‘ఇండియన్ 2’ షూటింగ్ ఇంకా ఎన్ని రోజులు చేస్తారు సార్లు..?
TeluguStop.com
యూనివర్శిల్ స్టార్ కమల్ హాసన్( Kamal Haasan ), శంకర్ దర్శకత్వం లో చాలా సంవత్సరాల క్రితం వచ్చిన భారతీయుడు ఎంతటి భారీ విజయాన్ని సొంతం చేసుకుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.
అప్పట్లోనే భారీ పాన్ ఇండియా మూవీగా నిలవడంతో పాటు భారీ విజయాన్ని సొంతం చేసుకుంది.
తమిళంలో రూపొంది హిందీ మరియు తెలుగు లో రికార్డు స్థాయి వసూళ్లు నమోదు చేయడం జరిగింది.
అందుకే గత పదేళ్లు గా అభిమానులు ఇండియన్ 2 సినిమా కోసం ఎదురు చూస్తున్నారు.
"""/" / మూడు నాలుగు సంవత్సరాల క్రితం ఈ సినిమా షూటింగ్ ను దర్శకుడు శంకర్( Shankar ) ప్రారంభించాడు.
కొన్ని కారణాల వల్ల సినిమా ఆలస్యం అవుతూ వచ్చింది.ఆ మద్య సినిమా మొత్తం ఆగిపోయింది అని రామ్ చరణ్ సినిమా ను శంకర్ మొదలు పెట్టాడు.
ఇంతలోనే కోర్టు ఆదేశాలు.ఇతర విషయాల కారణంగా ఇండియన్ 2 సినిమా ను మళ్లీ మొదలు పెట్టాడు.
శంకర్ చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుని ఇండియన్ 2 సినిమా ను చేస్తున్న విషయం తెల్సిందే.
ఇండియన్ 2 సినిమా ను రికార్డు బ్రేకింగ్ బడ్జెట్ తో రూపొందిస్తున్నారు. """/" / షూటింగ్ ప్రారంభం అయ్యి ఇన్నాళ్లు అయినా కూడా ఇంకా కొనసాగుతూనే ఉంది.
ఈ ఏడాది లో సినిమా వచ్చే అవకాశాలు ఉన్నాయి అని కొందరు అనుకున్నారు.
కానీ ప్రస్తుత పరిస్థితి చూస్తూ ఉంటే ఇండియన్ 2 సినిమా ఈ ఏడాది వచ్చేనా అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.
ఇంతకు ఇండియన్ 2 సినిమా ఇంకా ఎన్నాళ్లు షూటింగ్ చేస్తారు అంటూ అభిమానులు ప్రశ్నిస్తున్నారు.
సోషల్ మీడియా( Social Media ) లో కమల్ అభిమానులు చాలా మంది దర్శకుడు శంకర్ ను ట్యాగ్ చేసి ఇండియన్ 2 సినిమా షూటింగ్ పూర్తి అయ్యేది ఎప్పుడు సర్ అంటూ ప్రశ్నిస్తున్నారు.
శంకర్ మాత్రం ఆ కామెంట్స్ కు రెస్పాండ్ అవ్వడం లేదు.ఇక కమల్ హాసన్ కూడా ఇండియన్ 2 ఎప్పుడు పూర్తి అయ్యే విషయంలో క్లారిటీ ఇవ్వడం లేదు.
బాహుబలి ప్రభాస్ కు ఇష్టమైన నాగార్జున హిట్ సాంగ్ ఏంటో తెలిస్తే షాకవ్వాల్సిందే!