వైద్య రంగంలో కృషి.. ఇండో అమెరికన్ కాంగ్రెస్ సభ్యుడు అమీబెరాకు ప్రతిష్టాత్మక అవార్డ్..!!
TeluguStop.com
భారత సంతతికి చెందిన అమెరికన్ రాజకీయ వేత్త, యూఎస్ కాంగ్రెస్ సభ్యుడు డాక్టర్ అమీబెరా( Dr.
Amibera ) ప్రతిష్టాత్మక ‘‘ఛాంపియన్ ఆఫ్ హెల్త్‌కేర్ ఇన్నోవేషన్ అవార్డు’’( Champion Of Healthcare Innovation Award )ను అందుకున్నారు.
అమెరికాలో నాణ్యమైన వైద్యాన్ని అందబాటులోకి తీసుకొచ్చేందుకు చేసిన కృషికి గాను ఆయనకు ఈ అవార్డ్ ప్రదానం చేశారు.
58 ఏళ్ల అమీబెరా.యూఎస్ కాంగ్రెస్‌లో ఎక్కువ కాలం పనిచేసిన భారతీయ అమెరికన్‌గా నిలిచిన సంగతి తెలిసిందే.
గత వారం వాషింగ్టన్‌లో జరిగిన కౌన్సిల్ ఇన్నోవేషన్ ఎక్స్‌పోలో ఆయన అవార్డు అందుకున్నారు.
దీనిపై డాక్టర్ అమీబెరా స్పందిస్తూ ఒక వైద్యుడిగా ప్రతి అమెరికన్‌కు అధిక నాణ్యత, మంచి హెల్త్ కేర్ వుండేలా కృషి చేయడానికి కట్టుబడి వున్నానని అన్నారు.
"""/" /
బెరా 2013లో యూఎస్ కాంగ్రెస్ సభ్యుడిగా ప్రమాణ స్వీకారం చేయడానికి ముందు కాలిఫోర్నియాలోని శాక్రమెంటో కౌంటీకి చీఫ్ మెడికల్ ఆఫీసర్‌గా( Chief Medical Officer For Sacramento County, California ) విధులు నిర్వర్తించారు.
నాటి నుంచి నేటి వరకు యూఎస్ హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్‌లో శాక్రమెంటో కౌంటీకి ప్రాతినిథ్యం వహిస్తున్నారు.
ఆయన ప్రస్తుతం హౌస్ ఫారిన్ అఫైర్స్ కమిటీలో సభ్యుడు.అలాగే ఆసియా, పసిఫిక్, సెంట్రల్ ఏషియా అండ్ నాన్‌ప్రొలిఫరేషన్‌పై సబ్ కమిటీకి ఛైర్మన్‌గాను వున్నారు.
ఇంటెలిజెన్స్‌పై హౌస్ పర్మనెంట్ సెలెక్ట్ కమిటీ సభ్యుడిగానూ, కోవిడ్ మహమ్మారిపై సెలెక్ట్ సబ్ కమిటీలో సభ్యుడిగానే అమీబెరా సేవలందిస్తున్నారు.
"""/" /
తన 20 ఏళ్ల వైద్య వృత్తిలో బెరా ఆరోగ్య సంరక్షణ లభ్యత, నాణ్యత మెరుగుపరచడానికి ఆయన కృషి చేశారు.
కాలిఫోర్నియాలో పుట్టి పెరిగిన తొలి తరం అమెరికన్ అయిన డాక్టర్ అమీబెరా.కాలిఫోర్నియా యూనివర్సిటీ నుంచి బ్యాచిలర్ ఆఫ్ సైన్స్, డాక్టర్ ఆఫ్ మెడిసిన్ పట్టాలు అందుకున్నారు.
యూఎస్ చట్టసభకు ఎన్నికైన మూడవ ఇండో అమెరికన్‌గానూ అమీబెరా చరిత్ర సృష్టించారు.అంతకుముందు బాబీ జిందాల్, దలిప్ సింగ్ సంధూలు ఎన్నికయ్యారు.
మోచేతులు, మోకాళ్లు తెల్లగా మెరిసిపోవాలా.. అయితే ఇలా చేయండి!