ఆసియా కప్ లో మలేషియాను చిత్తు చేసిన టీమిండియా.. తెలుగు తేజం మెరుపు బ్యాటింగ్..

ఆసియా కప్ లో టీమిండియా పురుషుల జట్టు మధ్యలోనే నిష్క్రమించిన సంగతి తెలిసిందే.

కానీ మహిళల క్రికెట్ జట్టు మాత్రం ఆసియా కప్ లో మంచి ఫామ్ తో విజయాలను నమోదు చేస్తుంది.

మహిళల ఆసియా కప్​లో టీమ్ఇండియా వరుస విజయాల తో దూసుకెళ్తుంది.మొదటి మ్యాచ్​ గెలిచి ఊపు మీదున్న హర్మన్ సేన రెండో మ్యాచ్ ​లోనూ అద్భుత ప్రదర్శన చేసి 30 పరుగుల తేడా తో మలేసియా ను చిత్తుగా ఓడించింది.

మొదట గా టాస్ ఓడి బ్యాటింగ్​ చేసిని హర్మన్ సేన ఇన్నింగ్స్ ముగిసే సమయానికి నాలుగు వికెట్లు నష్టపోయి 181 పరుగులు చేసింది.

టీమ్​ఇండియా బ్యాటర్, తెలుగు తేజం​ సబ్బినేని మేఘన 53 బంతుల్లో 69 పరుగులు చేసి టీమిండియా స్కోర్ బోర్డ్ ను పరుగులు పెట్టించింది.

11 ఫోర్లు, 1 సిక్స్‌ తో తన టీ20 కెరీర్ లో మొదటి అర్ధ సెంచరీని మేఘన నమోదు చేసింది.

మరో బ్యాటర్ శఫాలి వర్మ 39 బంతుల్లో 46 పరుగులు, రిచా ఘోష్​ 19 బంతుల్లో 33 పరుగులు చేసి స్కోర్ బోర్డు ను పరుగులు పెట్టించారు.

అనంతరం బ్యాటింగ్​ చేసిన మలేసియా 5.2 ఓవర్ల లో రెండు వికెట్లు కోల్పోయి 16 పరుగులు చేసింది.

"""/"/ ఇంతలో వర్షం కురవడం వల్ల మ్యాచ్​ చాలా సమయం ఆగిపోయింది.

వర్షం ఎంతవరకు తగ్గకపోవడంతో అంపైర్లు డీఎల్​ఎస్​ పద్ధతి లో 30 పరుగుల తేడా తో భారత్ జట్టు​ గెలిచినట్లు ప్రకటించారు.

మహిళల ఆసియా కప్​ 2022 లో భారత్​ జట్టు దూసుకుపోతోంది.శ్రీలంకపై మొదటి మ్యాచ్​ గెలిచి శుభారంభం చేసిన టీమ్ఇండియా రెండో మ్యాచ్​లో మలేసియాతో తలపడి విజయం సాధించింది.

ఈ మ్యాచ్​లో టీమ్ఇండియా 30 పరుగుల తేడాతో విజయం సాధించింది.మహిళల జట్టు ఇలాగే విజయాలతో ముందుకు వెళ్లి ఆసియా కప్ గెలవాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం.

పోలవరం కోసం విదేశీ నిపుణులు రప్పిస్తున్నాం సీఎం చంద్రబాబు కీలక ప్రకటన..!!