Professor Ashok Veeraraghavan : అమెరికాలో భారత సంతతి ఇంజినీర్‌కు ప్రతిష్టాత్మక అవార్డ్

అమెరికాలో భారత సంతతికి చెందిన కంప్యూటర్ ఇంజనీర్, ప్రొఫెసర్‌కు అరుదైన గౌరవం దక్కింది.

ప్రొఫెసర్ అశోక్ వీరరాఘవన్‌ను( Professor Ashok Veeraraghavan ) టెక్సాస్ రాష్ట్ర అత్యున్నత అకడమిక్ అవార్డ్ ‘‘ఎడిత్ అండ్ పీటర్ ఓడన్నెల్’’( Edith And Peter O'Donnell Award ) పురస్కారం వరించింది.

ఇంజనీరింగ్ విభాగంలో ‘‘ఇమేజింగ్ టెక్నాలజీ’’లో( Imaging Technology ) చేసిన పరిశోధనలకు గాను ఈ గౌరవం ఆయనకు దక్కింది.

రాష్ట్రంలోని మెడిసిన్, ఇంజనీరింగ్, బయోలాజికల్ సైన్సెస్, ఫిజికల్ సైన్సెస్, టెక్నాలజీ ఇన్నోవేషన్‌ సహా ఆయా రంగాల్లో విశేష సేవలు , ప్రతిభ చూపిన వారికి ఈ అవార్డ్ అందజేస్తూ వుంటారు.

‘‘టెక్సాస్ అకాడమీ ఆఫ్ మెడిసిన్, ఇంజినీరింగ్, సైన్స్ టెక్నాలజీ ’’ ఈ అవార్డును ప్రధానం చేస్తుంది.

"""/" / వీర రాఘవన్ భారత్‌లోని తమిళనాడు రాజధాని చెన్నైలో( Chennai ) పుట్టి పెరిగారు.

ఈ సందర్భంగా ఆయన పీటీఐ వార్తాసంస్థతో మాట్లాడుతూ.ఈ అవార్డును అందుకోవడం తనకు చాలా ఆనందంగా వుందన్నారు.

రైస్ యూనివర్సిటీలోని కంప్యుటేషనల్ ఇమేజింగ్ ల్యాబ్‌లో ఎంతో మంది విద్యార్ధులు, పోస్ట్‌డాక్స్, పరిశోధనా శాస్త్రవేత్తలు గణనలో చేసిన అద్భుతమైన , వినూత్న పరిశోధనలకు దక్కిన గుర్తింపుగా వీరరాఘవన్ తెలిపారు.

ప్రస్తుతం వీరరాఘవన్ రైస్ యూనివర్సిటీకి( Rice University ) చెందిన జార్జ్ ఆర్ బ్రౌన్ స్కూల్ ఆఫ్ ఇంజనీరింగ్‌లో ఎలక్ట్రికల్ అండ్ కంప్యూటర్ ఇంజనీరింగ్ విభాగంలో ప్రొఫెసర్‌గా పనిచేస్తున్నారు.

"""/" / వీరరాఘవన్ బృందం ఇమేజింగ్ టెక్నాలజీలో పలు విప్లవాత్మక పరిశోధనలు చేస్తోంది.

ఆప్టిక్స్ నుంచి సెన్సార్ డిజైన్ వరకు మెషిన్ ఆల్గొరిథమ్ టెక్నాలజీతో ఇమేజింగ్ రంగంలో రాఘవన్ టీమ్ పలు సవాళ్లను అధిగమించింది.

ఈ అంశాలన్నింటిపై సమీకృత విధానంలో పరిశోధనలు చేస్తున్నామని ప్రొఫెసర్ వీరరాఘవన్ పేర్కొన్నారు.ప్రస్తుతం అందుబాటులో వున్న ఇమేజింగ్ సాంకేతికతతో చూడటం సాధ్యం కాని వాటిని కనిపించేలా చేయడమే తమ లక్ష్యమని ఆయన వెల్లడించారు.

వీర రాఘవన్‌కు అవార్డ్ దక్కడం పట్ల అమెరికాలోని భారత సంతతి, భారతీయ కమ్యూనిటీ హర్షం వ్యక్తం చేసింది.

ఫుడ్ వెండర్ సమాధానానికి ఆనంద్ మహీంద్రా ఫిదా.. వీడియో వైరల్