ఆయన ఉంటే క్షేమంగా ఉన్నట్లే: ట్రంప్ విజయం కోసం భారతీయుడి ప్రచారం

ఆయన ఉంటే క్షేమంగా ఉన్నట్లే: ట్రంప్ విజయం కోసం భారతీయుడి ప్రచారం

అమెరికా అధ్యక్ష ఎన్నికలకు సమయం దగ్గర పడుతోంది.దీంతో రిపబ్లికన్లు, డెమొక్రాట్లు ప్రచారాన్ని ముమ్మరం చేశారు.

ఆయన ఉంటే క్షేమంగా ఉన్నట్లే: ట్రంప్ విజయం కోసం భారతీయుడి ప్రచారం

అభ్యర్ధులతో పాటు వారి పార్టీలు, అభిమానులు సైతం తమ వారికి మద్ధతుగా రంగంలోకి దిగారు.

ఆయన ఉంటే క్షేమంగా ఉన్నట్లే: ట్రంప్ విజయం కోసం భారతీయుడి ప్రచారం

వీరిలో ప్రవాస భారతీయులు సైతం ఉన్నారు.తాజాగా ప్రస్తుత అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విజయం కోసం భారతీయ అమెరికన్ పారిశ్రామిక వేత్త రంగంలోకి దిగారు.

గుజరాత్‌లోని బరోడాకు చెందిన డానీ గైక్వాడ్ ఫ్లోరిడాలో స్థిరపడి విజయవంతమైన పారిశ్రామిక వేత్తగా గుర్తింపు తెచ్చుకున్నారు.

రిపబ్లికన్ పార్టీకి మద్ధతుదారుగా, ట్రంప్‌కు వీరాభిమానిగా ఆయన సుపరిచితులు.పార్టీలోని అగ్రశ్రేణి నాయకుల కోసం ఫండ్ రైజింగ్‌లో అతిపెద్ద భారతీయ అమెరికన్ రిపబ్లికన్ దాతలలో డానీ గైక్వాడ్ ఒకరు.

అధ్యక్ష ఎన్నికల్లో తన అభిమాన నేత విజయాన్ని కాంక్షిస్తూ.‘‘ ట్రంప్ హై తో సేఫ్ హై ’’ (ట్రంప్ ఉంటే క్షేమంగా ఉన్నట్లే’’ అనే నినాదంతో ఆయన క్యాంపెయినింగ్ ప్రారంభించారు.

ఎన్నికలకు సమయం దగ్గర పడిన టైంలో ట్రంప్ కరోనా బారినపడ్డారు.అందుకే నా సొంత డబ్బులతో ఆయనకు మద్ధతు కోసం ప్రయత్నిస్తున్నానని డానీ చెప్పారు.

దేశ ఆర్ధిక వ్యవస్థను గాడిలో పెట్ట గల వాడిగా తాను ట్రంప్‌ను నమ్ముతున్నానని గైక్వాడ్ వెల్లడించారు.

హోరాహోరీ పోరు నడిచే అవకాశం వున్న పెన్సిల్వేనియా, ఫ్లోరిడా, మిచిగాన్, ఒహియో రాష్ట్రాల్లో భారతీయ అమెరికన్లు ఓట్లు కీలకం కానున్నాయని ఆయన అభిప్రాయపడ్డారు.

భారత ప్రధాని నరేంద్ర మోడీ పేరున ఉన్న "మోదీ హై తో ముమ్‌కిన్ హై" అనే నినాదం ఆధారంగానే తన ఉద్యమానికి 'ట్రంప్ హై తో సేఫ్ హై' అనే పేరును ఎంచుకున్నట్లు డానీ స్పష్టం చేశారు.

2014లో జరిగిన భారత సార్వత్రిక ఎన్నికల సందర్భంగా మోడీ ఉపయోగించిన మరో నినాదం "ఏక్ బార్ ఔర్ మోదీ సర్కార్"ను ఆయన ఆదర్శంగా తీసుకున్నారు.

దీని ఆధారంగా "ఏక్ బార్ ఔర్ ట్రంప్ సర్కార్" అనే నినాదంతో టెలివిజన్ యాడ్స్‌ ద్వారా ప్రచారం నిర్వహిస్తున్నట్లు డానీ పేర్కొన్నారు.

ఎందుకంటే ఓటర్లను చేరడానికి భారతీయ ఛానెల్స్ కీలక పాత్ర పోషిస్తాయని డానీ గైక్వాడ్ విశ్వసిస్తున్నారు.

మరోసారి అలా కనిపించబోతున్న రామ్ చరణ్.. సుకుమార్ మ్యాజిక్ చేయడం పక్కా!