అమెరికాలో చరిత్ర సృష్టించిన భారత సంతతి మహిళ.. ‘హార్వర్డ్‌ లా రివ్యూ’లో కీలక పదవి

అమెరికాలో భారత సంతతికి చెందిన మహిళ చరిత్ర సృష్టించింది.ప్రతిష్టాత్మక హార్వర్డ్ లా రివ్యూ అధ్యక్షురాలిగా ఇండో అమెరికన్ అప్సరా అయ్యర్ ఎన్నికయ్యారు.

ఈ సంస్థ 136 సంవత్సరాల చరిత్రలో అధ్యక్షురాలిగా ఎన్నికైన తొలి భారత సంతతి మహిళగా అప్సర రికార్డుల్లోకెక్కారు.

2018 నుంచి ఆర్ట్ క్రైమ్‌తో పాటు స్వదేశానికి తిరిగి వచ్చే వారి గురించి ఆమె పరిశోధిస్తున్నారు.

ఇప్పటి వరకు ఈ పదవిలో ప్రిస్కిలా కొరోనాడో వున్నారు.యేల్ యూనివర్సిటీ నుంచి 2016లో ఆర్ధికశాస్త్రం, గణితం, స్పానిష్‌లలో బీఏ పట్టా అందుకున్నారు అప్సర.

క్లారెండన్ స్కాలర్‌గా ఆక్స్‌ఫర్డ్‌లో ఎంఫిల్ చదివిన ఆమె, 2018లో మాన్‌హట్టన్ డిస్ట్రిక్ట్ అటార్నీ యాంటిక్విటీస్ ట్రాఫికింగ్ యూనిట్ (ఏటీయూ)లో చేరారు.

ఈ సంస్థలో ఆమె ఆర్ట్ క్రైమ్‌పై పరిశోధనలు చేశారు.15 వేర్వేరు దేశాలకు చెందిన దొంగిలించబడిన 1100కు పైగా కళాఖండాలను స్వదేశానికి తరలించడానికి అంతర్జాతీయ, ఫెడరల్ లా ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులతో అప్సర సమన్వయం చేసుకున్నారు.

"""/" / అయ్యర్ 2020 చివరిలో హార్వర్డ్ లా స్కూల్‌లో చేరారు.అక్కడ ఇంటర్నేషనల్ హ్యూమన్ రైట్స్ క్లినిక్‌లో విద్యార్ధిని, అలాగే సౌత్ ఏషియన్ లా స్టూడెంట్స్ అసోసియేషన్ సభ్యురాలు.

చట్టవిరుద్ధంగా పురాతన వస్తువుల అక్రమ రవాణాకు వ్యతిరేకంగా పోరాడేందుకు గాను 2021-22లో హార్వర్డ్ లా స్కూల్ నుంచి సెలవు తీసుకుని డీఏ కార్యాలయానికి అప్సర తిరిగి వచ్చారు.

ఈ క్రమంలో అంతర్జాతీయ స్థాయిలో పురాతన వస్తువుల అక్రమ రవాణాపై పరిశోధన చేసి ఏటీయూ డిప్యూటీగా ఎదిగారు.

"""/" / ఇకపోతే.1887లో నెలకొల్పబడిన ‘‘ది లా రివ్యూ’’కు అమెరికాతో పాటు ప్రపంచవ్యాప్తంగా మంచి గుర్తింపు వుంది.

అప్పటి ఫ్యూచర్ సుప్రీంకోర్ట్ న్యాయమూర్తి జస్టిస్ లూయిస్ డీ బ్రాండీస్ దీనిని స్థాపించారు.

ప్రపంచంలోని ఏ లా జర్నల్‌లోనూ లేనంత పెద్ద సర్క్యూలేషన్‌తో ఇది పూర్తిగా విద్యార్థుల సంపాదకీయంలో నడుస్తోంది.

అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా ఈ జర్నల్‌ తొలి నల్లజాతి అధ్యక్షుడిగా వ్యవహరించారు.

పిఠాపురం నియోజకవర్గం ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేసిన పవన్ కళ్యాణ్..