డల్లాస్ మ్యూజియం ఆఫ్ ఆర్ట్ బోర్డ్ చైర్‌గా భారత సంతతి మహిళ .. 119 ఏళ్ల చరిత్రను తిరగరాసిందిగా..!!

అమెరికాలోని ప్రఖ్యాత డల్లాస్ మ్యూజియం ఆఫ్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ ఇటీవల నిర్వహించిన ఎన్నికల్లో భారత సంతతికి చెందిన గౌరీ నటరాజన్ శర్మ చైర్‌గా ఎన్నికయ్యారు.

ఈ సంస్థ 119 సంవత్సరాల చరిత్రలో ఆ హోదాను పొందిన తొలి నల్లజాతి వ్యక్తి ఆమె.

ఇప్పటి వరకు ఈ పోస్ట్‌లో కేథరీన్ మార్కస్ రోజ్ వ్యవహరించారు.2022- 23 సంవత్సరానికి గాను ట్రస్టీల బోర్డులో గౌరీతో పాటు మరో భారతీయ అమెరికన్ వేణుగోపాల్ మీనన్ కూడా వున్నారు.

ఆయన బోర్డు కార్యదర్శిగా వ్యవహరిస్తారు.విభిన్న నేపథ్యాలు, అంతర్జాతీయ నాయకత్వ నైపుణ్యం , వ్యాపారం, సాంకేతికత, బిల్డింగ్ డిజైన్, సృజనాత్మక పరిశ్రమలలో విశిష్టతను సూచించేలా నలుగురు కొత్త అధికారులు, 12 మంది ఎన్నికైన ట్రస్టీలు బోర్టులో వున్నారు.

ఇకపోతే.2017 నుంచి డీఎంఏ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ సభ్యురాలిగా వ్యవహరిస్తున్నారు గౌరి.

గతంలో ఎగ్జిక్యూటివ్ కమిటీలో వైస్ ప్రెసిడెంట్‌గానూ పనిచేశారు.టామ్ లెంట్జ్‌తో కలిసి వ్యూహాత్మక ప్రణాళిక కమిటీకి కో చైర్‌గానూ వ్యవహరించారు.

అలాగే లెర్నింగ్ అండ్ ఎంగేజ్‌మెంట్ కమిటీకి అధ్యక్షత వహించారు.ఆమె ప్రస్తుతం బిల్డింగ్ అండ్ గ్రౌండ్స్ కమిటీలో పనిచేస్తున్నారు.

అలాగే డల్లాస్ ఆర్ట్ ఫెయిర్ ద్వారా సృష్టించబడిన డీఎంఏఏ అక్విజిషన్ ఫండ్‌లో సభ్యురాలుగానూ వున్నారు.

యునిసెఫ్ నార్త్ టెక్సాస్ అండ్ సెంట్రల్ ప్లెయిన్స్ రీజియన్ వ్యవస్థాపక బోర్డు, టెక్సాస్ ఉమెన్స్ ఫౌండేషన్ (టీఎక్స్‌డబ్ల్యూఎఫ్)లో ఆర్కిడ్ గివింగ్ సర్కిల్‌లో ఎగ్జిక్యూటివ్ మెంబర్‌గా శర్మ వ్యవహరిస్తున్నారు.

ఇకపోతే.గౌరీ శర్మ.

ఆర్కిటెక్చర్‌లో మాస్టర్స్ చేశారు.కుటుంబ వ్యాపారం కోసం ఆర్కిటెక్చరల్ అడ్వైజర్‌గా పనిచేస్తున్నారు.

"""/" / అటు వేణుగోపాల్ మీనన్ విషయానికి వస్తే.పీహెచ్‌డీ చేసిన ఆయన టెక్నాలజీ వైస్ ప్రెసిడెంట్‌గా 24 ఏళ్ల కెరీర్ తర్వాత 2019లో టెక్సాస్ ఇన్‌స్ట్రుమెంట్స్ నుంచి రిటైర్ అయ్యారు.

2009 నుంచి డీఎంఏ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్‌లో రకరకాల పాత్రలు పోషించారు.ఇందులో బడ్జెట్ అండ్ ఫైనాన్స్ కమిటీ మెంబర్‌గా, 2014 నుంచి 2015 వరకు కోశాధికారిగానూ పనిచేశారు.

ప్రస్తుతం ఎగ్జిక్యూటివ్ అండ్ ఇన్వెస్ట్‌మెంట్ కమిటీలలో పనిచేస్తున్నాడు.