ఇండియన్ 2పై కమల్ కామెంట్..!

శంకర్ డైరక్షన్ లో కమల్ హాసన్ హీరోగా పాతికేళ్ల తర్వాత సూపర్ హిట్ సీక్వల్ గా ఇండియన్ 2 గ్రాండ్ గా మొదలుపెట్టారు.

లైకా ప్రొడక్షన్స్ నిర్మిస్తున్న ఈ సినిమా మొదలైన నాటి నుండి ఏదో ఒక విధంగా సమస్యలు వస్తూనే ఉన్నాయి.

షూటింగ్ టైం లో క్రేన్ యాక్సిడెంట్ సినిమా మీద బాగా ఎఫెక్ట్ పడేలా చేసింది.

ఇక శంకర్ తో లైకా ఫైనాన్షియల్ ఫైట్స్ సినిమాను ఆగిపోయేలా చేశాయి.ఇండియన్ 2 ని అర్ధాంతరంగా ఆపేసి రాం చరణ్ తో సినిమా చేసేందుకు సన్నాహాలు చేస్తున్నాడు శంకర్.

ఇండియన్ 2 దాదాపు క్యాన్సల్ అయినట్టే అని అనుకున్నారు కాని లేటెస్ట్ గా ఇండియన్ 2 సినిమాపై స్పందించి ఫ్యాన్స్ కు మళ్లీ ఆశలు కలిగేలా చేశాడు కమల్ హాసన్.

ఇండియన్ 2 సినిమా 60 శాతం షూటింగ్ పూర్తి చేసుకుందన్న విషయాన్ని వెల్లడించారు కమల్ హాసన్.

అంతేకాదు ఈ సినిమా త్వరలోనే మళ్లీ సెట్స్ మీదకు వెళ్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

ప్రస్తుతం విక్రం తో కమల్ ఒక సినిమా చేస్తున్నారు.ఆ సినిమా తర్వాత శంకర్ తో ఇండియన్ 2 మళ్లీ సెట్స్ మీh3 Class=subheader-styleదకు/h3p తీసుకెళ్తారని తెలుస్తుంది.

కమల్ మధ్యలో ఉండి మిగతా గొడవలన్ని పరిష్కరిస్తున్నట్టు తెలుస్తుంది.

యువతిపై దాడి చేసిన కొండముచ్చు.. భయానక వీడియో వైరల్..