వరల్డ్ కప్ టోర్నీ మొదటి మ్యాచ్ ఆసీస్ పై గెలిచిన భారత్..!!

వన్డే వరల్డ్ కప్ టోర్నీలో మొదటి మ్యాచ్ ఆస్ట్రేలియా పై భారత్ గెలవడం జరిగింది.

ముందుగా టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆసీస్ 199 పరుగులకు కుప్పకూలిపోయింది.చెన్నైలోని చెపాక్ మైదానంలో జరిగిన ఈ మ్యాచ్ లో 49.

3 ఓవర్ లలో ఆస్ట్రేలియా టీంని భారత్ అల్ అవుట్ చేయడం జరిగింది.

టీమిండియా బౌలర్లు సమిష్టిగా రాణించారు.ముఖ్యంగా స్పిన్నర్లు జడేజా, కుల్దీప్, అశ్విన్.

అద్భుతంగా రాణించారు.అయితే అనంతరం 199 పరుగుల లక్ష్యమే సెకండ్ బ్యాటింగ్ దిగిన భారత్ ప్రారంభంలోనే మూడు వికెట్లు కోల్పోయింది.

"""/" /   కేవలం రెండు పరుగులకే రోహిత్ శర్మ, ఇషాన్, శ్రేయాస్ ముగ్గురు డక్ ఔట్ అయ్యారు.

ఇలాంటి క్లిష్ట సమయంలో విరాట్ కోహ్లీ(85), కేఎల్ రాహుల్ (97*) పరుగులు చేసి సమిష్టిగా రాణించారు.

ఇద్దరూ క్రీజ్ లో నిలదొక్కుకొని.కూల్ గేమ్ ఆడి.

భారత్ ను విజయతీరాలకు చేర్చారు.చివరిలో కోహ్లీ అవుట్ కాగా.

హార్దిక్ పాండ్యా(11*) పరుగులు చేయడం జరిగింది.41.

2 ఓవర్లలోనే భారత్ టార్గెట్ నీ ఛేదించింది.ఆస్ట్రేలియా పై విజయంతో వన్డే వరల్డ్ కప్ టోర్నీలో భారత్ మొదటి విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది.

బ్లాక్ బస్టర్ హిట్స్‌ను కొద్దిలో మిస్ చేసుకున్న స్టార్ యాక్టర్స్‌.. ఎవరంటే..?