వార్టన్ స్కూల్‌లో భారత సంతతి ఎగ్జిక్యూటివ్‌కు కీలకపదవి!
TeluguStop.com
వరల్డ్ క్లాస్ కంపెనీలకు, సంస్థలకు సారథులుగా రాణిస్తున్న భారతీయుల సంఖ్య నానాటికీ పెరుగుతున్న సంగతి తెలిసిందే.
అరవింద్ కృష్ణ, సుందర్ పిచాయ్, సత్యనాదెళ్ల, ఇంద్రానూయి, పరాగ్ అగర్వాల్ ( Arvind Krishna, Sundar Pichai, Satyanadella, Indranooi, Parag Agarwal )తదితరులు అమెరికన్ కంపెనీలకు సీఈవోలుగా వ్యవహరిస్తున్నారు.
ఇప్పుడు ఈ లిస్ట్‌లో మరో భారత సంతతి ఎగ్జిక్యూటివ్ చేరారు.అమెరికాలోని ప్రతిష్టాత్మక వార్టన్ స్కూల్ లీడర్‌షిప్ రోల్‌కు( Wharton School Leadership Role ) ఒక భారతీయ అమెరికన్ ఎగ్జిక్యూటివ్ ఎంపికయ్యారు.
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ , అనలిటిక్స్ రంగంలో అధ్యాపకులకు సలహాలు ఇవ్వడానికి, విద్యార్ధులకు మార్గదర్శకత్వం వహించడానికి ఆయన సిద్ధమయ్యారు.
జాన్సన్ అండ్ జాన్సన్‌లో గ్లోబల్ సర్వీసెస్ , స్ట్రాటజీ అండ్ బిజినెస్ సర్వీసెస్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ అజయ్ ఆనంద్.
వార్టన్ ఏఐ అండ్ అనలిటిక్స్ ఇనిషియేటివ్ (డబ్ల్యూఏఐఏఐ)లో రెసిడెన్స్ ఎగ్జిక్యూటివ్‌గా నియమితులయ్యారని సంస్థ ఒక ప్రకటనలో తెలిపింది.
"""/" /
వార్టన్ ఏఐ అండ్ అనలిటిక్స్ ఇనిషియేటివ్.వార్టన్ ఏఐ పరిశోధన, విద్యార్ధుల చొరవలలో నైపుణ్యాన్ని తీసుకురావడానికి ప్రత్యేకమైన ఎగ్జిక్యూటివ్ ఇన్ రెసిడెన్స్ ప్రోగ్రామ్‌ను ప్రారంభిస్తోందని పేర్కొంది.
ప్రతి ఏడాది అగ్రశ్రేణి సంస్థల నుంచి ఎంపిక చేయబడిన కార్యనిర్వాహకులు అధ్యాపకులు, విద్యార్ధులతో కలిసి పనిచేసి అత్యాధునిక ఏఐ పరిశోధన, వాస్తవ ప్రపంచ పరిశ్రమ సవాళ్ల మధ్య అంతరాన్ని తగ్గిస్తారు.
ఆనంద్, ది హెర్షే కంపెనీ డిజిటల్ అండ్ ఐటీ స్ట్రాటజీ ఈఆర్పీ సీనియర్ డైరెక్టర్ అచిమ్ వెల్టర్, రెసిడెన్స్‌లో ప్రారంభ కార్యనిర్వాహకులుగా ఎంపికయ్యారు.
"""/" /
రెసిడెన్స్ కార్యనిర్వాహకుడి హోదాలో పెన్సిల్వేనియా యూనివర్సిటీలోని వార్టన్ అధ్యాపకులకు ఆనంద్ సలహాలు ఇస్తారు.
వ్యాపార అవసరాలకు అనుగుణంగా ఏఐ పరిశోధనను రూపొందించడంలో సహాయపడతారు.విద్యార్ధులకు మార్గదర్శకులుగా ఉంటూ.
వార్టన్ ఏఐ అండ్ అనలిటిక్స్ యాక్సిలరేటర్ వంటి డబ్ల్యూఏఐఏఐ ప్రాజెక్ట్‌లలో భవిష్యత్ ఏఐ ఆవిష్కర్తలకు మార్గనిర్దశం చేస్తారు.
తన కొత్త బాధ్యతలపై ఆనంద్ హర్షం వ్యక్తం చేశారు.వార్టన్ ఏఐ అండ్ అనలిటిక్స్ ఇనిషియేటివ్‌లలో ఎగ్జిక్యూటివ్ ఇన్ రెసిడెన్స్‌లో చేరడం గౌరవంగా ఉందన్నారు.
ఏఐ అండ్ అనలిటిక్స్ పరివర్తన సామర్ధ్యాన్ని అన్వేషించడానికి వార్టన్ అధ్యాపకులు, విద్యార్ధులు, పరిశ్రమ నాయకులతో కలిసి పనిచేయడానికి ఉత్సాహంగా ఉన్నానని ఆనంద్ తెలిపారు.