భారత సంతతి శాస్త్రవేత్తకు అత్యున్నత పదవిని కట్టబెట్టిన ట్రంప్

అమెరికాలో భారత సంతతి శాస్త్రవేత్తకు అరుదైన గౌరవం దక్కింది.ప్రతిష్టాత్మక నేషనల్ సైన్స్ ఫౌండేషన్‌కు నాయకత్వం వహించేందుకు గాను కంప్యూటర్ శాస్త్రవేత్త సేతరామన్ పంచనాథన్‌ను అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఎంపిక చేశారు.

నేషనల్ సైన్స్ ఫౌండేషన్ (ఎన్ఎస్ఎఫ్) అనేది యూఎస్ ప్రభుత్వ రంగ సంస్థ, ఇది సైన్స్ మరియు ఇంజనీరింగ్‌‌, వైద్యేతర రంగాలలో ప్రాథమిక పరిశోధన, విద్యకు మద్ధతు ఇస్తుంది.

వైద్య రంగంలో పరిశోధనకు గాను దీని అనుబంధ సంస్థ నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ (ఎన్ఐహెచ్) సహాయ సహకారాలు అందజేస్తుంది.

ప్రస్తుతం ఎన్ఎస్ఎఫ్ డైరెక్టర్‌గా ఉన్న ఫ్రాన్స్ కార్డోవా ఆరేళ్ల పదవీకాలం 2020లో ముగియనుంది.

ఆ తర్వాత ఆయన స్థానంలో పంచనాథన్ బాధ్యతలు స్వీకరిస్తారు.పంచనాథన్ ప్రస్తుతం అరిజోనా స్టేట్ యూనివర్సిటీ(ఏఎస్‌యూ)లో ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్‌, చీఫ్ రీసెర్చ్ అండ్ ఇన్నోవేషన్ ఆఫీసర్‌గా వ్యవహరిస్తున్నారు.

అంతేకాకండా తన సుదీర్ఘ ప్రస్థానంలో ఆయన ఎన్నో పదవులు నిర్వహించారు.ఏఎస్‌యూలో సెంటర్ ఫర్ కాగ్నిటివ్ యుబిక్విటస్ కంప్యూటింగ్ వ్యవస్థాపక డైరెక్టర్.

అంతేకాకుండా 2014లో నేషనల్ సైన్స్ బోర్డ్(ఎన్ఎస్‌బీ)లో నియమితులైన ఆయన స్ట్రాటజీ కమిటీకి ఛైర్మన్‌గా పనిచేశారు.

ఇన్నోవేషన్ అండ్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్‌పై జాతీయ సలహా మండలి సభ్యుడిగా కూడా పనిచేశారు. """/" / ఇవే కాకుండా నేషనల్ అకాడమీ ఆఫ్ ఇన్వెంటర్స్ (ఎన్ఐఐ) యొక్క స్ట్రాటజిక్ ఇనిషియేటవ్స్ వైస్ ప్రెసిడెంట్‌గా.

కౌన్సిల్ ఆన్ రీసెర్చ్ ఆఫ్ అసోసియేషన్ ఆఫ్ పబ్లిక్ అండ్ ల్యాండ్-గ్రాంట్ విశ్వవిద్యాలయాల ఛైర్మన్‌గా, గ్లోబల్ ఫెడరేషన్ ఆఫ్ కాంపిటీటీవ్‌నెస్ కౌన్సిల్స్‌లో ఎక్స్‌ట్రీమ్ ఇన్నోవేషన్ టాస్క్‌ఫోర్స్ కో ఛైర్మన్‌గానూ వ్యవహరించారు.

పంచనాథన్ 1981లో మద్రాస్ యూనివర్సిటీ నుంచి భౌతిక శాస్త్రంలో డిగ్రీ పట్టాను పొందారు.

1984లో బెంగళూరులోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ (ఐఐఎస్సీ) నుంచి ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్‌లో బ్యాచిలర్ డిగ్రీని పొందారు.

1986లో ఇండియన్ ఇన్‌‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (మద్రాస్) నుంచి ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్‌లో మాస్టర్ డిగ్రీని, 1989లో కెనడాలోని ఒట్టావా యూనివర్సిటీ నుంచి ఎలక్ట్రికల్ అండ్ కంప్యూటర్ ఇంజనీరింగ్‌లో పీహెచ్‌డీ పొందారు.

చైనా దురాగతం.. మాలిలో బంగారు గని కూలి 43 మంది మహిళా కూలీలు దుర్మరణం!