Kamal Haasan : బాలనటుడిగా తొలి సినిమాకే రాష్ట్రపతి అవార్డ్.. కమల్ హాసన్ బర్త్ డె స్పెషల్ స్టోరీ మీకు తెలుసా?

విశ్వ నటుడు కమలహాసన్( Kamal Haasan ) గురించి మనందరికీ తెలిసిందే.ఈయన భాషతో సంబంధం లేకుండా ఎన్నో సినిమాలలో నటించి అన్ని వర్గాల ప్రేక్షకులను మెప్పించిన విషయం తెలిసిందే.

తన నటనతో ఎంతోమంది ప్రేక్షకులు, అభిమానుల మనసులలో చెరగని ముద్రను వేసుకున్నారు కమల్ హాసన్.

ఆరేళ్ళ వయసులో చైల్డ్ ఆర్టిస్టుగా సినిమా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన కమల్ హాసన్ మొదటి సినిమాకే రాష్ట్రపతి అవార్డును అందుకున్నారు.

అలా మొదలైన కమల్ సినీ ప్రయాణం ఎవరూ చేయలేని పాత్రలు, ఎన్నో సాహసాలు, మరెన్నో అవార్డులు అందుకొని లోకనాయకుడిగా గుర్తింపు తెచ్చుకున్నారు.

కాగా నేడు అనగా నవంబర్ 7 ఆయన పుట్టినరోజు సందర్భంగా ఆయన సక్సెస్ఫుల్ స్పెషల్ స్టోరీ గురించి తెలుసుకుందాం.

"""/" / 1960లో జెమినీ గణేశన్, మహానటి సావిత్రి ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన కలతూర్ కన్నమ్మ( Kalathur Kannamma ) సినిమాతో చైల్డ్ ఆర్టిస్ట్ గా కెరీర్ ను మొదలుపెట్టారు.

ఈ సినిమాలో తన నటనతో రాష్ట్రపతినే మెప్పించారు.మొదటి సినిమాకే ఆరేళ్ళ వయసులో రాష్ట్రపతి చేతులు మీదుగా ప్రెసిడెంట్ అవార్డు అందుకున్నారు.

ఆ తరువాత మరికొన్ని సినిమాల్లో చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించి మెప్పించారు కమల్ హాసన్.

1963 వరకు చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించిన కమల్ హాసన్ ఆ తరువాత చదువు కోసం ఒక ఏడేళ్లు సినిమా నుంచి గ్యాప్ తీసుకున్నారు.

1970 నుంచి మళ్ళీ సినీ రంగంలో ప్రయాణం మొదలు పెట్టారు.అయితే ఈసారి నటుడిగా కాకుండా అసిస్టెంట్ డాన్స్ కొరియోగ్రాఫర్ గా పలు సినిమాల్లో పని చేశారు.

"""/" / తర్వాత 1973 నుంచి అరంగేట్రం అనే తమిళ సినిమాతో నటుడిగా ప్రయాణం మొదలుపెట్టారు.

తర్వాత సపోర్టింగ్ రోల్స్ చేస్తూ వచ్చారు.1974లో మలయాళ మూవీ కన్యాకుమారి సినిమాతో హీరోగా కెరీర్ను స్టార్ట్ చేశారు.

ఇక హీరోగా చేసిన ఈ మొదటి సినిమాకే మలయాళంలో బెస్ట్ యాక్టర్ గా ఫిలిం ఫేర్ అవార్డుని అందుకున్నారు.

మలయాళ సినిమాలతో పాటు తమిళ సినిమాలు కూడా చేస్తూ వచ్చారు.ఆ తర్వాత కన్నడ బెంగాలీ తెలుగు హిందీ భాషల్లో కూడా నటించి మెప్పించారు.

1978లో తెలుగులో బాలచందర్ డైరెక్ట్ చేసిన ఈ సినిమా క్లాసిక్ గా నిలిచింది.

ఇదే సినిమాని హిందీలో రీమేక్ చేస్తూ 1981లో కమల్ బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చారు.

తర్వాత సాగర సంగమం( Sagara Sangamam ), స్వాతి ముత్యం రెండు సినిమాలకు తెలుగులో నంది అవార్డు, ఫిలిం ఫేర్ అవార్డుని అందుకున్నారు.

అలా కేవలం నటుడు గానే కాకుండా రైటర్‌గా, డైరెక్టర్‌గా, సింగర్‌గా, డాన్సర్‌గా, టెలివిజన్ ప్రెజెంటర్‌గా, సామాజిక కార్యకర్తగా, పొలిటిషన్‌గా.

ఇలా సినీ రాజకీయ రంగంలో తనదైన ముద్ర వేసి దశావతార మూర్తి అనిపించుకున్నారు.

ఈ ఏడాదితో 69 ఏళ్ళు పూర్తి చేసుకుంటున్న కమల్ హాసన్ ఇప్పటికీ కూడా నటుడిగా మూడు సినిమాల్లో నటిస్తూ, నిర్మాతగా కూడా మూడు చిత్రాలు నిర్మిస్తూ దూసుకు పోతున్నారు.

ఈ వయసులో కూడా అదే ఊపుతో సినిమాలలో నటిస్తూ నిర్మాతగా వ్యవహరిస్తూ ఎంతో మందికి ఆదర్శంగా నిలుస్తున్నారు.

చంద్రబాబుపై సీబీఐ విచారణ .. హైకోర్టులో పిటిషన్