ఇండియన్ అమెరికన్ ఇంజనీర్‌కు ప్రతిష్టాత్మక ‘‘గ్లోబల్ ఎనర్జీ ప్రైజ్’’..!!
TeluguStop.com
హ్యూస్టన్ యూనివర్సిటీలో భారత సంతతికి చెందిన ఇంజినీరింగ్ ప్రొఫెసర్ కౌశిక్ రాజశేఖర ప్రతిష్టాత్మక గ్లోబల్ ఎనర్జీ బహుమతిని గెలుచుకున్నారు.
విద్యుత్ ఉత్పాదక ఉద్గారాలను తగ్గించడంతో పాటు ట్రాన్స్‌పోర్టేషన్ ఎలక్ట్రిఫికేషన్ , సాంకేతికతలకు అత్యుత్తమ సహకారం అందించినందుకు ఆయనను ఈ అవార్డుకు ఎంపిక చేశారు.
గ్లోబల్ ఎనర్జీ అసోసియేషన్ అందించే ఈ గౌరవానికి ప్రపంచంలోని ముగ్గురు వ్యక్తులు మాత్రమే ఈ ఏడాది ఎంపికయ్యారు.
43 దేశాల నుంచి రికార్డు స్థాయిలో 119 నామినేషన్లు వచ్చాయి.ఈ ఏడాది అక్టోబర్ 12-14 తేదీలలో మాస్కోలో రష్యన్ ఎనర్జీ వీక్ సందర్భంగా అవార్డు ప్రదానోత్సవం జరుగుతుంది.
ఎలక్ట్రిక్, హైబ్రిడ్, ఫ్యూయెల్ సెల్ వాహనాల కోసం పవర్ ప్లాంట్ పనుల్లో రాజశేఖర నిమగ్నమై వున్నారు.
ఆయన పేరిట 36 అమెరికా పేటెంట్లు, 15 విదేశీ పేటెంట్లు వున్నాయి.దక్షిణ భారతదేశంలోని ఒక మారుమూల గ్రామంలో ఒక చిన్న గదిలో రాజశేఖర పెరిగారు.
అతని తల్లిదండ్రులు ఎవ్వరూ చదువుకోకపోయినప్పటికీ.అతని తల్లి మాత్రం తన పిల్లలు బాగా చదువుకోవాలని ఆశించారు.
బెంగళూరులోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ నుంచి ఇంజనీరింగ్‌లో బ్యాచిలర్ , మాస్టర్, పీహెచ్‌డీ పట్టాలను పొందారు.
1977- 84 మధ్యకాలంలో ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్‌లో అసిస్టెంట్ ప్రొఫెసర్, సీనియర్ సైంటిఫిక్ ఆఫీసర్‌గా రాజశేఖర పనిచేశారు.
"""/" /
అనంతరం 1992లో అమెరికాలోని ఇండియానా వెస్లియన్ యూనివర్సిటీ నుంచి ఎంబీఏ పట్టా అందుకున్నారు.
ఏబీబీలో రైలు రవాణా విభాగంలో కెరీర్ ప్రారంభించిన ఆయన.జనరల్ మోటార్స్, డెల్ఫీలో ఎలక్ట్రిక్ అండ్ హైబ్రిడ్ వాహనాలు, అనంతరం రోల్స్ రాయిస్‌లో ఎయిర్‌క్రాఫ్ట్ విద్యుదీకరణపై పనిచేశారు.
కెరీర్‌లో ఎన్నో అవార్డులు, రివార్డులు గెలుచుకున్నప్పటికీ.గ్లోబల్ ఎనర్జీ పురస్కారం రావడంతో రాజశేఖర షాక్ అయ్యారు.
ఈ అవార్డ్ ఖచ్చితంగా ఇంధన సామర్ధ్యాన్ని మెరుగుపరచడం, ఉద్గారాలను తగ్గించడం వంటి వాటిపై ప్రభావాన్ని చూపుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.
ఇంటర్నేషనల్ జర్నల్స్, కాన్ఫరెన్స్ ప్రొసీడింగ్స్‌లో 250కి పైగా కథనాలను ఆయన ప్రచురించారు.ఐఈఈఈ ప్రెస్‌తో కలిసి ఒక పుస్తకంతో పాటు ఎనిమిది పుస్తకాలు, ఆరు మోనోగ్రాఫ్‌లు రచించారు.
చిరంజీవి లైనప్ పెరిగిపోయిందా..? బాబీ కి మళ్ళీ ఛాన్స్ ఇచ్చాడా..?