ప్రాణవాయువుకు కటకట: భారత్‌లోని హాస్పిటల్స్‌కు ఎన్ఆర్ఐ వ్యాపారవేత్త ఆపన్న హస్తం

కరోనా సెకండ్ వేవ్‌తో భారతదేశం చివురుటాకులా వణికిపోతోంది.వైరస్ లక్షణాలతో రోగులు ఆసుపత్రులకు క్యూకడుతున్నారు.

వీరిలో అత్యవసర చికిత్స అవసరమైన వారికి బెడ్లు దొరక్క అంబులెన్స్‌లు, ఫుట్‌పాత్‌లు, చెట్ల కిందే చికిత్స అందిస్తున్నారు.

కొందరైతే హాస్పిటల్స్ మెట్ల మీదే కుప్పకూలుతున్నారు.దేశంలోని ఏ మూల చూసినా ఇవే హృదయ విదారక ఘటనలు కనిపిస్తున్నాయి.

తమ వారు చనిపోయేలా వున్నారని.ఆసుపత్రిలో చేర్చుకోవాలంటూ రోగుల బంధువులు చేస్తున్న అభ్యర్ధనలు కంటతడి పెట్టిస్తున్నాయి.

కిష్ట పరిస్ధితుల్లో ప్రపంచానికి అండగా నిలిచిన భారతదేశాన్ని ఆదుకునేందుకు ఆయా దేశాలు ముందుకొస్తున్నాయి.

ఈ నేపథ్యంలో ఎన్ఆర్ఐలు సైతం జన్మభూమికి తమ వంతు సాయం చేయాలని నిర్ణయించుకున్నారు.

ఆక్సిజన్ కొరతతో ఇబ్బందులు పడుతున్న మనదేశంలోని ఆసుపత్రులకు బాసటగా నిలిచారు భారత సంతతికి చెందిన అమెరికన్ బిలియనీర్ వినోద్ ఖోస్లా.

ఆక్సిజన్‌ను దిగుమతి చేసుకోవడానికి వనరులు అసవరమయ్యే భారతీయ ఆసుపత్రులకు తాను నిధులు సమకూరుస్తానని వినోద్ ఖోస్లా ప్రకటించారు.

ఈ మేరకు ఆయన శనివారం ట్వీట్ చేశారు.సాయం కావాల్సిన ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థలు ప్రధానమంత్రి కార్యాలయం ద్వారా సంప్రదించాలని ఆయన సూచించారు.

అనంతరం మరో ట్వీట్‌లో భారత్‌కు ఆస్ట్రాజెనెకా వ్యాక్సిన్‌ డోసులను పంపించాలని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌కు ఖోస్లా విజ్ఞప్తి చేశారు.

అమెరికన్ల అవసరాలను మోడెర్నా, ఫైజర్‌లు తీర్చగలవని.అందువల్ల ఆస్ట్రాజెనెకా వ్యాక్సి‌న్‌లను భారత్ సహా అవసరమైన దేశాలకు పంపిణీ చేయాలని వినోద్ ఖోస్లా కోరారు.

అంతకుముందు యూఎస్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ సైతం ఆస్ట్రాజెనెకా వ్యాక్సిన్‌లను భారత్, బ్రెజిల్ సహా కరోనా మహమ్మారితో అల్లాడుతున్న దేశాలకు విడుదల చేయాలని బైడెన్‌ను కోరింది.

ఖోస్లా ప్రకటనపై ఇండో అమెరికన్ కాంగ్రెస్ సభ్యుడు రో ఖన్నా అభినందించారు.భారత్‌లో ఆక్సిజన్ అవసరమైన ఆసుపత్రులు ఖోస్లాను సంప్రదించాలని కోరారు.

అంతకుముందు ఖోస్లా కుమారుడు నీల్ ఖోస్లా.బైడెన్ పరిపాలనా యంత్రాంగంపై మండిపడ్డారు.

ప్రస్తుతం కరోనా సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న భారతదేశానికి అమెరికా సాయం చేయడం లేదంటూ ఆయన విమర్శించారు.

ఇదే సమయంలో భారత ప్రభుత్వంపైనా నీల్ ఖోస్లా విమర్శలు గుప్పించారు.నిజానికి తొలుత విఫలమైంది భారత ప్రభుత్వమేనని.

కానీ అమెరికా కూడా తగిన విధంగా స్పందించాలని ఆయన అభిప్రాయపడ్డారు.భారత ప్రభుత్వ వైఫల్యాలకు భారతీయులకు ఎందుకు మరణశిక్ష విధించాలని నీల్ ఖోస్లా ప్రశ్నించారు.

"""/"/ ఢిల్లీకి చెందిన వినోద్ ఖోస్లా.సిలికాన్ వ్యాలీలో వెంచర్ క్యాపిటల్ సంస్థ ఖోస్లా వెంచర్‌ను స్థాపించారు.

వ్యాపారంలో దూసుకుపోతున్న ఆయన ఫోర్బ్స్ ఇండో అమెరికన్ బిలియనీర్‌ల జాబితాలో ఏడో స్థానంలో నిలిచారు.

ఆయన ఆస్తుల విలువ 2.9 బిలియన్ డార్లు.

బయోమెడిసిన్, రోబోటిక్స్ వంటి సాంకేతికతల అభివృద్ధిలో ఖోస్లా వెంచర్స్ పెట్టుబడులు పెడుతోంది.

బహామాస్‌లో గ్యాంగ్ వార్లు, షార్క్ ఎటాక్స్‌.. అమెరికా టూరిస్టులకు వార్నింగ్!