మొదటి నెల జీతం తీసుకోవడానికి వెళ్లి.. ఉన్మాదికి బలి: ఫెడెక్స్ ఘటనలో భారతీయుడి దీనగాథ
TeluguStop.com
అమెరికాలోని ఇండియానాపోలీస్ అంతర్జాతీయ విమానాశ్రయం సమీపంలోని ఫెడెక్స్ ఫెసిలిటీ కేంద్రం వద్ద గురువారం ఉన్మాది జరిపిన కాల్పుల్లో ఎనిమిది మంది మృతి చెందిన విషయం తెలిసిందే.
మృతుల్లో నలుగురు భారతీయ సిక్కులు కూడా ప్రాణాలు కోల్పోయారు.వీరిని అమర్జీత్ జోహల్ (66), జస్వీందర్ కౌర్ (64), జస్వీందర్ సింగ్ (68), అమర్జీత్ స్కోహన్(48)గా గుర్తించారు.
అమెరికా కాలమానం ప్రకారం గురువారం రాత్రి 11 గంటల ప్రాంతంలో ఫెడెక్స్ మాజీ ఉద్యోగి ఈ ఘాతుకానికి ఒడిగట్టాడు.
బ్రాడన్ స్కాట్ హోల్ (19) అనే యువకుడు ఫెడెక్స్ కొరియర్ సంస్థలోకి చోరబడి విచక్షణ రహితంగా కాల్పులు జరిపాడు.
ఈ మారణకాండలో 8 మంది అక్కడికక్కడే చనిపోగా, మరో ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు.
గాయపడిన వారిలో హర్‌ప్రీత్ గిల్ అనే భారతీయ యువతి ఉన్నారు.ఆమె కారులో కూర్చొని ఉండగా బ్రాడన్ కాల్పుల జరపడంతో ఆమె భుజంలోకి బుల్లెట్ దూసుకెళ్లింది.
ఇక్కడి ఫెడెక్స్ కార్యాలయంలో పనిచేసేవారిలో 90 శాతం భారతీయ సంతతి వారే.వీరిలో సిక్కులే ఎక్కువ సంఖ్యలో వున్నారు.
ఈ ఘటనపై అమెరికా అధ్యక్షుడు జోబైడెన్, ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
ఈ ఘటనలో మరణించిన భారతీయులలో ఒక్కొక్కరిది ఒక్కో దీనగాథ.పంజాబ్ నుంచి వలస వచ్చిన జస్వీందర్ సింగ్ (68) ఇటీవల ఫెడెక్స్‌లో ఉద్యోగం సంపాదించాడు.
ఈ నేపథ్యంలో తన తొలి పే చెక్‌ను వసూలు చేసుకోవడానికి గురువారం ఫెడెక్స్ కార్యాలయానికి వచ్చి ఉన్మాది కాల్పుల్లో మరణించాడు.
తన తోటీ పంజాబీ సహోద్యోగుల మాదిరిగానే జస్వీందర్ వేతనాన్ని డిపాజిట్ రూపంలో కాకుండా.
పే చెక్ రూపంలో తీసుకోవాలని భావించి తన ప్రాణాలను కోల్పోయారని అతని మేనల్లుడు ఆవేదన వ్యక్తం చేశారు.
ఇకనైనా వలసదారులకు ప్రభుత్వం రక్షణ కల్పించాలని.ఇది సిక్కు సమాజంపై జరిగిన దాడిగా ఆయన అభివర్ణించారు.
"""/"/
జస్వీందర్ పంజాబ్ నుంచి ఎనిమిదేళ్ల క్రితం అమెరికాలో సిక్కు సమాజం పెద్ద సంఖ్యలో స్థిరపడిన కాలిఫోర్నియాలోని ట్రేసీకి వలస వచ్చారు.
కొద్దిరోజుల తర్వాత ఆయన గ్రీన్‌వుడ్‌కు తన మకాం మార్చాడు.తన కుమారుడుతో పాటు 25 మంది బంధువులతో కలిసి అక్కడే స్థిరపడ్డారు.
మృతుడి కుమారుడు మాట్లాడుతూ.ఆయన మృతదేహానికి భారత్‌లోనే అంత్యక్రియలు నిర్వహిస్తామని చెప్పారు.
అయితే ప్రస్తుత కరోనా పరిస్థితుల కారణంగా మృతదేహాన్ని తరలించాలంటే ఎన్నో ఆంక్షలను అధిగమించాలి.
జస్వీందర్ రెండేళ్ల క్రితం చివరిసారిగా భారత్‌కు వెళ్లాడు.
టాలీవుడ్ లో నాని.. కోలీవుడ్ లో శివకార్తికేయన్.. కథల ఎంపికలో ఈ హీరోలు వేరే లెవెల్!