అమెరికా : పర్డ్యూ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ డీన్‌గా భారతీయుడు
TeluguStop.com
భారత సంతతికి చెందిన అరవింద్ రామన్ పర్డ్యూ యూనివర్సిటీ అనుబంధ కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్ కొత్త డీన్‌గా నియమితులయ్యారు.
ఇప్పటి వరకు ఈ పదవిలో మార్క్ లండ్‌స్ట్రోమ్ వ్యవహరించారు.రామన్ పర్డ్యూ యూనివర్సిటీలో అడ్మినిస్ట్రేటర్‌గా, ఫ్యాకల్టీ మెంబర్‌గా కొనసాగుతున్నాడు.
ఐఐటీ ఢిల్లీలో చదువుకున్న ఆయన.పర్డ్యూలో ఎగ్జిక్యూటివ్ అసోసియేట్ డీన్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ రాబర్ట్ వీ ఆడమ్స్ మెకానిక్ ఇంజనీరింగ్‌లో ప్రొఫెసర్.
రామన్ తన ప్రస్తుత పాత్రలో అధ్యాపకులను రిక్రూట్ చేసుకోవడం, ఫ్యాకల్టీ, స్టాఫ్‌ల ప్రోగ్రామ్‌లను నిర్దేశించడం వంటి కార్యకలాపాలకు నేతృత్వం వహిస్తున్నారు.
2008-12 నుంచి పర్డ్యూ యూనివర్సిటీ ఫ్యాకల్టీ స్కాలర్‌గా, 2012లో అమెరికన్ సొసైటీ ఆఫ్ మెకానికల్ ఇంజనీర్స్‌లో ఫెలోగా రామన్ ఎంపికయ్యారు.
దీనితో పాటు మెటీరియల్ ఇంజనీరింగ్‌లో కర్టెసీ ప్రొఫెసర్ హోదాలోనూ వున్నారు. """/"/
ఆయన బర్కిలీలోని కాలిఫోర్నియా విశ్వవిద్యాలయం నుంచి మెకానికల్ ఇంజనీరింగ్‌లో పీహెచ్‌డీ చేశారు.
అనంతరం పర్డ్యూ యూనివర్సిటీ నుంచి మెకానికల్ ఇంజనీరింగ్‌లో మాస్టర్స్ డిగ్రీ చేశారు.నాన్ లీనియర్ డైనమిక్స్, అటామిక్ ఫోర్స్ మైక్రోస్కోపీ, హ్యూమన్ బయో మెకానిక్ అండ్ రోల్ టు రోల్ ఫ్లెక్సిబుల్ ఎలక్ట్రానిక్స్ తయారీపై రామన్ పరిశోధనలు చేశారు.
యూఎస్ న్యూస్ అండ్ వరల్డ్ రిపోర్ట్ కాలేజీ ర్యాంకింగ్‌ల ప్రకారం.పర్డ్యూ అండర్ గ్రాడ్యుయేట్, గ్రాడ్యుయేట్ ఇంజనీరింగ్ ప్రోగ్రామ్‌లు దేశంలో టాప్ 10, టాప్ 5లో వున్నాయి.
పర్డ్యూ అండర్ గ్రాడ్యుయేట్లలో దాదాపు 30 శాతం మంది ఇంజనీరింగ్ కళాశాలల్లోనే చేరారు.
"""/"/
ఇకపోతే.డీన్‌గా తన నియామకంపై రామన్ స్పందించారు.
రాష్ట్రం, దేశం, ప్రపంచాన్ని ప్రభావితం చేసే కార్యక్రమాలను కొనసాగిస్తామని ఆయన వాగ్థానం చేశారు.
అద్బుతమైన వారసత్వం, ప్రపంచస్థాయి ఆవిష్కరణలలో రికార్డు కలిగి, దేశంలోనే టాప్ ర్యాంక్ ఇంజనీరింగ్ కళాశాలకు నాయకత్వం వహించే అవకాశం రావడం తనకు దక్కిన గౌరవమని రామన్ ఓ ప్రకటనలో తెలిపారు.
బరువు తగ్గాలని భావించేవారు కచ్చితంగా తెలుసుకోవాల్సిన విషయాలు ఇవే..!