అమెరికా సర్జన్ జనరల్‌గా వివేక్ మూర్తి: సెనేట్ ఆమోదం, ఏడుగురు రిపబ్లికన్ల మద్ధతు

అమెరికా సర్జన్ జనరల్‌గా భారత సంతతికి చెందిన డాక్టర్ వివేక్ మూర్తిని నియమిస్తూ అధ్యక్షుడు జో బైడెన్ తీసుకున్న నిర్ణయానికి అమెరికా సెనేట్ ఆమోదం తెలిపింది.

అధికారం చేపడుతూనే వివేక్ మూర్తిని సర్జన్ జనరల్‌గా నామినేట్ చేశారు బైడెన్.దీంతో ఈ నియామకానికి సంబంధించి మంగళవారం సెనేట్‌లో ఓటింగ్ నిర్వహించారు.

దీనిలో భాగంగా 57 మంది సెనేటర్లు వివేక్ మూర్తికి అనుకూలంగా ఓటు వేయగా, 43 మంది సెనేటర్లు వ్యతిరేకించారు.

రిప‌బ్లిక‌న్ పార్టీకి చెందిన ఏడుగురు సెనేటర్లు బిల్ కాసిడీ, సుసాన్ కొలిన్స్, రోజర్ మార్షల్, లిసా ముర్కోవిస్కి, రాబ్ పోర్ట్మన్, మిట్ రోమ్నీ, డాన్ సుల్లివన్ డాక్టర్ మూర్తికి అనుకూలంగా ఓటు వేయడం విశేషం.

కర్ణాటక రాష్ట్రం మాండ్యా జిల్లా హళెగెరె గ్రామానికి చెందిన వివేక్ మూర్తి కుటుంబానికి తొలి నుంచి రాజకీయాలతో అనుబంధం వుంది.

ఆయన తాత హెచ్‌టీ నారాయణ శెట్టి ఆ రాష్ట్రంలో బీసీ సామాజిక వర్గానికి చెందిన కీలక నేత.

అంతేకాకుండా కర్ణాటక మాజీ సీఎం దివంగత దేవరాజ్ ఉరుసుకు అత్యంత సన్నిహితుడు.డాక్టర్ వివేక్ మూర్తి తండ్రి డాక్టర్ హెచ్‌ఎన్ లక్ష్మీ నరసింహ మూర్తి.

మైసూర్ మెడికల్ కాలేజీలో చదువుకున్నారు.ఆయన యూకేలో పలు హోదాల్లో పనిచేశారు.

వివేక్ సోదరి రష్మి కూడా అమెరికాలోని ఫ్లోరిడాలో ఫిజీషియన్‌గా సేవలు అందిస్తున్నారు.బ్రిటన్‌లో జన్మించిన వివేక్ మూర్తి అమెరికాలో పెరిగారు.

హార్వర్డ్ యూనివర్సిటీ నుంచి బీఏ, యేల్ స్కూల్ ఆఫ్ మేనేజ్‌మెంట్ నుంచి ఎంబీఏ పట్టా పొందారు.

అనంతరం యేల్ స్కూల్ ఆఫ్ మెడిసిన్‌లో ఎండీ చేశారు.43 ఏళ్ల డాక్ట‌ర్ మూర్తి .

అమెరికా స‌ర్జ‌న్ జ‌న‌ర‌ల్ ప‌ద‌విని చేప‌ట్ట‌డం ఇది రెండ‌వ‌సారి.2011లోనూ మాజీ అధ్య‌క్షుడు బ‌రాక్ ఒబామా ప్ర‌భుత్వ స‌మ‌యంలో వివేక్ మూర్తి .

హెల్త్ అడ్వైజ‌ర్‌గా ప‌ని చేశారు. """/"/ స‌ర్జ‌న్ జ‌న‌ర‌ల్‌గా సెనేట్ తనను ధ్రువీక‌రించ‌డం ప‌ట్ల ఆయన ధ‌న్య‌వాదాలు తెలిపారు.

దేశం కోలుకునేందుకు మీతో క‌లిసి ప‌నిచేస్తాన‌ని, మ‌న పిల్ల‌ల కోసం ఉత్త‌మ భ‌విష్య‌త్తును అందిస్తానని వివేక్ మూర్తి స్పష్టం చేశవారు.

కరోనా వైరస్ అనేది దేశ సమస్యతో పాటు తన వ్యక్తిగత సమస్య కూడా అని వివేక్ మూర్తి.

నామినేషన్ నిర్ధారణకు భేటీ అయిన సెనేట్ హెల్త్, ఎడ్యుకేషన్, లేబర్, పెన్షన్స్ కమిటీ సమావేశంలో కొద్దిరోజుల క్రితం వ్యాఖ్యానించారు.

అమెరికన్లను కోవిడ్ చావు దెబ్బ కొట్టిందని.దేశంలో ఐదు లక్షలకు పైగా మందిని వైరస్ బలిగొందని.

అందులో తన కుటుంబ సభ్యులు కూడా ఉన్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

తాను సర్జన్ జనరల్‌గా ఎన్నికైతే మాత్రం ఈ వైరస్‌ను అంతమొందించడమే తన తొలి ప్రాధాన్యమని ఆయన స్పష్టం చేశారు.

అమెరికాలో ఘోర ప్రమాదం : పల్టీలు కొడుతూ, చెట్టుపై ఇరుక్కుపోయిన కారు .. ముగ్గురు భారతీయుల దుర్మరణం