టెస్ట్ సిరీస్ టైటిల్ గెలిచిన భారత్.. విజయంపై స్పందించిన కెప్టెన్ రోహిత్ శర్మ..!
TeluguStop.com
వెస్టిండీస్ పర్యటనలో భాగంగా భారత్-వెస్టిండీస్ ( India-West Indies )మధ్య రెండు టెస్టు మ్యాచ్ల సిరీస్ జరిగింది.
తొలి టెస్ట్ మ్యాచ్లో ఘన విజయం సాధించిన భారత్ రెండవ టెస్ట్ మ్యాచ్లో అదే ఫామ్ కొనసాగించి ఘనవిజయం సాధించాలి అనుకుంది.
కానీ రెండో టెస్ట్ మ్యాచ్ వర్షం కారణంగా డ్రా అయింది.సోమవారం ఆఖరి సెషన్ వరకు ఎదురుచూసిన వర్షం తగ్గుముఖం పట్టకపోవడంతో ఎంపైర్లు ఆటను రద్దు చేశారు.
దీంతో క్లీన్ స్వీప్ చేయాలి అనుకునే భారత జట్టు కల నెరవేలే లేదు.
తొలి ఇన్నింగ్స్ లో ఐదు వికెట్లు తీసిన మహమ్మద్ సిరాజ్( Mohammed Siraj ) కు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది.
ఇక టెస్ట్ సిరీస్ విజయంపై భారత జట్టు కెప్టెన్ రోహిత్ శర్మ ( Captain Rohit Sharma )స్పందిస్తూ.
ప్రతి విజయం తమకు కొత్త పాఠాలు నేర్పుతుందని తెలిపాడు.ఈ సిరీస్ లో తమ జట్టు ప్రదర్శన అద్భుతంగా ఉందని తెలిపాడు.
తొలి టెస్ట్ మ్యాచ్లో ఎలాంటి ఆటను ప్రదర్శించామో రెండవ టెస్ట్ మ్యాచ్లో కూడా అలాంటి ఆట ప్రదర్శననే కనబరిచాము.
రెండవ టెస్ట్ మ్యాచ్లో కూడా ఘనవిజయం సాధిస్తామని అనుకున్నాం.ప్రత్యర్థి ముందు భారీ టార్గెట్ పెట్టాం.
"""/" /
కానీ దురదృష్టవశాత్తు ఆఖరి రోజు వర్షం కారణంగా ఆట ఆడెందుకు సాధ్యపడలేదు.
ఇక ఫలితం లేకుండానే మ్యాచ్ ముగిసిపోయింది.ఇక తమ జట్టు ఆటగాళ్ల విషయానికి వస్తే మహమ్మద్ సిరాజ్ తన సత్తా ఏంటో మరొకసారి నిరూపించుకున్నాడు.
అయితే ప్రతి ఒక్క ఫాస్ట్ బౌలర్ కూడా నాయకత్వం వహించే విధంగా ఉండాలని తాను ఎప్పుడూ కోరుకుంటున్నట్లు తెలిపాడు.
"""/" /
ఇక ఇషాన్ కిషన్( Ishan Kishan ) కూడా తనకు ఇచ్చిన అవకాశాన్ని బాగా ఉపయోగించుకున్నాడు.
కాస్త దూకుడుగా ఆడి పరుగులు రాబట్టాలని ముందుగా ప్రమోట్ చేశాం అని తెలిపాడు.
ఇక విరాట్ కోహ్లీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సింది ఏమీ లేదు.విరాట్ కోహ్లీని యువ ఆటగాళ్లు ఆదర్శంగా తీసుకుంటే ఉన్నత స్థాయికి రాణించగలుగుతారని తెలిపాడు.
ప్రైవేట్ పార్ట్‌పై పాము కాటు.. ఇన్‌ఫ్లుయెన్సర్ నరకయాతన.. వీడియో చూస్తే కన్నీళ్లు ఆగవు!