అమెరికా : మెషిన్ లెర్నింగ్ సిస్టమ్స్‌పై పరిశోధన.. భారత సంతతి ప్రొఫెసర్‌కు ప్రతిష్టాత్మక అవార్డ్

మెషిన్ లెర్నింగ్‌పై పరిశోధనకు గాను అమెరికాలో భారత సంతతికి చెందిన ప్రొఫెసర్‌కు ప్రతిష్టాత్మక అవార్డ్ లభించింది.

కాన్సాస్ స్టేట్ యూనివర్సిటీలో కంప్యూటర్ సైన్స్ విభాగంలో ప్రొఫెసర్‌గా పనిచేస్తున్న పవిత్రా ప్రభాకర్‌.

నెగిటివ్ యూజర్ ఎక్స్‌పీరియన్స్‌ని తగ్గించేందుకు ఒక టూల్ అభివృద్ధి చేసినందుకు గాను ‘‘అమెజాన్ రీసెర్చ్ అవార్డ్’’ను అందుకున్నారు.

అమెజాన్ నుంచి అవార్డులు పొందిన 74 మంది గ్రహీతలలో పవిత్రా ప్రభాకర్ ఒకరు.

మెషీన్ లెర్నింగ్ ఆధారిత సాఫ్ట్‌వేర్ సిస్టమ్‌ల యూజర్‌లకు కలిగే అంతరాయాలను తగ్గించడానికి ఆమె రూపొందించిన టూల్ ఉపయోగించనున్నారు.

మెషిన్ లెర్నింగ్ ఆధారిత సిస్టమ్‌లకు సంబంధించి రెండు వెర్షన్‌లు ఎంత వరకు సారూప్యంగా వున్నాయో, లేదా విభిన్నంగా ఉన్నాయో అనే దానిని ఆటోమేటిక్‌గా వివరించడం ఈ ప్రాజెక్ట్ విస్తృత లక్ష్యమని పవిత్రా ప్రభాకర్ అన్నారు.

మెషీన్ లెర్నింగ్ ఆధారిత ఇంటెలిజెంట్ సాఫ్ట్‌వేర్.సిస్టమ్‌ల యూజర్స్ ఎక్స్‌పీరియన్స్‌ని మెరుగుపరచడం గురించి క్లిష్టమైన నిర్ణయాలు తీసుకోవడంలో ఆటోమేటెడ్ టూల్ డిజైన్ బృందాలకు ప్రయోజనం చేకూరుస్తుందని కాన్సాస్ స్టేట్ యూనివర్సిటీ ఒక ప్రకటనలో తెలిపింది.

"""/"/ ఇకపోతే.ప్రభాకర్ కంప్యూటర్ సైన్స్‌లో డాక్టరేట్, యూనివర్సిటీ ఆఫ్ ఇల్లినాయిస్ నుంచి అప్లైడ్ మ్యాథమేటిక్స్‌లో మాస్టర్స్ డిగ్రీ పొందారు.

కాలిఫోర్నియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో సెంటర్ ఫర్ మ్యాథమెటిక్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ నుంచి పోస్ట్ డాక్టోరల్ ఫెలోషిప్‌ను పొందారు.

కంప్యూటర్ సైన్స్‌లో పరిశోధనలకు గాను ఎన్ఎస్ఎఫ్ కెరీర్ అవార్డ్, ఆఫీస్ ఆఫ్ నేవల్ రీసెర్చ్ యంగ్ ఇన్వెస్టిగేటర్ అవార్డ్, యూరోపియన్ యూనియన్ నుంచి మేరీ క్యూరీ కెరీర్ ఇంటిగ్రేషన్ గ్రాంట్ వంటి అనేక ప్రతిష్టాత్మక అవార్డులను పవిత్రా ప్రభాకర్ పొందారు.

పుష్ప 2 విషయం లో అతి జాగ్రత్త మొదటికే మోసం వస్తుందా..?