వర్జీనియా గవర్నర్ రేసులో భారతీయ అమెరికన్: రిపబ్లికన్ పార్టీ నుంచి బరిలోకి..!!!

విద్య, ఉద్యోగ, వ్యాపారాల కోసం దశాబ్ధాల క్రితం అమెరికాకు వలస వెళ్లిన భారతీయులు ప్రస్తుతం అక్కడ నిర్ణయాత్మక శక్తిగా ఉన్నారు.

అలాగే అక్కడి వ్యవస్థల్లో కీలక పదవుల్లో ఉండటంతో పాటు రాజకీయాల్లోనూ దూసుకెళ్తున్నారు.భారత సంతతికి చెందిన కమలా హారిస్ నవంబర్ 3న జరగనున్న ఎన్నికల్లో డెమొక్రాటిక్ పార్టీ తరపున ఉపాధ్యక్ష అభ్యర్ధిగా బరిలోకి నిలిచి యావత్ ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచారు.

తాజాగా భారత సంతతికి చెందిన వ్యాపారవేత్త పునీత్ అహ్లువాలియా వర్జీనియా రాష్ట్ర లెఫ్టినెంట్ గవర్నర్ పదవికి పోటీపడుతున్నారు.

ఈయన రిపబ్లికన్ పార్టీ తరపున ఎన్నికల బరిలోకి దిగుతున్నారు.ఢిల్లీ పబ్లిక్ స్కూల్‌లో విద్యాభ్యాసం చేసిన అహ్లువాలియా 1990లో అమెరికాకు వలస వెళ్లారు.

ప్రస్తుతం ఆయన ‘‘ ది లివింగ్‌స్టన్ గ్రూప్’’ సంస్థకు అంతర్జాతీయ వాణిజ్య సలహాదారుగా వ్యవహరిస్తున్నారు.

తొలి నుంచి రిపబ్లికన్ పార్టీ కార్యకలాపాల్లో క్రియాశీలకంగా వ్యవహరిస్తున్నారు అహ్లువాలియా.ప్రస్తుతం వర్జీనియా సమస్యల్లో వుందని.

డెమొక్రాటిక్ పార్టీ ఇస్తున్న పాత, వ్యర్ధమైన వాగ్థానాలకు కాలం చెల్లిపోయిందని పునీత్ వ్యాఖ్యానించారు.

వర్జీనియాకు కొత్త ఆలోచనలు, పెట్టుబడులు, ఉద్యోగాలు, సంపద, అభివృద్ధి సాధించేందుకు ఓ కొత్త వ్యాపార వాతావరణం కావాలని అహ్లువాలియా అన్నారు.

వర్జీనియా పోలీస్ సిబ్బందికి శాంతి భద్రతల కల్పనలో చేయూత నివ్వాలని ఆయన పిలుపునిచ్చారు.

కాగా, అమెరికా అధ్యక్ష ఎన్నికలు దగ్గరపడుతున్న క్రమంలో రిపబ్లికన్‌ అభ్యర్థి డొనాల్డ్‌ ట్రంప్‌ అన్ని శక్తులనూ కూడగట్టుకొనే పనిలో నిమగ్నమయ్యారు.

ఇందులో భాగంగా తన ‘ఆసియా పసిఫిక్‌ అమెరికా సలహా కమిటీ’ (ఏఏపీఐ)లో భారత సంతతి వారిని నియమించారు.

మొత్తం 30 మంది ఉన్న ఈ కమిటీలో పునీత్‌ అహ్లూవాలియా (వర్జీనియా), కేవీ కుమార్‌ (కాలిఫోర్నియా), షలబ్‌ కుమార్‌ (ఇల్లినాయిస్) ఉన్నట్టు ట్రంప్‌ ప్రతినిధి తెలిపారు.

తండ్రిని తలచుకుని ఎమోషనల్ అయిన వెంకటేశ్.. అన్ స్టాపబుల్ ప్రోమోలో ఆ సీక్రెట్స్ రివీల్!