అమెరికాలో భారత సంతతి ప్రొఫెసర్‌కు ‘‘యంగ్ యూరాలజిస్ట్ అవార్డ్’’ .. ఎవరీ నిత్యా అబ్రహం..?
TeluguStop.com
అమెరికాలో భారత సంతతి ప్రొఫెసర్‌కు ప్రతిష్టాత్మక పురస్కారం లభించింది.న్యూయార్క్‌లోని అల్బర్ట్ ఐన్‌స్టీన్ కాలేజ్ ఆఫ్ మెడిసిన్‌లో అసోసియేట్ ప్రొఫెసర్‌గా వున్న డాక్టర్ నిత్యా అబ్రహంకు( Dr.
Nitya Abraham ) ‘‘యంగ్ యూరాలజిస్ట్’’( Young Urologist ) అవార్డ్ దక్కింది.
యువ యూరాలజిస్టుల అభివృద్ధికి చేసిన కృషికి గాను నిత్యను ఈ పురస్కారం వరించింది.
మాంటెఫియోర్ యూరాలజీ రెసిడెన్సీ ప్రోగ్రామ్ కింద నిత్య ప్రోగ్రామ్ డైరెక్టర్‌గా వ్యవహరిస్తున్నారు.న్యూయార్క్‌లో తను పనిచేస్తున్న సంస్థలో ఎంతోమంది విద్యార్ధులకు, సహచరులకు, జూనియర్ ఫ్యాకల్టీకి ఆమె మార్గనిర్దేశనం చేస్తున్నారు.
"""/" /
తనకు దక్కిన గౌరవంపై నిత్య హర్షం వ్యక్తం చేశారు.ప్రస్తుతం వైద్యుల్లో నిరాశా నిస్పృహలతో పాటు డాక్టర్ల కొరత నేతృత్వంలో అమెరికన్ యూరాలజికల్ అసోసియేషన్ , దాని నాయకులు దేశవ్యాప్తంగా యువ యూరాలజిస్టుల కృష్టిని గుర్తించడం అద్భుతంగా వుందన్నారు.
అమెరికన్ యూరాలజికల్ అసోసియేషన్ (ఏయూఏ) ప్రకారం.పదేళ్లు లేదా అంతకంటే తక్కువ కాలం ప్రాక్టీస్ చేసిన వ్యక్తిని యంగ్ యూరాలజిస్ట్‌గా నిర్వచించింది.
"""/" /
మరోవైపు నిత్యా అబ్రహం.అల్బర్ట్ ఐన్‌స్టీన్ కాలేజ్ ఆఫ్ మెడిసిన్ ఎగ్జిక్యూటివ్ కరికులం కమిటీకి చైర్‌గా కూడా వున్నారు.
ఓరల్ బోర్డ్ రివ్యూ కోర్స్ ఫ్యాకల్టీ మెంబర్‌గానూ సేవలందించారు.అంతేకాకుండా సొసైటీ ఫర్ యూరోడైనమిక్స్, ఫిమేల్ పెల్విక్ మెడిసిన్, యూరోజెనిటల్ రీకన్‌స్ట్రక్షన్ ( Urogenital Reconstruction )(ఎస్‌యూఎఫ్‌యూ) యంగ్ యూరాలజిస్ట్స్ కమిటీ, సోషల్ మీడియా కమిటీలో సభ్యురాలు.
యూనివర్సిటీ ఆఫ్ కనెక్టికట్‌లో గ్రాడ్యుయేట్ అయిన నిత్యా అబ్రహం .న్యూయార్క్ యూనివర్సిటీ లాంగోన్ మెడికల్ సెంటర్‌లో మెడిసిన్ పూర్తి చేశారు.
అక్కడే యూరాలజీ రెసిడెన్సీని కూడా ఆమె పూర్తి చేశారు.అనంతరం క్లీవ్‌లాండ్ క్లినిక్‌లో ఫిమేల్ యూరాలజీలో ఫెలోషిప్ .
బ్రాంక్స్‌లోని మాంటెఫియోర్ మెడికల్ సెంటర్‌లోనూ నిత్య చేరారు.గ్లోబల్ ఆర్గనైజేషన్ ఆఫ్ పీపుల్ ఆఫ్ ఇండియన్ ఆరిజిన్ (జీవోపీఐవో) ఇంటర్నేషనల్ ఛైర్మన్ డాక్టర్ థామస్ అబ్రహం , డాక్టర్ సుశీ అబ్రహం కుమార్తె నిత్యా అబ్రహం.
ఆరోగ్యానికి వరం తోటకూర గింజలు.. ఈ విషయాలు తెలిస్తే తినకుండా ఉండలేరు!