అమెరికా అధ్యక్ష ఎన్నికలు.. తైవాన్‌పై నా విధానం ఇలా : భారత సంతతి అభ్యర్ధి వివేక్ రామస్వామి
TeluguStop.com
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ( Republican Party ) తరపున బరిలో నిలిచిన భారత సంతతికి చెందిన వివేక్ రామస్వామి( Vivek Ramaswamy ) పోటీలో దూసుకెళ్తున్నారు.
విరాళాల సేకరణ, ప్రచారం, ఇంటర్వ్యూలు, చర్చల్లో పాల్గొంటున్నారు.తన విదేశాంగ విధానంపై విమర్శలు వస్తున్నప్పటికీ .
సొంత పార్టీలోని ప్రత్యర్ధులు నిక్కీ హేలీ( Nikki Haley ) మండిపడుతున్నప్పటికీ ఆయన తన వ్యాఖ్యలకు కట్టుబడే వున్నారు.
తాజాగా తైవాన్( Taiwan ) విషయంలో తన అభిప్రాయాన్ని వివేక్ రామస్వామి పంచుకున్నారు.
చైనా దాడికి వ్యతిరేకంగా ఆ దేశాన్ని రక్షించాలా వద్దా అనే దానిపై ‘‘వ్యూహాత్మక అస్పష్టత’’( Strategic Clarity ) వైఖరిని అవలంభిస్తామన్నారు.
బీజింగ్ తైవాన్‌ను తమ భూభాగం నుంచి విడిపోయిన ప్రావిన్స్‌గా పరిగణిస్తున్న సంగతి తెలిసిందే.
అవసరమైతే సైనిక చర్య ద్వారా తమ భూ భాగంతో ఏకం చేయాలని డ్రాగన్ పట్టుబడుతోంది.
"""/" /
గ్లోబల్ సెమీకండక్టర్ హబ్‌గా వున్న తైవాన్‌పై నియంత్రణ సాధించాలని చైనా( China ) ఎప్పటి నుంచో చూస్తోంది.
కానీ ఇలా జరగకుండా చూసుకోవడం అమెరికా( America ) జాతీయ భద్రతకు అతి ముఖ్యమైన అంశమని వివేక్ రామస్వామి ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు.
సెమీ కండక్టర్ రంగంలో అమెరికా స్వాతంత్య్రం సాధించే వరకు తైవాన్‌ను మింగకుండా చైనాను నిరోధించాలని ఆయన పేర్కొన్నారు.
గత వారం బైడెన్ అడ్మినిస్ట్రేషన్.ఫారిన్ మిలటరీ ఫైనాన్సింగ్ (ఎఫ్ఎంఎఫ్) కింద తైవాన్‌కు 80 మిలియన్ డాలర్ల సైనిక సాయాన్ని అందించిన సంగతి తెలిసిందే.
ఇది సాధారణంగా సార్వభౌమాధికారం వున్న దేశాల కోసం ఉపయోగించే కార్యక్రమం. """/" /
ఇదిలావుండగా.
మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌పై( Donald Trump ) వివేక్ రామస్వామి సంచలన వ్యాఖ్యలు చేశారు.
తాను అధ్యక్షుడినైతే ఆయనకు క్షమాభిక్ష పెడతానని వ్యాఖ్యానించారు.తన ఉద్దేశం మాత్రం అమెరికాను ముందుకు తీసుకెళ్లడమేనని రామస్వామి అన్నారు.
అలాగే రిపబ్లికన్ నామినేషన్ ట్రంప్‌కు దక్కితే తన పూర్తి మద్ధతు ఆయనకే వుంటుందన్నారు.
పాలసీల పరంగా తనది ట్రంప్‌ది ఒకే విధమైన ఆలోచనా విధానమన్నారు.అమెరికా ఫస్ట్ నినాదం డొనాల్డ్ ట్రంప్ కంటే.
రాజకీయాల కంటే కూడా ఎంతో పెద్దదని వివేక్ చెప్పారు.