నాసా స్పేస్‌ఎక్స్ క్రూ -3 మిషన్‌: తొలి రోదసి యాత్రకు సిద్ధమైన భారత సంతతి వ్యోమగామి రాజాచారి

భారతీయ అమెరికన్ వ్యోమగామి రాజా చారి తన మొదటి అంతరిక్ష ప్రయాణానికి సిద్ధమయ్యారు.

ఈ నెలాఖారులో అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి నలుగురు వ్యోమగాములను తీసుకెళ్లడానికి నాసా స్పేస్ ఎక్స్ 3 మిషన్‌ను సిద్ధం చేస్తోంది.

ఈ క్రూ డ్రాగన్ స్పేస్ క్రాఫ్ట్‌కు రాజా చారి మిషన్ కమాండర్‌గా వ్యవహరిస్తారని సానా తెలిపింది.

చారికి తోడుగా టామ్ మార్ష్‌బర్న్న, కైలా బారన్, యూరోపియన్ స్పేస్ ఏజెన్సీకి చెందిన మాథియస్ మౌరర్‌లు ఈ మిషన్‌లో పాలుపంచుకుంటారని నాసా వెల్లడించింది.

ఫాల్కన్ 9 రాకెట్‌లోని క్రూ డ్రాగన్ స్పేస్ క్రాఫ్ట్‌‌ను అక్టోబర్ 30 శనివారం ఫ్లోరిడాలోని కెన్నడీ స్పేస్ సెంటర్‌లోని లాంచ్ కాంప్లెక్స్ 39ఏ నుంచి ప్రయోగిస్తామని నాసా తెలిపింది.

స్పేస్ ఎక్స్ క్రూ 3 మిషన్ పనితీరుతో పాటు ఐఎస్ఎస్ సిబ్బంది భ్రమణంపై వివరాలు తెలియజేసేందుకు నాసా బుధవారం మీడియా సమావేశం ఏర్పాటు చేసింది.

ప్రయోగానికి సిద్ధం కావడానికి ముందు వ్యోమగాములు, సిబ్బందితో మాట్లాడేందుకు ఇదే చివరి అవకాశమని నాసా మీడియాకు తెలిపింది.

H3 Class=subheader-styleఎవరీ రాజాచారి:/h3p ""img Src="https://telugustop!--com/wp-content/uploads/2021/10/Indian-American-Raja-Chari-To-Be-on-SpaceX’s-Crew-3-Mission!--jpg"/ మ‌సాచుసెట్స్ ఇన్స్‌టిట్యూట్ ఆఫ్ టెక్నాల‌జీ(ఎంఐటీ) ఎయిర్ ఫోర్స్ అకాడ‌మీలో రాజా చారి శిక్ష‌ణ పొందారు.

యూఎస్ నావల్‌ టెస్ట్ పైల‌ట్ స్కూల్‌లో శిక్ష‌ణ పొందిన ఏకైక భార‌త సంతతి వ్య‌క్తి కూడా ఈయ‌నే కావ‌డం విశేషం.

ఆస్ట్రోనాట్ క్యాండిడేట్ క్లాసుల కోసం నాసా అత‌న్ని 2017లో ఎంపిక చేసింది.కఠిన శిక్షణను పూర్తి చేసుకున్న రాజాచారి మూన్‌ మిష‌న్‌కు కూడా అర్హ‌త సాధించిన‌ట్లు గతంలోనే నాసా ప్రకటించిన సంగతి తెలిసిందే.

నాసా 2024లో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘ఆర్టెమిస్ ప్రాజెక్ట్‌’కు ఎంపికైన వ్యోమ‌గాముల్లో ఆయన కూడా ఒకరు.

మిల్వాకీలో జన్మించిన రాజాచారి తండ్రి భారతీయుడు కాగా, తల్లి అమెరికన్.ఆయన బాల్యం తల్లి స్వగ్రామం అయోవాలోని సెడార్ ఫాల్స్‌లోనే గడిచింది.

యూఎస్ ఎయిర్‌ఫోర్స్‌లో కల్నల్ స్థాయికి చేరిన రాజా చారికి టెస్ట్ పైలట్‌గా విశేషమైన అనుభవం వుంది.

ఎఫ్ 35, ఎఫ్ 15, ఎఫ్ 16, ఎఫ్ 18లో 2,500 గంటల పాటు విమానయానం చేసిన అనుభవం ఆయన సొంతం.

ఇరాక్ యుద్ధంతో పాటు కొరియా ద్వీపకల్పంలోనూ రాజాచారి అమెరికా వాయుసేన తరపున సేవలందించారు.

మసాచుసెట్స్‌లోని కేంబ్రిడ్జ్‌లో మసాచుసెట్స్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ నుంచి ఏరోనాటిక్స్, ఆస్ట్రోనాటిక్స్‌లో మాస్టర్ డిగ్రీ పొందారు.

అనంతరం మేరీల్యాండ్‌లోని పటుక్సెంట్ నదిలో యూఎస్ నావల్ టెస్ట్ పైలట్ స్కూల్, కాన్సాస్‌లోని ఫోర్ట్ లీవెన్‌వర్త్‌లోని యూఎస్ ఆర్మీ కమాండ్, జనరల్ స్టాఫ్ కాలేజీలోనూ శిక్షణ పూర్తి చేసుకున్నారు.

నేను చేయను.. నీకేమైనా ఇబ్బందా.. నెటిజన్ కు హీరోయిన్ షాకింగ్ కౌంటర్ వైరల్!