యూఎస్: ప్రతినిధుల సభలో భారతీయ జైన కవి శ్రీమద్ రాజ్‌చంద్రాజీ ప్రస్తావన

భారతీయ అమెరికన్ కాంగ్రెస్ సభ్యుడు రాజా కృష్ణమూర్తి.యూఎస్ ప్రతినిధుల సభలో ప్రముఖ జైన కవి, పండితుడు, మత నాయకుడు, తత్వవేత్త శ్రీమద్ రాజచంద్రాజీ జీవితాన్ని ఆవిష్కరించారు.

బుధవారం ప్రతినిధుల సభలో కృష్ణమూర్తి మాట్లాడుతూ రాజచంద్రాజీ రచనలను వివరించారు.1867లో భారతదేశ పశ్చిమ తీరంలోని ప్రముఖ రేవుపట్టణమైన గుజరాత్‌లోని వవనీయాలో జన్మించిన రాజచంద్రాజీ చిన్న వయసులోనే మతపరమైన జీవితానికి ఆకర్షితులయ్యారు.

అహింసకు పెద్ద పీట వేసే జైనమతంలోని నైతిక సూత్రం పట్ల రాజచంద్రాజీ మక్కువ పెంచుకున్నారని రాజా కృష్ణమూర్తి తెలిపారు.

రాజచంద్రాజీ గొప్ప ఆధ్యాత్మిక శిఖరాలను అధిరోహించారని.సమకాలీన సామాజిక వాతావరణానికి సంబంధించి అప్రయత్నంగా స్వీయ ఆవిష్కరణ మార్గాన్ని చూపారని ఆయన ప్రశంసించారు.

34 ఏళ్లే జీవించిన రాజచంద్రాజీ ప్రపంచానికి గొప్ప వారసత్వాన్ని అందించారని రాజా కృష్ణమూర్తి తెలిపారు.

ఇది తరతరాల అన్వేషకులకు మార్గనిర్దేశనం చేస్తుందన్నారు.ఆయన జీవితం, రచనలను సంకలనం చేయబడ్డాయని.

శ్రీమద్ రాజ్‌చంద్ర అనే శీర్షికతో ప్రచురించబడ్డాయని రాజా కృష్ణమూర్తి తెలిపారు.ఆందులోని విషయాలు జీవితంలోని శాశ్వతమైన సత్యాలను వెలికితీసేందుకు ప్రేరణగా వుంటాయని ఆయన చెప్పారు.

"""/"/ తన ఆధ్యాత్మిక, తాత్విక రచనలలో రాజచంద్రాజీ మహిళల విద్య యొక్క ప్రాముఖ్యత గురించి వివరించారు.

ఆధ్యాత్మిక, జైన మత విశ్వాసాలపై ఆయన ఎన్నో వ్యాఖ్యానాలను రచించారు.1891లో రాజచంద్రాజీకి గాంధీ అనే యువ న్యాయవాది పరిచయమయ్యారు.

ఇది ఆధునిక భారతదేశ భవిష్యత్తుకు, మార్గదర్శకత్వానికి దారి తీసిందని రాజా కృష్ణమూర్తి తెలిపారు.

ఈ మేరకు మహాత్మా గాంధీ తన ఆత్మకథలో ‘‘నా ఆధ్యాత్మిక సంక్షోభంలో శ్రీమద్ జీ నాకు ఆశ్రయం ’’ అని పేర్కొంటూ తన ఆధ్యాత్మిక గురువుకు నివాళి ఆర్పించిన విషయాన్ని రాజా కృష్ణమూర్తి ప్రస్తావించారు.

విడుదలైన మూడు వారాలకే ఓటీటీలో ఫ్యామిలీ స్టార్.. భారీ నష్టాలు రావడమే కారణమా?