మహావీర్ జయంతి : జో బైడెన్ దంపతుల విషెస్ , థ్యాంక్స్ చెప్పిన అజయ్ భూటోరియా
TeluguStop.com
జైనుల పవిత్ర పర్వదినం మహావీర్ జయంతిని( Mahavir Jayanti ) పురస్కరించుకుని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్( US President Joe Biden ) శుభాకాంక్షలు తెలియజేశారు.
ఈ సందర్భంగా బైడెన్‌కు కృతజ్ఞతలు తెలిపారు భారతీయ అమెరికన్ వ్యాపారవేత్త, జైన కమ్యూనిటీ నేత అజయ్ భూటోరియా.
( Ajay Bhutoria ) ఆయన ఆసియా అమెరికన్ అండ్ నేటివ్ హవాయి/పసిఫిక్ ఐలాండర్ కమీషనర్‌పై అమెరికా అధ్యక్షుడికి సలహాదారుడిగానూ విధులు నిర్వర్తిస్తున్నారు.
జైనమత 24వ తీర్ధంకరుడైన మహావీర్ అహింస, సత్య సూత్రాలను నొక్కిచెప్పే కాలాతీత బోధనలు చేశారని అజయ్ గుర్తుచేశారు.
ఆధునిక ప్రపంచంలో మహావీర్ బోధనల ఔచిత్యాన్ని ఆయన ప్రస్తావించారు.ప్రపంచ సవాళ్ల మధ్య ప్రేమ, ఆనందం, సామరస్య విలువలు గతంలో కంటే ముఖ్యమైనవని అజయ్ అన్నారు.
మహావీర్ జయంతిని పురస్కరించుకుని వివిధ వర్గాల మధ్య అవగాహనను పెంపొందించేందుకు ప్రయత్నించిన అధ్యక్షుడు బైడెన్‌కు భూటోరియా కృతజ్ఞతలు తెలిపారు.
"""/" /
కాగా.అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఆయన సతీమణి ప్రథమ మహిళ జిల్ బైడెన్‌లు( Jill Biden ) సోమవారం (స్థానిక కాలమానం ప్రకారం) మహావీర్ జయంతి సందర్భంగా జైన మతస్తులకు శుభాకాంక్షలు తెలిపారు.
ఈ మేరకు వారు ఎక్స్‌లో ట్వీట్ చేశారు.మహావీరుడి జయంతిని ప్రపంచవ్యాప్తంగా జైన సమాజం భక్తి శ్రద్ధలతో జరుపుకుంది.
ఆయన తన బోధనల ద్వారా శాంతి, సామరస్యాన్ని వ్యాప్తి చేశారు.మహావీర్ జయంతి సందర్భంగా ఆలయాల్లో ప్రార్థనలు చేయడం, ఊరేగింపులు, మహావీరుడిని ఆరాధించే శ్లోకాలు పాడటం, శరీరం ఆత్మను శుద్ధి చేయడానికి ఉపవాసం చేయడం, దాతృత్వం, సాంస్కృతిక కార్యక్రమాలు, ఉపన్యాసాలు వంటి ఆచారాలను నిర్వహించారు.
"""/" /
వర్ధమాన మహావీరుడు వైశాలి నగరానికి సమీపంలోని కుంద గ్రామంలో క్రీస్తుపూర్వం 599లో జన్మించాడు.
తండ్రి సిద్ధార్ధుడు, తల్లి త్రిశల.సిద్ధార్ధుడు జ్ఞత్రిక తెగకు అధిపతి.
అలాగే త్రిశల.వైశాలి పాలకుడైన అచ్చవి రాజు చేతకుని సోదరి.
మహావీరుడి భార్య యశోద.వీరి కుమార్తె అనోజ్ఞ, అల్లుడు జమాలి.
తన తల్లిదండ్రుల మరణం తర్వాత వర్ధమాన మహావీరుడు సత్యాన్వేషణ కోసం ఇంటిని విడిచిపెట్టాడు.
ఈ క్రమంలో తూర్పు భారతదేశంలోని జృంభిక గ్రామంలో సాలవృక్షం కింద కైవల్యం పొందినట్లుగా జైన గ్రంథాలు చెబుతున్నాయి.
మహావీరుడు క్రీస్తుపూర్వం 468లో తన 72వ ఏట రాజగృహం సమీపంలోని పావాపురిలో నిర్యాణం చెందాడు.
గేమ్ ఛేంజర్ మూవీ కలెక్షన్లపై డైరెక్టర్ ఆర్జీవీ సెటైరికల్ ట్వీట్లు.. అలాంటి కామెంట్స్ చేస్తూ?