తున్న సంగతి తెలిసిందే.

రాజకీయ నాయకులు, కార్పోరేట్ కంపెనీల సారథులు, డాక్టర్లు, శాస్త్రవేత్తలుగా రాణిస్తూ ఆశ్రయమిచ్చిన దేశంతో పాటు భారతదేశానికి కూడా గర్వకారణంగా నిలుస్తున్నారు.

అదే సమయంలో జన్మభూమిలో సైతం ఎన్నో సేవా కార్యక్రమాలను నిర్వహిస్తూ పుట్టిన గడ్డ రుణం తీర్చుకుంటున్నారు.

అలాగే అమెరికా ప్రభుత్వం వద్ద గట్టి లాబీగా పనిచేస్తూ.భారత్‌తో సంబంధాలకు కృషి చేస్తున్నారు.

ఈ నేపథ్యంలో ఇండో యూఎస్ మధ్య సన్నిహిత సంబంధాలు మెరుగుపరుస్తున్న భారత సంతతికి చెందిన శాస్త్రవేత్త డాక్టర్ వివేక్‌లాల్‌కు లైఫ్ టైమ్ అచీవ్‌మెంట్స్ అవార్డు లభించింది.

ఇటీవల దుబాయ్‌లో జరిగిన రిటోస్సా ఫ్యామిలీ సమ్మిట్స్‌లో భాగంగా వివేక్ లాల్ ఈ అవార్డును అందుకున్నారు.

రిటోస్సా ఫ్యామిలీ ఆఫీస్ ఛైర్మన్ సర్ ఆంటోనీ రిటోస్సా.డాక్టర్ వివేక్ లాల్‌కు అవార్డును బహుకరించారు.

ఈ కార్యక్రమంలో యూఏఈ విదేశీ వాణిజ్య శాఖ మంత్రి డాక్టర్ తాని బిన్ అహ్మద్ అల్ జెయుడీ కూడా పాల్గొన్నారు.

జకార్తాలో జన్మించిన డాక్టర్ వివేక్ లాల్.డ్రోన్లు, ఇతర రక్షణ పరికరాల ఉత్పత్తిలో ప్రపంచంలోనే పేరెన్నిక కన్న జనరల్ అటామిక్స్‌కు సీఈవోగా వ్యవహరిస్తున్నారు.

అమెరికన్ సెక్యూరిటీ అండ్ ఎయిరో‌స్పేస్‌ దిగ్గజం లాక్‌హీడ్ మార్టిన్‌లో ఏరోనాటిక్స్ స్ట్రాటజీ అండ్ బిజినెస్ డెవలప్‌మెంట్ వైస్ ప్రెసిడెంట్‌గా వ్యవహరిస్తున్న వివేక్ లాల్ 2020 ఏప్రిల్‌లో తన పదవికి రాజీనామా చేశారు.

కుటుంబంతో ఎక్కువసేపు గడపటానికే తాను ఈ నిర్ణయం తీసుకున్నట్లు అప్పట్లో వివేక్ ప్రకటించారు.

ఆ తర్వాత కొన్ని రోజులకే జనరల్ అటామిక్స్‌లో చేరుతున్నట్లు తెలిపారు. """/"/ జనరల్ అటామిక్స్ ప్రపంచంలో ప్రైవేట్ వ్యక్తుల ఆధీనంలో ఉన్న అణు, రక్షణ సంస్థలలో ప్రముఖమైనది.

మానవరహిత విమానాలు, ఎలక్ట్రో- ఆప్టికల్, రాడార్, సిగ్నల్స్ ఇంటెలిజెన్స్ మరియు ఆటోమేటెడ్ ఎయిర్‌బోర్న్ నిఘా వ్యవస్థలను ఈ సంస్థ తయారు చేస్తుంది.

జనరల్ అటామిక్స్‌లో అత్యున్నత పదవిలో పనిచేయడం ఆయనకు ఇది రెండో సారి.గతంలో 2014-2018 వరకు ఈ కంపెనీలోని స్ట్రాటజిక్ డెవలప్‌మెంట్ చీఫ్ ఎగ్జిక్యూటివ్‌గా వివేక్ వ్యవహరించారు.

"""/"/ తన వ్యూహ చతురతతో నాటోయేతర దేశమైన భారత్‌కు కేటగిరీ-1 మానవరహిత వైమానిక విమానాలను (యూఏవీ) విక్రయించాలన్న నాటి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నిర్ణయంలో వివేక్ లాల్ కీలకపాత్ర పోషించారు.

క్షిపణులను మోసుకెళ్లగల సామర్ధ్యం ఉన్న యూఏవీలు కేటగిరీ-1 కిందకు వస్తాయి.2000 చివరిలో బోయింగ్ డిఫెన్స్ స్పేస్ అండ్ సెక్యూరిటీకి వైస్ ప్రెసిడెంట్ మరియు ఇండియా కంట్రీ హెడ్‌గా వ్యవహరించిన వివేక్ లాల్ బిలియన్ డాలర్ల విలువ చేసే ద్వైపాక్షిక రక్షణ ఒప్పందాలలో ముఖ్య భూమిక పోషించారు.

వీటిలో 4 బిలియన్ డాలర్ల విలువైన 10 సీ-17 స్ట్రాటజిక్ లిఫ్ట్ మిలటరీ ట్రాన్స్‌పోర్ట్ ఎయిర్‌క్రాఫ్ట్, 3 బిలియన్ డాలర్ల విలువైన పీ-8ఐ యాంటీ సబ్‌మెరైన్ ఎయిర్‌క్రాఫ్ట్, 28 అపాచీ హెలికాఫ్టర్లు, 5 బిలియన్ డాలర్ల విలువైన 15 చినూక్‌లు, 200 బిలియన్ డాలర్ల విలువైన 22 హార్పూన్ క్షిపణులు ఉన్నాయి.

రెండేళ్ల క్రితం యూఎస్ ఫెడరల్ ఏవియేషన్ అడ్వైజరీ కమిటీలో వివేక్ లాల్ నియమితులయ్యారు.

2005లో ప్రారంభమైన యూఎస్- ఇండియా ఏవియేషన్ కో ఆపరేషన్ ప్రోగ్రాం వ్యవస్థాపక కో చైర్‌గా కూడా లాల్ వ్యవహరించారు.

బొప్పాయి పంటను బూజు తెగుళ్ల నుండి సంరక్షించే యాజమాన్య పద్ధతులు..!